
రాజేంద్రప్రసాద్‌కు అక్కినేని పురస్కారం
గుంటూరు: సాంస్కృతిక సంస్థ దాసరి కల్చరల్ కళాదర్బార్ 35 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పలువురు సినీ ప్రముఖులకు పురస్కారాలు ప్రదానం చేశారు. పొత్తూరి రంగారావు ఆధ్వర్వంలో ఆదివారం రాత్రి గుంటూరులోని శ్రీ వేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో కళాదర్బార్ కల్చరల్ అవార్డుల ప్రదానం జరిగింది.
అక్కినేని నాగేశ్వరరావు స్మారక పురస్కారాన్ని సినీ నటుడు రాజేంద్రప్రసాద్, శోభన్ బాబు పురస్కారాన్ని శ్రీకాంత్, ఘంటసాల పురస్కారాన్ని గాయని కల్పన, సౌందర్య పురస్కారాన్ని సురేఖవాణి, బాపు పురస్కారాన్ని యలమంచలి సాయిబాబు అందుకున్నారు. వేటూరి పురస్కారాన్ని భాస్కరభట్ల, శ్రీహరి పురస్కారాన్ని అజయ్, ఏవీఎస్ పురస్కారాన్ని ఎంఎస్ నారాయణ అందుకున్నారు. వీరికి శాలువ, జ్ఞాపికలను అందజేసి వెండి కిరీటంతో ఘనంగా సన్మానించారు.