రేడియో జాకీగా రేడియో స్టేషన్‌లో ఫుల్ బిజీగా యాంకరింగ్ చేస్తున్నారు జ్యోతిక. ఇంతలో అక్కడికి శింబు గెస్ట్‌గా వచ్చారు. వెంటనే వాతావరణం అంతా సందడి సందడిగా మారిపోయింది. ఇదంతా తమిళ చిత్రం ‘కాట్రిన్ మొళి’ కోసమే. జ్యోతిక ప్రధాన పాత్రలో హిందీ హిట్ చిత్రం ‘తుమ్హారీ సులు’ రీమేక్ అవుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో శింబు అతిథి పాత్రలో కనిపించనున్నారు. దానికి సంబంధించిన సీన్స్‌ను రీసెంట్‌గా షూట్ చేశారు. ఈ చిత్రంలో జ్యోతిక బాస్ పాత్రలో మంచు లక్ష్మీ కనిపించనున్నారు. రాధామోహన్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది.
Comments
Please login to add a commentAdd a comment