జార్ఖండ్ ప్రస్తుతం పెను రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. భూ కుంభకోణం కేసులో రాష్ట్ర సీఎం హేమంత్ సోరెన్‌ను ఈడీ అరెస్ట్ చేసింది. ఈ నేపధ్యంలోనే హేమంత్ సోరెన్ బుధవారం రాత్రి గవర్నర్‌కు తన రాజీనామా పత్రం సమర్పించారు. హేమంత్ రాజీనామా తర్వాత చంపై సోరెన్ శాసనసభా పక్ష నేతగా ఎన్నికయ్యారు.
జార్ఖండ్ సీఎం పదవిలో ఉన్న నేత అరెస్ట్ కావడం ఇదేమీ తొలిసారి కాదు. జార్ఖండ్ ఆవిర్భావం తర్వాత ఇప్పటి వరకు మొత్తం ఆరుగురు సీఎంలు రాష్ట్రాన్ని పాలించారు. వీరిలో ముగ్గురు వేర్వేరు కేసుల్లో అరెస్టయ్యారు. దీంతోపాటు రాష్ట్రంలో మూడుసార్లు రాష్ట్రపతి పాలన విధించారు.
హేమంత్ సోరెన్ తండ్రి శిబు సోరెన్ 2005లో 10 రోజులు, 2008 నుంచి 2009 వరకు, 2009 నుంచి 2010 వరకు జార్ఖండ్ సీఎంగా ఉన్నారు. 1994లో ప్రైవేట్ సెక్రటరీ శశినాథ్ ఝా కిడ్నాప్, హత్య కేసులో 2006లో ఢిల్లీ కోర్టు శిబు సోరెన్‌కు జీవిత ఖైదు విధించింది. అయితే 2007లో సరైన సాక్ష్యాధారాలు లేకపోవడంతో ఢిల్లీ హైకోర్టు శిబు సోరెన్‌ను నిర్దోషిగా ప్రకటించింది.
2018లో సుప్రీంకోర్టు ఢిల్లీ హైకోర్టు నిర్ణయాన్ని సమర్థించింది. 2004లో జమ్తారా సబ్ డివిజనల్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టు శిబూ సోరెన్‌కు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఈ నేపధ్యంలో ఆయన కేంద్ర బొగ్గు శాఖ మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. అయితే 2008 మార్చి లో సాక్ష్యాలు లేవని పేర్కొంటూ ఫాస్ట్ ట్రాక్ కోర్టు సోరెన్‌ను నిర్దోషిగా విడుదల చేసింది.
మధు కోడా 2006 నుంచి 2008 మధ్య జార్ఖండ్ సీఎంగా ఉన్నారు. సీఎంగా ఉన్న సమయంలో ఆయన మనీలాండరింగ్, ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టడం వంటి అవినీతి ఆరోపణలను ఎదుర్కొన్నారు. మైనింగ్ కుంభకోణానికి పాల్పడి రూ.4,000 కోట్లకు పైగా సంపాదించారనే ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. కోడాను 2009లో అరెస్టు చేసి 2013లో విడుదల చేశారు. 2017లో కోడా దోషిగా తేలారు. దీంతో అతనికి మూడేళ్ల జైలు శిక్ష. రూ. 25 లక్షల జరిమానా విధించారు.
జార్ఖండ్ రాష్ట్రం 2000, నవంబరు 15న ఏర్పడింది. నేటి వరకు ఆరుగురు నేతలు సీఎంలుగా వ్యవహరించారు. వీరిలో రఘువర్ దాస్ మాత్రమే ఐదేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేశారు. బాబులాల్ మరాండీ, అర్జున్ ముండా, రఘువర్ దాస్ జార్ఖండ్ సీఎంలుగా పనిచేశారు.
Comments
Please login to add a commentAdd a comment