JMM leader
-
బీజేపీ ‘పిల్ మాస్టర్ గ్యాంగ్’గా మారింది: కల్పనా సోరెన్
రాంచీ: బీజేపీ ‘పిల్ మాస్టర్ గ్యాంగ్’ మారిందని జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ సతీమణి జేఎంఎం ఎమ్మెల్యే కల్పనా సోరెన్ విమర్శలు చేశారు. జార్ఖండ్ ప్రజలకు ప్రయోజనం చేకూర్చే ప్రభుత్వ పథకాలను బీజేపీ అడ్డుకుంటోందని మండిపడ్డారు. బీజేపీ చర్యలకు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గట్టి ఎదురుదెబ్బ తగులుతుందని అన్నారు.సోమవారం ‘మైయాన్ సమ్మాన్ యాత్ర'లో భాగంగా గుమ్లా జిల్లాలో జరిగిన ర్యాలీలో కల్పనా సోరెన్ మాట్లాడారు.‘‘జార్ఖండ్ ముఖ్యమంత్రి మైయాన్ సమ్మాన్ యోజన (జేఎంఎంఎస్‌వై)కి వ్యతిరేకంగా బీజేపీ ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసింది. ప్రజలకు మంచి చేసే ఏ పాలసీని ప్రవేశపెట్టినా.. బీజేపీ పిల్ వేస్తుంది. జార్ఖండ్ ప్రజల కోసం ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ నేతృత్వంలోని ప్రభుత్వం తీసుకువచచ్చే పథకాలకు అడ్డంకులు సృష్టించేందుకు ‘పిల్ మాస్టర్ గ్యాంగ్’గా మారింది’’ అని అన్నారు.గిరిజన వర్గాల డిమాండ్లను కేంద్రంలోని బీజేపీ విస్మరిస్తోందని కల్పనా సోరెన్ మండిపడ్డారు. ఆదివాసీల గుర్తింపు వారి సంస్కృతి, సర్నా మత నియమావళిలో ఉందని తెలిపారు. జార్ఖండ్ అసెంబ్లీలో మేము ఈ కోడ్ కోసం తీర్మానాన్ని ఆమోదించామని అన్నారు. కానీ మన సంస్కృతిని రక్షించడానికి, ప్రత్యేక సర్నా కోడ్‌ను అందించటం బీజేపీకి ఇష్టం లేదని ఆరోపించారు. జార్ఖండ్, గిరిజనుల గుర్తింపు సీఎం హేమంత్ సోరెన్ నేతృత్వంలోని ప్రభుత్వం మాత్రమే కాపాడగలదని అన్నారామె.చదవడి: హర్యానా: ‘సీఎం సైనీ మంచి వ్యక్తి.. కానీ’.. దిగ్విజయ్ చౌతాలా ఆసక్తికర వ్యాఖ్యలు -
అనారోగ్యంతో ఆస్పత్రిలో శిబు సోరెన్
రాంచీ: జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) చీఫ్ శిబు సోరెన్(79) అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు. ఆయనకు జరిపి శ్వాసకోశ ఇన్ఫెక్షన్ను గుర్తించినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. సోరెన్ ఆరోగ్యం నిలకడగా ఉందని, చికిత్స కొనసాగుతోందని ఆయన కుమారుడు జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ట్వీట్ చేశారు. 2005–10 మధ్య సోరెన్ జార్ఖండ్ సీఎంగా పనిచేశారు. లోక్‌సభకు 8 పర్యాయాలు ఎన్నికయ్యారు. ప్రస్తుతం రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. -
‘అండర్వేర్లు కొనుక్కునేందుకు ఢిల్లీ వెళ్లా’!
రాంచీ: జార్ఖండ్ రాజకీయాల్లో ఊగిసలాట కొనసాగుతున్న వేళ.. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌కు కొత్త తలనొప్పులు వచ్చి పడుతున్నాయ్. అందులో సోదరుడు బసంత్ వ్యవహరశైలి కూడా మరింత కాకరేపుతోంది. డుమ్కా ఎమ్మెల్యే అయిన బసంత్ సోరెన్ తన నియోజకవర్గాల్లో జరుగుతున్న అఘయిత్యాలపై స్పందిస్తున్న తీరు వివాదాస్పదంగా మారుతోంది. డుమ్కా ప్రాంతంలో ఓ ప్రేమోన్మాది.. మైనర్‌పై పెట్రోల్ పోసి నిప్పు అంటించి చంపిన ఘటన, ఆ వెంటనే ఇద్దరు మైనర్ల హత్యాచార ఘటన చోటు చేసుకుంది. గత ఆరు నెలల్లో డుమ్కాలో మైనర్లపై దాడుల ఘటనలు ఏడుకు పైనే జరిగాయి. దీంతో జేఎంఎం పాలనపై తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది బీజేపీ. ఈ తరుణంలో.. శాంతి భద్రతలు పర్యవేక్షించకుండా బసంత్ సోరెన్ ఢిల్లీ పర్యటించడం వివాదాస్పదంగా మారింది. ఢిల్లీ నుంచి తిరిగొచ్చిన అనంతరం బసంత్.. మైనర్ల కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా.. ఇక్కడ ఇంత నేరాలు జరుగుతుంటే ఢిల్లీకి ఎందుకు వెళ్లారంటూ మీడియా ప్రశ్నించింది. దానికి ఆయన.. ‘‘నా దగ్గరి అండర్వేర్లు అయిపోయాయి. అందుకే వాటిని కొనుక్కునేందుకు ఢిల్లీకి వెళ్లా. కొనుక్కుని వచ్చా’’ అంటూ నవ్వుతూ సమాధానం ఇచ్చారాయన. నిజంగానే అందుకే వెళ్లారా? అని మీడియా మరోసారి ప్రశ్నించగా.. ‘అవును..’ అంటూ సమాధానం ఇచ్చారాయ. వెటకారంగా ఆయన ఇచ్చిన సమాధానంపై బీజేపీ విమర్శలు ఎక్కుపెట్టింది. #WATCH | Dumka: "I had run out of undergarments, so I went to Delhi to purchase them. I get them from there," says JMM MLA and Jharkhand CM Hemant Soren's brother, Basant Soren when asked about his visit to Delhi amid recent political unrest in the state. (07.09.2022) pic.twitter.com/GBiNWZaLzr — ANI (@ANI) September 8, 2022 శిబు సోరెన్ కొడుకు, పేదల.. గిరిజనుల నేత అయిన బసంత్ సోరెన్.. ఢిల్లీకి అండర్వేర్లు కొనుక్కునేందుకు వెళ్లాడంటూ వెటకారంగా స్పందించింది బీజేపీ. ఇక జార్ఖండ్‌లో రాజకీయ అనిశ్చితి తలెత్తగా.. బల నిరూపణలో నెగ్గారు జేఎంఎం నేత, సీఎం హేమంత్ సోరెన్. ప్రస్తుతం అక్కడి రాజకీయాలు నిలకడగానే ఉన్నాయని ఆయన అంటున్నారు. ఇదీ చదవండి: థర్డ్ ఫ్రంట్ కాదు.. మాది మెయిన్ ఫ్రంట్ -
వారు పెళ్లి చేసుకోరు..కానీ మహిళలపై లైంగిక దాడులు!
