మరోసారి ట్రెండ్‌ అవుతోన్న ‘జిమ్మికి కమల్‌’ | Jyothika Kaatrin Mozhi Jimikki Kammal Video Song | Sakshi
Sakshi News home page

Published Tue, Nov 13 2018 12:36 PM | Last Updated on Tue, Nov 13 2018 12:42 PM

Jyothika Kaatrin Mozhi Jimikki Kammal Video Song - Sakshi

ఇటీవల సోషల్‌ మీడియాను ఊపేసిన ట్రెండ్ జిమ్మికి కమల్‌. మోహన్‌ లాల్‌ హీరోగా తెరకెక్కిన ‘వెలిపడింతే పుస్తకమ్‌’ సినిమాలోని ఈ పాటకు మలయాళీలతో పాటు ఎంతో మంది సెలబ్రిటీలు కూడా డ్యాన్స్‌ చేశారు. తాజాగా ఈ పాట ఓ తమిళ సినిమా కోసం రీమిక్స్‌ చేశారు. బాలీవుడ్‌ లో సూపర్‌ హిట్ అయిన ‘తుమ్హారీ సులు’ సినిమాను జ్యోతిక ప్రధాన పాత్రలో రీమేక్‌ చేస్తున్న సంగతి తెలిసిందే.

‘కాట్రిన్ మొళి’ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో జిమ్మికి కమల్ పాటకు స్టెప్‌లు వేశారు జ్యోతిక. తాజాగా ఈ పాట వీడియోను రిలీజ్ చేశారు చిత్రయూనిట్‌. దీంతో మరోసారి జిమ్మికి కమల్‌ సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతోంది. జ్యోతిక తో పాటు మంచు లక్ష్మి, కుమరవేల్, సిద్ధు శ్యామ్, ఆర్జే శాండ్రా జిమ్మికి కమల్‌ పాటకు అదిరి పోయే స్టెప్స్‌ వేశారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న కాట్రిన్‌ మొళి సినిమా నవంబర్‌ 16న రిలీజ్‌ కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement