స్పెషల్‌ ఫోకస్‌ | Jyothika Special Focus on Bollywood | Sakshi
Sakshi News home page

స్పెషల్‌ ఫోకస్‌

Published Tue, May 16 2023 6:04 AM | Last Updated on Tue, May 16 2023 6:04 AM

Jyothika Special Focus on Bollywood - Sakshi

బాలీవుడ్‌పై జ్యోతిక స్పెషల్‌ ఫోకస్‌ పెట్టినట్లున్నారు. వరుసగా ఆమె హిందీ ప్రాజెక్ట్స్‌కు గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తున్నారు. ఇరవయ్యేళ్ల తర్వాత ఇటీవల హిందీ చిత్రం ‘శ్రీ’లో నటించారు జ్యోతిక. వ్యాపారవేత్త శ్రీకాంత్‌ బొల్లా బయోపిక్‌గా రూపొందిన ఈ సినిమాలో రాజ్‌కుమార్‌ రావు టైటిల్‌ రోల్‌ చేశారు.

అలాగే ఓ హిందీ వెబ్‌ సిరీస్‌కు జ్యోతిక సైన్‌ చేశారనే టాక్‌ కొన్ని నెలల క్రితం బీటౌన్‌లో బలంగా వినిపించింది. తాజాగా మరో హిందీ ప్రాజెక్ట్‌కు జ్యోతిక సై అన్నారు. వికాస్‌ బాల్‌ దర్శకత్వంలో అజయ్‌ దేవగన్, మాధవన్‌ ప్రధాన పాత్రధారులుగా హిందీలో ఓ చిత్రం తెరకెక్కనుంది. ఇందులో అజయ్‌ దేవగన్‌ భార్య పాత్రలో జ్యోతిక కనిపిస్తారట. గుజరాతీ ఫిల్మ్‌ ‘వష్‌’కు ఈ చిత్రం రీమేక్‌ అని భోగట్టా.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement