రాంచీ: బీజేపీ ‘పిల్ మాస్టర్ గ్యాంగ్’ మారిందని జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ సతీమణి జేఎంఎం ఎమ్మెల్యే కల్పనా సోరెన్ విమర్శలు చేశారు. జార్ఖండ్ ప్రజలకు ప్రయోజనం చేకూర్చే ప్రభుత్వ పథకాలను బీజేపీ అడ్డుకుంటోందని మండిపడ్డారు. బీజేపీ చర్యలకు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గట్టి ఎదురుదెబ్బ తగులుతుందని అన్నారు.సోమవారం ‘మైయాన్ సమ్మాన్ యాత్ర'లో భాగంగా గుమ్లా జిల్లాలో జరిగిన ర్యాలీలో కల్పనా సోరెన్ మాట్లాడారు.
‘‘జార్ఖండ్ ముఖ్యమంత్రి మైయాన్ సమ్మాన్ యోజన (జేఎంఎంఎస్‌వై)కి వ్యతిరేకంగా బీజేపీ ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసింది. ప్రజలకు మంచి చేసే ఏ పాలసీని ప్రవేశపెట్టినా.. బీజేపీ పిల్ వేస్తుంది. జార్ఖండ్ ప్రజల కోసం ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ నేతృత్వంలోని ప్రభుత్వం తీసుకువచచ్చే పథకాలకు అడ్డంకులు సృష్టించేందుకు ‘పిల్ మాస్టర్ గ్యాంగ్’గా మారింది’’ అని అన్నారు.
గిరిజన వర్గాల డిమాండ్లను కేంద్రంలోని బీజేపీ విస్మరిస్తోందని కల్పనా సోరెన్ మండిపడ్డారు. ఆదివాసీల గుర్తింపు వారి సంస్కృతి, సర్నా మత నియమావళిలో ఉందని తెలిపారు. జార్ఖండ్ అసెంబ్లీలో మేము ఈ కోడ్ కోసం తీర్మానాన్ని ఆమోదించామని అన్నారు. కానీ మన సంస్కృతిని రక్షించడానికి, ప్రత్యేక సర్నా కోడ్‌ను అందించటం బీజేపీకి ఇష్టం లేదని ఆరోపించారు. జార్ఖండ్, గిరిజనుల గుర్తింపు సీఎం హేమంత్ సోరెన్ నేతృత్వంలోని ప్రభుత్వం మాత్రమే కాపాడగలదని అన్నారామె.
Comments
Please login to add a commentAdd a comment