జగన్ విజయాన్ని అడ్డుకోలేరు
పమిడిముక్కల, న్యూస్‌లైన్ : చంద్రబాబునాయుడు వంటి కుహనా నేతలు ఎన్ని కుట్రలు, కుయుక్తులు పన్నినా ...దివంగత మహానేత తనయుడు, వైఎస్సార్‌సీపీ అధినేత, జననేత జగన్‌మోహనరెడ్డి ముఖ్యమంత్రి కావడాన్ని అడ్డుకోలేరని వైఎస్సార్‌సీపీ కేంద్ర పాలకమండలి సభ్యురాలు ఉప్పులేటి కల్పన స్పష్టం చేశారు.
వీరంకిలాకులోని కళ్యాణమండపంలో బుధవారం జరిగిన కార్యకర్తల సమావేశంలో కల్పన మాట్లాడుతూ వెఎస్సార్‌సీపీ తరఫున పోటీచేస్తున్న ఎంపీటీసీ, జెడ్‌పీటీసీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని కార్యకర్తలకు సూచించారు. మండలానికి చెందిన పలువురు ప్రముఖులతో సహాదాదాపు 200మందికి పైగా వెఎస్సార్‌సీపీలో చేరారు. వారికి కల్పన పార్టీ కండువాలతో స్వాగతం పలికారు.
మాజీ ఎంపీపీ శొంఠి వెంకటేశ్వరావు , మండలకాంగ్రెస్ అధ్యక్షుడు దండమూడి బాపూజీ , డీసీసీ ప్రధానకార్యదర్శి పి.చంద్రపాల్, మండల కాంగ్రెస్ ప్రధానకార్యదర్శి పి.యేషయ్యబాబు, వేల్పూరు సర్పంచి టి.బోసుబాబు, మండలకాంగ్రెస్ ఉపాధ్యక్షుడు టి.యేసుబాబు, మేడూరు ఎంపీటీసీ అభ్యర్థి డి.వెంకటదుర్గారావు , పమిడిముక్కల ఎంపీటీసీ అభ్యర్థి శొంఠి నాగేశ్వరావు, హనుమంతపురం ఎంపీటీసీ అభ్యర్థి వై.వీరవెంకటేశ్వరావు , కిష్ణాపురం ఎంపీటీసీ అభ్యర్థి వీరంకి చిరంజీవి , కాంగ్రెస్‌పార్టీనాయకులు బి.రమేష్, కూచిపూడి వెంకటేశ్వరావు, అబ్ధుల్‌నజీర్ , ఎన్.రాజ్యలక్ష్మి, తిమోతి, యేసుపాదం, సంగీతరావు, కాకాని, ఎన్.కుటుంబరావు, కె.మాధవ, పి.దశరద, పి.రామ్మెహన్, అరిగె రమేష్‌లతోపాటు పెనుమత్స, హనుమంతపురం తదితర గ్రామాలకు చెందిన వందలాదిమంది పార్టీలో చేరారు.
కల్పన మాట్లాడుతూ పార్టీలో చేరినవారికి ప్రాధాన్యత కల్పిస్తామని హమీ ఇచ్చారు. రానున్న ఎన్నికల్లో ఎంపీటీసీ, జెడ్‌పీటీసీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. వైఎస్ ఆశయసాధనకు పాటుపడుతున్న జగన్‌తోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనే ఆశతోనే వైఎస్సార్‌సీపీలో చేరామని శొంఠి వెంకటేశ్వరావు, బాపూజీ తెలిపారు. మండలంలో పార్టీ పటిష్టతకు శక్తివంచన లేకుండా పాటుపడతామని తెలిపారు.
మండలంలోని ప్రముఖ నాయకులంతా పార్టీలో చేరడం సంతోషంగా ఉందని, ఎమ్మెల్యేగా తననూ, ఎంపీ అభ్యర్థిగా కె. విద్యాసాగర్‌ను భారీ మెజారిటీతో గెలిపించేందుకు కృషి చేయాలని కల్పన కోరారు. జెడ్‌పీటీసీ అభ్యర్థి బొబ్బా సురేష్‌ను మెజారిటీతో గెలిపించాలని కార్యకర్తలకు, నాయకులకు సూచించారు. మాజీ ఎంపీపీ లోయరామశాస్త్రి, సర్పంచులు పి.విజయరాణి, జి.నాగమల్లేశ్వరావు, పార్టీనాయకులు అజీజ్, పి.మేరీ, మహేష్, సతీష్, నాగేంద్ర, రమేష్, బాలాజీ, రాజ్యలక్ష్మి,రజని, జగన్ తదితరులు పాల్గొన్నారు.