రాంచీ : బీజేపీ నేతలపై జార్ఖండ్ మాజీ సీఎం, జేఎంఎం చీఫ్ హేమంత్ సొరేన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జార్ఖండ్‌లోని పకూర్‌లో ఎన్నికల ప్రచార ర్యాలీని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ కాషాయ పార్టీ నేతలు పెళ్లి చేసుకోరు కానీ మహిళలపై లైంగిక దాడులకు పాల్పడతారని అన్నారు. యూపీలోని ఉన్నావ్, హైదరాబాద్‌లో దిశ హత్యాచార ఘటనలను ప్రస్తావిస్తూ దేశంలో పలువురు మహిళలను సజీవ దహనం చేస్తున్నారు..యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ కాషాయ దుస్తులు ధరించి తిరగడం చూస్తున్నామని వ్యాఖ్యానించారు. బీజేపీ కార్యకర్తలు పెళ్లిళ్లు చేసుకోరు కానీ కాషాయ దుస్తులు ధరించి మహిళలపై లైంగిక దాడులకు పాల్పడతారని హేమంత్ సొరేన్ అన్నారు.మహిళలకు భద్రత కల్పించడంలో బీజేపీ విఫలమైందని, నేరస్తులకు మాత్రం భద్రత కల్పిస్తోందని ఆయన దుయ్యబట్టారు. మరోవైపు యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ సైతం జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో సుడిగాలి ప్రచారం చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్, జేఎంఎం, ఆర్జేడీ కూటమి తరపున హేమంత్ సొరేన్ ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రజల ముందుకు వచ్చారు. -
వివాదంగా మారిన ఆదివాసీల ముద్దుల పోటీలు
-
వివాదంగా మారిన ఆదివాసీల ముద్దుల పోటీలు
రాంచీ : పబ్లిక్‌గా ముద్దులు పెట్టుకోవటం అనేది భారతీయ సంస్కృతిలో భాగం కాదనేది కొందరి అభిప్రాయం. అయితే ఆధునికత పేరిట ఈ మధ్య యువత పెద్దగా పట్టించుకోవటం లేదు. కానీ, జార్ఖండ్‌లో ఈ మధ్య ఓ గ్రామంలో నిర్వహించిన ముద్దుల పోటీలు వివాదానికి కేంద్ర బిందువుగా మారాయి. రాంచీకి 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాకుర్ జిల్లా డుమారియా గ్రామంలో ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. ఆ ప్రాంత ఎమెల్యే సిమన్ మరాండి(జేఎంఎం) నేతృత్వంలోనే ఈ పోటీలు జరుగుతుండటం విశేషం. పెళ్లయిన గిరిజన దంపతులు ఈ పోటీల్లో పాల్గొంటారు. ఎవరు ఎంత ఎక్కువ సేపు ముద్దు పెట్టుకుంటే.. వారి మధ్య అంత ప్రేమ ఉన్నట్లు లెక్క. చివరకు మిగిలిన జంటకు బహుమతులను అందిస్తారు. ‘‘ఆదివాసీయులు అమాయకులు.. పైగా నిరక్షరాస్యులు. అందుకే వారి కుటుంబాలలో బంధాలు అంత బలంగా ఉండవు. భార్యభర్తల మధ్య ప్రేమను పెంచేందుకే ఈ పోటీ నిర్వహిస్తున్నా. ఆధునికత నేర్పించి వారిని అభివృద్ధి బాటలోకి తీసుకొస్తా’’ అని సిమన్ చెబుతున్నారు. కాగా, ఇలా బహిరంగ ముద్దులు సభ్యత కాదని ఆరోపిస్తూ మహిళా సంఘాలు మానవ హక్కుల సంఘంలో ఫిర్యాదు చేశాయి. ఇక డుమారియాలో ఈ మేళాను రెండు రోజుల పాటు నిర్వహిస్తారు. గత 37 ఏళ్లుగా సిమన్ కుటుంబ సభ్యులే ఈ ఉత్సవాలను నిర్వహిస్తూ వస్తున్నారు. విలు విద్య, గిరిజన నృత్యాలు, పరుగు పందాలు తదితర పోటీలు నిర్వహిస్తుండగా.. ఈ ఏడాదే ప్రయోగాత్మకంగా ముద్దుల పోటీని ఆయన ప్రవేశపెట్టారు. శుక్ర, శని వారాల్లో ఈ పోటీలు నిర్వహించగా.. 18 మంది దంపతులు ఈ పోటీల్లో పాల్గొన్నారు.