ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీని జార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్ మర్యాదపూర్వకంగా కలిశారు. కాగా, హేమంత్ సొరేన్ మరోసారి జార్ఖండ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రధానిని కలవడం ఇదే తొలిసారి.
కాగా, మోదీని సీఎం హేమంత్ సొరేన్ మర్యాదపూర్వంగా కలిసినట్టు ఆయన ట్విట్టర్ వేదికగా స్పష్టం చేశారు. ఇక, జార్ఖండ్‌లో ల్యాండ్ స్కామ్‌కు సంబంధించిన కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) హేమంత్ సొరేన్‌ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
माननीय प्रधानमंत्री श्री .@narendramodi जी से शिष्टाचार मुलाक़ात हुई। pic.twitter.com/jByrjWHsUw
— Hemant Soren (@HemantSorenJMM) July 15, 2024
ఈ క్రమంలో జనవరి 31వ తేదీన సీఎం పదవికి సొరేన్ రాజీనామా చేశారు. ఈ క్రమంలో ఇటీవలే జార్ఖండ్ కోర్టు హేమంత్ సొరేన్‌కు బెయిల్ ఇవ్వడంతో ఆయన జైలు నుంచి బయటకు వచ్చారు. అనంతరం, మళ్లీ జార్ఖండ్ సీఎంగా ప్రమాణం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment