Madhu Koda
-
మధుకోడాకు సుప్రీంకోర్టులో చుక్కెదురు
న్యూఢిల్లీ: జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి మధుకోడాకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. బొగ్గు గనుల కేటాయింపు కుంభకోణంలో తనకు మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలని మధుకోడా సుప్రీం తలుపు తట్టారు. స్టే ఇస్తే తాను ప్రస్తుతం జరుగుతున్న జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హున్నవుతానని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.కోడా పిటిషన్‌ను శుక్రవారం(అక్టోబర్ 25) విచారించిన జస్టిస్ సంజీవ్కన్నా నేతృత్వంలోని సుప్రీంకోర్టు బెంచ్ శిక్షపై స్టే ఇవ్వడానికి నిరాకరించింది. ఈ సందర్భంగా బెంచ్ కీలక వ్యాఖ్యలు చేసింది. కోడాకు శిక్ష విధిస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వడం కుదరదని తేల్చిచెప్పింది. గతంలో తాము బీఎస్పీ ఎంపీ అఫ్జల్ అన్సారీ విషయంలో ఇచ్చిన ఊరట మధుకోడాకు ఇవ్వలేమని తెలిపింది. అన్సారీ సిట్టింగ్ ఎంపీ అయినందువల్లే ఆయనకు పడిన శిక్షపై స్టే ఇచ్చామని పేర్కొంది. ఇవే తరహా స్టేలు రొటీన్‌గా ఇవ్వలేమని స్పష్టం చేసింది. దీంతో మధుకోడాకు జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే ఛాన్స్ లేకుండాపోయింది. కాగా, ప్రజా ప్రాతినిథ్య చట్టం ప్రకారం రెండు అంతకంటే ఎక్కువ ఏళ్లు శిక్ష పడిన ప్రజాప్రతినిధుల చట్టసభ సభ్యత్వాలు రద్దవడంతో పాటు జైలు నుంచి విడుదలైన తర్వాత ఆరేళ్ల దాకా మళ్లీ ఎన్నికల్లో పోటీచేసే అర్హత కోల్పోతారు.ఇదీ చదవండి: వయనాడ్‌లో ఖర్గేకు అవమానం నిజమేనా.. -
అరెస్టులను ఎదుర్కొన్న ముగ్గురు జార్ఖండ్ సీఎంలు!
జార్ఖండ్ ప్రస్తుతం పెను రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. భూ కుంభకోణం కేసులో రాష్ట్ర సీఎం హేమంత్ సోరెన్‌ను ఈడీ అరెస్ట్ చేసింది. ఈ నేపధ్యంలోనే హేమంత్ సోరెన్ బుధవారం రాత్రి గవర్నర్‌కు తన రాజీనామా పత్రం సమర్పించారు. హేమంత్ రాజీనామా తర్వాత చంపై సోరెన్ శాసనసభా పక్ష నేతగా ఎన్నికయ్యారు. జార్ఖండ్ సీఎం పదవిలో ఉన్న నేత అరెస్ట్ కావడం ఇదేమీ తొలిసారి కాదు. జార్ఖండ్ ఆవిర్భావం తర్వాత ఇప్పటి వరకు మొత్తం ఆరుగురు సీఎంలు రాష్ట్రాన్ని పాలించారు. వీరిలో ముగ్గురు వేర్వేరు కేసుల్లో అరెస్టయ్యారు. దీంతోపాటు రాష్ట్రంలో మూడుసార్లు రాష్ట్రపతి పాలన విధించారు. హేమంత్ సోరెన్ తండ్రి శిబు సోరెన్ 2005లో 10 రోజులు, 2008 నుంచి 2009 వరకు, 2009 నుంచి 2010 వరకు జార్ఖండ్ సీఎంగా ఉన్నారు. 1994లో ప్రైవేట్ సెక్రటరీ శశినాథ్ ఝా కిడ్నాప్, హత్య కేసులో 2006లో ఢిల్లీ కోర్టు శిబు సోరెన్‌కు జీవిత ఖైదు విధించింది. అయితే 2007లో సరైన సాక్ష్యాధారాలు లేకపోవడంతో ఢిల్లీ హైకోర్టు శిబు సోరెన్‌ను నిర్దోషిగా ప్రకటించింది. 2018లో సుప్రీంకోర్టు ఢిల్లీ హైకోర్టు నిర్ణయాన్ని సమర్థించింది. 2004లో జమ్తారా సబ్ డివిజనల్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టు శిబూ సోరెన్‌కు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఈ నేపధ్యంలో ఆయన కేంద్ర బొగ్గు శాఖ మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. అయితే 2008 మార్చి లో సాక్ష్యాలు లేవని పేర్కొంటూ ఫాస్ట్ ట్రాక్ కోర్టు సోరెన్‌ను నిర్దోషిగా విడుదల చేసింది. మధు కోడా 2006 నుంచి 2008 మధ్య జార్ఖండ్ సీఎంగా ఉన్నారు. సీఎంగా ఉన్న సమయంలో ఆయన మనీలాండరింగ్, ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టడం వంటి అవినీతి ఆరోపణలను ఎదుర్కొన్నారు. మైనింగ్ కుంభకోణానికి పాల్పడి రూ.4,000 కోట్లకు పైగా సంపాదించారనే ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. కోడాను 2009లో అరెస్టు చేసి 2013లో విడుదల చేశారు. 2017లో కోడా దోషిగా తేలారు. దీంతో అతనికి మూడేళ్ల జైలు శిక్ష. రూ. 25 లక్షల జరిమానా విధించారు. జార్ఖండ్ రాష్ట్రం 2000, నవంబరు 15న ఏర్పడింది. నేటి వరకు ఆరుగురు నేతలు సీఎంలుగా వ్యవహరించారు. వీరిలో రఘువర్ దాస్ మాత్రమే ఐదేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేశారు. బాబులాల్ మరాండీ, అర్జున్ ముండా, రఘువర్ దాస్ జార్ఖండ్ సీఎంలుగా పనిచేశారు. -
బొగ్గు స్కాంలో మధు కోడాకు మూడేళ్లు జైలు
-
మధుకోడాకు మూడేళ్ల జైలు
న్యూఢిల్లీ: బొగ్గు కుంభకోణం కేసులో దోషిగా తేలిన జార్ఖండ్ మాజీ సీఎం మధుకోడాకు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం మూడేళ్ల జైలు శిక్ష, రూ.25 లక్షల జరిమానా విధించింది. బొగ్గు శాఖ మాజీ కార్యదర్శి హెచ్‌సీ గుప్తా, జార్ఖండ్ మాజీ ప్రధాన కార్యదర్శి ఏకే బసు, కోడా సన్నిహితుడు విజయ్ జోషిలకు మూడేళ్ల జైలు శిక్ష ఖరారు చేసింది. విసుల్ సంస్థకు రూ.50 లక్షలు, జోషికి రూ.25 లక్షలు; బసు, గుప్తాలకు రూ.లక్ష జరిమానావేసింది. జార్ఖండ్‌లోని రాజారా ఉత్తర బొగ్గు గనులను విసుల్ సంస్థకు కేటాయించడంలో వీరు అవినీతి, నేరపూరిత కుట్రలకు పాల్పడటంతో ఈ శిక్షలు వేశామని కోర్టు వ్యాఖ్యానించింది. ‘మామూలు నేరాల కంటే వైట్ కాలర్ నేరాలే సమాజానికి అత్యంత ప్రమాదకరం. వీటి వల్ల దేశం భారీ స్థాయిలో ఆర్థికంగా నష్టపోతోంది’ అని సీబీఐ కోర్టు జడ్జి భరత్ పరాశర్ తన తీర్పులో పేర్కొన్నారు. ఈ తీర్పుతో మధుకోడా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కోల్పోనున్నారు. ఇదిలాఉండగా మొత్తం 30 బొగ్గు కుంభకోణం కేసుల్లో ఇప్పటివరకు నాలుగింటిలో 12 మంది వ్యక్తులకు, నాలుగు సంస్థలకు శిక్షలు పడ్డాయి. కాగా తీర్పుపై హైకోర్టును ఆశ్రయిస్తానని మధుకోడా చెప్పారు. -
మధుకోడా ‘బొగ్గు’ దోషే!
న్యూఢిల్లీ: బొగ్గు స్కాం కేసులో జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి మధు కోడా, కేంద్ర మాజీ బొగ్గు గనుల శాఖ కార్యదర్శి హెచ్‌సీ గుప్తాలను సీబీఐ ప్రత్యేక కోర్టు దోషులుగా తేల్చింది. కోల్‌కతాకు చెందిన విని ఐరన్, స్టీల్ ఉద్యోగ్ లిమిటెడ్ (విసుల్) కంపెనీకి జార్ఖండ్‌లోని రాజారా నార్త్ బొగ్గు బ్లాక్ కేటాయింపుల విషయంలో అవకతవకలు జరిగాయని కేసు నమోదైంది. ఈ కేసులో మధు కోడా, గుప్తాలతో పాటు జార్ఖండ్ మాజీ సీఎస్ ఏకే బసు, విసు హస్తముందని సీబీఐ జడ్జి తీర్పుచెప్పారు. వీరికి శిక్ష విధించే విషయంలో నేడు వాదనలు జరగనున్నాయి. స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ అయిన గుప్తా ఈ విషయంలో నిజాలను అప్పటి ప్రధాని, బొగ్గు గనుల శాఖ మంత్రి అయిన మన్మోహన్ సింగ్ వద్ద దాచిపెట్టారని సీబీఐ ఆరోపించింది. కేటాయింపుల విషయంలో మధు కోడా, బసు, మరో ఇద్దరు అధికారులు విసుల్‌కి కేటాయింపులు జరగడంలో సాయపడ్డారంది. -
బొగ్గు స్కామ్‌లో మధు కోడాను దోషిగా తేల్చిన కోర్టు
-
మాజీ ముఖ్యమంత్రిని దోషిగా తేల్చిన కోర్టు
సాక్షి, న్యూఢిల్లీ : బొగ్గు బ్లాకుల కేటాయింపు కుంభకోణంలో జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి మధు కోడాను సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం దోషిగా ప్రకటించింది. బొగ్గుశాఖ మాజీ కార్యదర్శి హెచ్‌సీ గుప్తా, జార్ఖండ్ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అశోక్ కుమార్ బసులతో పాటుగా మరొకరిని కోర్టు బుధవారం దోషులుగా తేల్చింది. కోర్టు వీరిని రేపు (గురువారం) శిక్షలు ఖరారు చేయనుంది. కాగా కోల్‌కతాకు చెందిన సంస్థకు బొగ్గు బ్లాకుల కేటాయింపునకు సంబంధించి కోడాతో పాటు మాజీ ప్రధాన కార్యదర్శి అశోక్ కుమార్ బసు, బొగ్గు శాఖ మాజీ కార్యదర్శి హెచ్‌సీ గుప్తా, మరో ఐదుగురిపైనా చార్జిషీట్ దాఖలు అయిన విషయం తెలిసిందే. -
మధు కోడాపై మూడేళ్ల అనర్హత వేటు
న్యూఢిల్లీ: జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి మధు కోడాకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) షాకిచ్చింది. బుధవారం నుంచి మూడేళ్ల పాటు ఎలాంటి ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధిస్తున్నట్లు వెల్లడించింది. 2009 లోక్‌సభ ఎన్నికల్లో వాస్తవంగా ఖర్చయిన రూ.18,92,353 కంటే వ్యయాన్ని అతితక్కువగా చూపడంతో పాటు సరైన వివరణ ఇవ్వకపోవడంతోనే ఈ చర్య తీసుకున్నట్లు ఈసీ తెలిపింది. ఈ మేరకు ప్రజా ప్రాతినిధ్య చట్టం సెక్షన్ 10ఏ కింద కోడాపై వేటు వేస్తూ సీఈసీ ఏకే జోతి, కమిషనర్ ఓపీ రావత్ ఉత్తర్వులు జారీచేశారు. 2009 లోక్‌సభ ఎన్నికల్లో జార్ఖండ్‌లోని సింఘ్‌భూమ్ నియోజకవర్గం నుంచి కోడా స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారు. కోడా సమర్పించిన ఎన్నికల వ్యయం వివరాలు తప్పులతడకగా ఉండటాన్ని గుర్తించిన ఈసీ..ఎందుకు అనర్హత వేటు వేయకూడదో తెలపాలంటూ 2010లో నోటీసులు జారీచేసింది. -
మాజీ ప్రధానిపై మాజీ సీఎం ఆరోపణలు
బొగ్గు కుంభకోణంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మీద జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి మధు కోడా బురద చల్లారు. జిందాల్ గ్రూప్ వాళ్లకు బొగ్గు క్షేత్రాల కేటాయింపు విషయం సహా.. కుంభకోణానికి సంబంధించిన అన్ని విషయాలూ నాటి ప్రధాని మంత్రి మన్మోహన్ సింగ్‌కు తెలిసే జరిగాయని ఈ కుంభకోణంపై విచారణ జరుపుతున్న ప్రత్యేక కోర్టులో వెల్లడించారు. ఒకవేళ అందులో ఏదైనా కుట్రకోణం ఉంటే.. అది ప్రధానమంత్రికి తెలియకుండా జరిగే అవకాశమే లేదన్నారు. అందువల్ల ఈ కేసులో అదనపు నిందితునిగా మన్మోహన్ సింగ్‌ను కోర్టుకు పిలిచి విచారించాలని మధుకోడా కోర్టును కోరారు. అయితే, ఈ విషయమై సీబీఐ గురువారం నాడు స్పందించనుంది. -
బొగ్గు స్కామ్‌లో మధు కోడాకు బెయిల్
న్యూఢిల్లీ : బొగ్గు బ్లాకుల కేటాయింపు కుంభకోణంలో జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి మధు కోడాకు బెయిల్ లభించింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న మరో ఏడుగురికి కూడా బుధవారం ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేసింది. బొగ్గుశాఖ మాజీ కార్యదర్శి హెచ్‌సీ గుప్తా, జార్ఖండ్ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అశోక్ కుమార్ బసులు బెయిల్ లభించినవారిలో ఉన్నారు. ఈ కేసులో ఎనిమిది మందికి బెయిల్ మంజూరు చేసినట్లు సీబీఐ ప్రత్యేక జడ్జి ప్రభాత్ ప్రశార్ పేర్కొన్నారు. ఒక్కొక్కరు లక్షరూపాయల వ్యక్తిగత బాండ్లు, అంతే మొత్తంలో పూచీకత్తు సమర్పించాలని షరతు విధించారు. ఈ కేసు తదుపరి విచారణను మార్చి 4కు వాయిదా వేశారు. వాదనల సందర్భంగా వీరికి బెయిల్ ఇవ్వకూడదని సీబీఐ కోర్టును కోరింది. వీరంతా అధికార దుర్వినియోగంతోపాటు కుట్రపూరిత చర్యలకు పాల్పడ్డారని, వినీ ఐరన్ అండ్ స్టీల్ ఉద్యోగ్ లిమిటెడ్ అనే కంపెనీకి అనుకూలంగా వ్యవహరించారని సీబీఐ వాదించింది. వీరికి బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశముందని తెలిపింది. ఇందులో హెచ్‌సీ గుప్తా గతంలో ప్రధాని కార్యాలయాన్ని కూడా తప్పుదోవ పట్టించారని సీబీఐ, ప్రత్యేక కోర్టు దృష్టికి తీసుకువచ్చింది. -
బొగ్గు స్కామ్‌లో కోడాపై చార్జిషీట్
మరో ఇద్దరు మాజీ ఐఏఎస్ అధికారులపైనా.. న్యూఢిల్లీ: బోగ్గు కుంభకోణంలో జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి మధుకోడాపై ఢిల్లీలోని ప్రత్యేక న్యాయస్థానంలో సీబీఐ అధికారులు శుక్రవారం చార్జిషీట్ దాఖలు చేశారు. కోల్‌కతాకు చెందిన సంస్థకు బొగ్గు బ్లాకుల కేటాయింపునకు సంబంధించి ఈ చార్జిషీట్ దాఖలైంది. కోడాతో పాటు మాజీ ప్రధాన కార్యదర్శి అశోక్ కుమార్ బసు, బొగ్గు శాఖ మాజీ కార్యదర్శి హెచ్‌సీ గుప్తా, మరో ఐదుగురిపైనా అధికారులు చార్జిషీట్ దాఖలు చేశారు. వీరందరిపైనా నేరపూరిత కుట్ర, మోసం అలాగే అవినీతి నిరోధక చట్టం కింద అభియోగాలు నమోదు చేశారు. డిసెంబర్ 22న ఈ చార్జిషీట్‌ను పరిశీలనలోకి తీసుకుంటామని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం జడ్జి భరత్ పరాసర్ స్పష్టం చేశారు. కాగా, బొగ్గు కుంభకోణానికి సంబంధించి చార్జిషీట్లు, ముగింపు నివేదికలను సీబీఐ దాఖలు చేసేందుకు ఈ నెల 8న సుప్రీంకోర్టు అనుమతించిన నేపథ్యంలో సీబీఐ తాజా చార్జిషీట్‌ను దాఖలు చేసింది. సీబీఐ మాజీ చీఫ్ రంజిత్ సిన్హాపై ఆరోపణల నేపథ్యంలో గతంలో చార్జిషీట్లు, ముగింపు నివేదికలు దాఖలు చేయడాన్ని సుప్రీంకోర్టు నిలుపుదల చేసిన సంగతి తెలిసిందే. -
మధుకోడాపై ఛార్జీషీట్ దాఖలు చేసిన సీబీఐ
న్యూఢిల్లీ: జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి మధుకోడాపై ప్రత్యేక కోర్టులో సీబీఐ శుక్రవారం ఛార్జీషీట్ దాఖలు చేసింది. బొగ్గు గనుల కేటాయింపుల్లో మోసం, కుట్రలకు పాల్పడ్డారంటూ మధు కోడాపై అభియోగాలను సీబీఐ నమోదు చేసింది. అలాగే జార్ఖండ్ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అశోక్ కుమార్ బసుతోపాటు మరో అరుగురిపై కూడా సీబీఐ అభియోగాలను నమోదు చేసింది. అనంతరం కోర్టు ఈ కేసు విచారణను డిసెంబర్ 22కు వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. మధుకోడా జార్ఖండ్ సీఎంగా ఉన్న సమయంలో భారీగా అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో కోడా ఆస్తులపై సీబీఐ విచారణ చేపట్టంది. అందులోభాగంగా 144 కోట్ల విలువైన ఆస్తులను మనీల్యాండరింగ్ కోర్టు గత ఏడాది సెప్టెంబర్‌లో జప్తు చేసిన సంగతి తెలిసిందే. -
144 కోట్ల విలువైన మధుకోడా ఆస్తుల జప్తు!
న్యూఢిల్లీ/లక్నో: అక్రమ ఆస్థుల కేసులో జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి మధు కోడా కు చెందిన 144 కోట్ల విలువైన ఆస్టులను ప్రత్యేక మానిలాండరింగ్ కోర్టు జప్తు చేసింది. పూణే, ముంబైలోని ప్రధాన ప్రాంతాల్లోని 25 ఫ్లాట్లను, జమ్ షెడ్ పూర్ లో ఓ షాపింగ్ మాల్ ను ప్రత్యేక కోర్టు జప్తు చేసింది. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టెరెట్ (ఈడీ) దర్యాప్తులో భాగంగా ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ పరిధి కింద ఆస్తులను జప్తు చేయడం జరిగిందని ప్రత్యేక కోర్టు తెలిపింది. ఈ ఏడాది ప్రారంభంలో ఇండోనేషియాలో అరెస్ట్ చేసిన వ్యాపార వేత్త అనిల్ ఆదినాథ్ బస్తవాడే కు సంబంధించిన ఆస్తులను కూడా జప్తు చేశారు. ముంబైలోని మతుంగ ప్రాంతంలోని ఓ ఆపార్ట్ మెంట్ లో కోడా సన్నిహితుడు మనోజ్ బి పునామియా పేరిట ఉన్న పది ఫ్లాట్లను, మలాడ్, గోరేగావ్, నారిమన్ పాయింట్ లోని ఖరీదైన ఫ్లాట్లను జప్తు చేసింది. ఇక జార్ఖండ్ లోని 14.20 కోట్ల విలువైన 'ఎమెరాల్డ్ మాల్' కూడా జప్తు చేసిన వాటిలో ఉంది.