కోల్‌కతా: సీఎం హేమంత్ సోరెన్ నేతృత్వంలోని జార్ఖండ్ ప్రభుత్వంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బెంగాల్‌లో వరదలకు దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ కారణమని ఆమె ఆరోపించారు. ఈ క్రమంలో బెంగాల్-జార్ఖండ్ భూ సరిహద్దును మూడు రోజులపాటు మూసివేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.
అయితే జార్ఖండ్‌ను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని డీవీసీ ద్వారా నీటిని విడుదల చేశారని మమత ఆరోపించారు. దీనివల్ల రాష్ట్రంలోని పలు జిల్లాలను వరద నీరు ముంచెత్తినట్లు తెలిపారు. ఇది కేవలం మనవ తప్పదమని ఆమె పేర్కొన్నారు. డీవీసీ.. డ్యామ్‌ల వద్ద పూడిక తీయడంలో దారుణంగా విఫలమయిందని విమర్శించారు. పశ్చిమ బెంగాల్‌లో వరద నీరు చుట్టు ముట్టిన హౌరా, మిడ్నాపూర్ జిల్లాల్లోని పలు వరద నీటి ప్రభావిత ప్రాంతాల్లో సీఎం మమత పర్యటించారు.
ఈ సందర్భంగా పశ్చిమ బెంగాల్‌లో వరదలకు దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ (డీవీసీ) కారణమని ఆరోపించారు. ఇష్టమున్నట్టు నీటిని దిగువకు విడుదల చేశారన్నారు. ఇదంతా పక్కా ప్లాన్ ప్రకారమే జరిగిందని ఆరోపించారు. కేంద్రం ఆడుతున్న నాటకంలో ఇదొక కుట్రగా ఆమె పేర్కొన్నారు. దీనిపై తాము ఉద్యమిస్తామని హెచ్చరించారు. మానవ ప్రమేయంతో వచ్చిన ఈ వరదలకు డీవీసీనే బాధ్యత వహించాలని దీదీ డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment