అనుష్క అంగీకరిస్తే... తెలుగులో రీమేక్‌ | Anushka In Naachiyaar Telugu Remake | Sakshi
Sakshi News home page

Published Fri, Mar 2 2018 1:34 PM | Last Updated on Fri, Mar 2 2018 6:07 PM

Anushka Shetty, Jyothika - Sakshi

అనుష్క, జ్యోతిక

సంచలన దర్శకుడు బాలా దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ సినిమా నాచియార్‌. జ్యోతిక, జీవి ప్రకాష్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ఇటీవల విడుదలై మంచి వసూళ్లు సాధిస్తోంది. జ్యోతిక చెప్పిన డైలాగ్స్‌తో వివాదాస్పదమైన ఈ సినిమా రిలీజ్‌ తరువాత మాత్రం  పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకుంది. ఫిబ్రవరి 16న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాను తెలుగులో రీమేక్‌ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

పలు తమిళచిత్రాలను తెలుగులో డబ్‌ చేసి రిలీజ్ చేసిన కోనేరు కల్పన, నాచియార్ హక్కులను సొంతం చేసుకున్నారు. అయితే ఈసినిమాను డబ్‌ చేయకుండా తెలుగులో రీమేక్‌ చేసే ఆలోచనలో ఉన్నారట. దర‍్శకుడు బాలా సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. అం‍తేకాదు తమిళ్‌లో జ్యోతిక చేసిన పాత్రను తెలుగులో అనుష్క చేస్తే బాగుంటుందని బాల సూచించారు. దీంతో అనుష్క అంగీకరస్తే నాచియార్‌ సినిమాను తెలుగులో రీమేక్ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement