144 కోట్ల విలువైన మధుకోడా ఆస్తుల జప్తు!
144 కోట్ల విలువైన మధుకోడా ఆస్తుల జప్తు!
Published Wed, Sep 11 2013 5:15 PM | Last Updated on Wed, Sep 5 2018 1:38 PM
న్యూఢిల్లీ/లక్నో:
అక్రమ ఆస్థుల కేసులో జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి మధు కోడా కు చెందిన 144 కోట్ల విలువైన ఆస్టులను ప్రత్యేక మానిలాండరింగ్ కోర్టు జప్తు చేసింది. పూణే, ముంబైలోని ప్రధాన ప్రాంతాల్లోని 25 ఫ్లాట్లను, జమ్ షెడ్ పూర్ లో ఓ షాపింగ్ మాల్ ను ప్రత్యేక కోర్టు జప్తు చేసింది.
ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టెరెట్ (ఈడీ) దర్యాప్తులో భాగంగా ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ పరిధి కింద ఆస్తులను జప్తు చేయడం జరిగిందని ప్రత్యేక కోర్టు తెలిపింది. ఈ ఏడాది ప్రారంభంలో ఇండోనేషియాలో అరెస్ట్ చేసిన వ్యాపార వేత్త అనిల్ ఆదినాథ్ బస్తవాడే కు సంబంధించిన ఆస్తులను కూడా జప్తు చేశారు.
ముంబైలోని మతుంగ ప్రాంతంలోని ఓ ఆపార్ట్ మెంట్ లో కోడా సన్నిహితుడు మనోజ్ బి పునామియా పేరిట ఉన్న పది ఫ్లాట్లను, మలాడ్, గోరేగావ్, నారిమన్ పాయింట్ లోని ఖరీదైన ఫ్లాట్లను జప్తు చేసింది. ఇక జార్ఖండ్ లోని 14.20 కోట్ల విలువైన 'ఎమెరాల్డ్ మాల్' కూడా జప్తు చేసిన వాటిలో ఉంది.
Advertisement
Advertisement