Prevention of Money Laundering Act
-
మనీలాండరింగ్ యాక్ట్‌లో ఈడీ అరెస్టుపై సుప్రీం కీలక తీర్పు
న్యూఢిల్లీ: మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) సెక్షన్ 19 ప్రకారం నిందితుడుని అరెస్ట్ చేసే విషయంలో కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారాలను సుప్రీంకోర్టు తగ్గించింది. మనీలాండరింగ్ ఫిర్యాదుపై ప్రత్యేక కోర్టు విచారణకు స్వీకరించిన తర్వాత ఆ కేసులో నిందితుడిని ఈడీ అధికారులు అరెస్టు చేయకూడదని వెల్లడించింది. ఒకవేళ సదరు నిందితుడిని విచారణ నిమిత్తం కస్టడీలోకి తీసుకోవాలంటే ఈడీ తప్పనిసరిగా కోర్టు అనుమతి తీసుకోవాల్సిందేనని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ మేరకు గురువారం పీఎంఎల్ కేసులో ఈడీ అరెస్ట్ ప్రక్రియకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. మనీలాండరింగ్ ఫిర్యాదుపై ప్రత్యేక కోర్టు విచారణకు స్వీకరించిన తర్వాత.. కేసులో నిందితుడిగా చూపిన వ్యక్తిని సెక్షన్ 19 కింద అరెస్టు చేయడానికి ఈడీ అధికారులకు అధికారం ఉండద సుప్రీం పేర్కొంది. ఈ కేసులో ప్రత్యేక కోర్టు జారీ చేసిన సమన్లకు నిందితుడు న్యాయస్థానం ఎదుట హాజరైతే దాన్ని కస్టడీలో ఉన్నట్లుగా పరిగణించకూడదని తెలిపింది‘ఈడీ ఫిర్యాదును దాఖలు చేసే వరకు నిందితులను అరెస్టు చేయని కేసుల్లో, ఆ తర్వాత కూడా వారిని అరెస్టు చేయకూడదు. ముందుగా ప్రత్యేక న్యాయస్థానం నిందితుడికి సమన్లు జారీ చేస్తుంది. ఆ సమన్లకు నిందితులు స్పందించి కోర్టులో హాజరైతే వారు కస్టడీలో ఉన్నట్లు పరిగణించకూడదు. ఒకవేళ సదరు వ్యక్తి ప్రత్యేక కోర్టుకు సమాధానం ఇచ్చిన తర్వాత అతడిని కస్టడీలోకి తీసుకోవాలనుకుంటే.. దర్యాప్తు సంస్థ ప్రత్యేక కోర్టులో దరఖాస్తు చేసుకోవాలి. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం కస్టోడియల్ ఇంటరాగేషన్ అవసరమని విశ్వసిస్తే విచారణకు అనుమతిస్తుంది’ అని జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ ఉజ్జల్ భయన్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది.నిందితుడు కోర్టు సమన్లకు సమాధానం ఇవ్వడంలో విఫలమైతే మాత్రమే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 70 కింద అతనికి అరెస్ట్ వారెంట్ జారీ చేయాలని అది కూడా బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ అయి ఉండాలని తెలిపింది.కాగా పీఎంఎల్ఏ చట్టంలోని సెక్షన్ 19 ఈడీ అధికారులకు తన వద్ద ఆధారాల ఆధారంగా.. కేసులోని నిందితులను నేరుగా అరెస్ట్ చేసే అధికారాన్ని, స్టేట్మెంట్ రికార్డ్ చేసే అధికారాన్ని కల్పిస్తుంది. అయితే అరెస్ట్‌కు గల కారణాలను ఈడీ సంబంధిత వ్యక్తులకు వీలైనంత త్వారగా తెలియజేయాల్సి ఉంటుంది. -
ఆ చట్టానికి కోరలు ఎక్కువే!
ప్రారంభం నుంచీ మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) వరుసగా అనేక సవరణలకు గురై మరింత కఠినంగా మారింది. దాంతో చట్ట అన్వయా నికీ, వ్యక్తిగత స్వేచ్ఛకూ మధ్య సాధించాల్సిన సమతూకపు ఆవశ్యకత పెరుగుతోంది. పీఎంఎల్ఏ నిబంధనలు ప్రాథమిక హక్కులను ఉల్లంఘించలేదని చెప్పడం ద్వారా ఈడీకి ఉన్న విస్తారమైన అధికారాలను 2002లో సుప్రీంకోర్టు తీర్పు దృఢపరిచింది. ఈ తీర్పు ఫెడరల్ ఏజెన్సీకి అనవసరమైన వెసులు బాటు కల్పించిందని మానవ హక్కుల న్యాయవాదులు విమర్శించారు. ఏ రుజువూ లేకుండానే ఆరు నెలలు నిర్బంధంలో గడిపి, బెయిల్ మీద విడుదలైన ‘ఆప్’ ఎంపీ సంజయ్ సింగ్ కేసు ప్రాథమిక హక్కులపై పీఎంఎల్ఏ కలిగిస్తున్న ప్రభావాలను పునఃపరిశీలించవలసిన ఆవశ్యకతను నొక్కి చెబుతోంది. ఆర్థిక నేరాలకు వ్యతిరేకంగా భారత్ చేస్తున్న పోరాటంలో మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎమ్ఎల్ఏ) ఒక ముఖ్యసాధనం. 2005 జూలైలో అమలులోకి వచ్చి నప్పటి నుండి ఈ చట్టం సమూల మార్పులకు గురైంది. 2009, 2012, 2015, 2018, 2019, 2023లో ఈ చట్టానికి చేసిన పలు సవ రణలు... అక్రమ ఆస్తులకు వ్యతిరేకంగా దేశం ప్రదర్శిస్తున్న కఠిన వైఖరిని ప్రతిబింబిస్తాయి. ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్‌కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన తాజా పరిణామం... కఠినమైన చట్టాన్ని అన్వయించడంలో న్యాయపరమైన పర్యవేక్షణ, జవాబుదారీతనాలకు సంబంధించిన క్లిష్టమైన అవసరాన్ని గుర్తించింది. మనీలాండరింగ్‌లో తన ప్రమేయం ఉన్నట్లు రుజువు లేకుండానే ఆరు నెలలు నిర్బంధంలో గడిపిన తర్వాత, సింగ్ బెయిల్ పిటీషన్‌పై సవాలు చేయకూడదని ఈడీ (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) నిర్ణయించుకుంది. గత కొన్ని సంవత్సరాలుగా, ప్రత్యేకించి 2022లో ‘విజయ్ మదన్‌లాల్ చౌదరి’ కేసుపై అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు తర్వాత, మనీలాండరింగ్ చట్టం నిబంధనలను రాజ్యాంగ సూత్రా లతో సమతుల్యం చేయాలని సుప్రీంకోర్టును ఎక్కువగా కోరడం జరుగుతోంది. పీఎంఎల్ఏ నిబంధనలు ప్రాథమిక హక్కులను ఉల్లంఘించలేదని నొక్కి చెబుతూ ఈడీకి ఉన్న విస్తారమైన అధికారాలను ఆ తీర్పు దృఢపరిచింది. జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్ నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం (ఈయన పదవీ విరమణ చేశాక లోక్‌పాల్ చైర్‌పర్సన్‌గా నియమితులయ్యారు), అక్రమాస్తుల నిరోధ సమస్యను పరిష్కరించడానికి కఠినమైన చర్యల అవసరాన్ని నొక్కి చెప్పింది. పైగా, ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్) కింద భారతదేశ బాధ్యతలను నెరవేర్చడంలో ఈ చట్టం పాత్రను ధర్మాసనం గుర్తించింది. ఈ తీర్పు ఈడీని బలోపేతం చేసినప్పటికీ, వ్యక్తిగత స్వేచ్ఛలు, విధానపరమైన భద్రతలను పణంగా పెట్టి, ఫెడరల్ ఏజెన్సీకి అనవసరమైన వెసులుబాటు కల్పించిందని న్యాయ నిపుణులు, మానవ హక్కుల న్యాయవాదులు విమ ర్శలు గుప్పించారు. న్యాయం, వ్యక్తిగత హక్కుల ప్రయోజనాలను సమతుల్యం చేయడానికి బదులుగా, ఈ తీర్పు ఈడీ అధికారాన్ని దుర్వినియోగం చేయగలదనే భయాందోళనలకు తావిచ్చింది. ఈ తీర్పు వెలువడిన కేవలం ఒక నెల తర్వాత, మరో ముగ్గురు న్యాయమూర్తుల బెంచ్ దానిపై రివ్యూ పిటిషన్లను అంగీకరించింది. నిందితులకు ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఈసీఐఆర్) కాపీని తిరస్కరించడం, నిర్దోషిత్వాన్ని నిరూపించుకునే బాధ్యత నిందితుడి మీద ఉండటం– రెండు అంశాలను పునఃపరిశీలించడానికి ధర్మాసనం అంగీకరించింది. 2022 తీర్పుపై రివ్యూ పిటిషన్ పెండింగులో ఉండగా, వివిధ ఇతర కేసుల్లో మనీలాండరింగ్ చట్టం నిబంధనలను సుప్రీంకోర్టు వివరించాల్సి వచ్చింది, కొన్నిసార్లు ఎన్ఫోర్స్ మెంట్ అధికారాల పరిధిని న్యాయస్థానం పరిమితం చేసింది. తదనంతరం సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పులలో కొన్ని విజయ్ మదన్ లాల్ చౌదరి తీర్పునకు విరుద్ధమైన అభిప్రాయాన్ని వ్యక్తపరిచాయి. ఉదాహరణకు, 2023 అక్టోబర్‌లో ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన బెంచ్ భిన్నమైన దృక్పథాన్ని తీసుకుంది. మనీలాండరింగ్ కేసుల్లో నిందితులకు వారిని అరెస్టు చేసిన కారణాల కాపీని ఈడీ తప్పనిసరిగా అందించాలని ధర్మాసనం ఆదేశించింది. మౌఖికంగా మాత్రమే సమాచారాన్ని అందించడం రాజ్యాంగ హక్కు ఉల్లంఘనగా పరిగణించబడుతుందని పేర్కొంది. అయితే, 2022 తీర్పు, నిందితు డిని అరెస్టు చేయడానికి గల కారణాలను వెల్లడించడం అనేది రాజ్యాంగంలోని ఆర్టికల్ 22(1)కి తగినంత సమ్మతి కలిగి ఉందని చెప్పింది. వారి అరెస్టుకు కారణాలు తెలియజేయకుండా లేదా వారు ఎంచుకున్న న్యాయవాదిని సంప్రదించే హక్కును తిరస్కరిస్తూ, అరెస్టు చేసిన ఎవరినైనా సరే కస్టడీలో ఉంచకూడదని పేర్కొంది. 2023 తీర్పును సమీక్షించాలని కేంద్రం, ఈడీ గతనెలలో చేసిన అభ్యర్థనను కూడా తోసిపుచ్చడమైనది. అదేవిధంగా, 2023 ఆగస్టులో తమిళనాడు మంత్రి వి సెంథిల్ బాలాజీ మెడికల్ బెయిల్ పిటిషన్‌పై ఇచ్చిన తీర్పులో, అక్రమాస్తుల నిరోధక చట్టంలోని సెక్షన్ 19 కింద అరెస్టు చేసే అధికారాలను జాగ్రత్తగా ఉపయోగించాలని సుప్రీంకోర్టు నొక్కి చెప్పింది. విధాన పరమైన లేదా ముఖ్యమైన ఉల్లంఘనలు ఉన్నట్లయితే, అరెస్టు చేసిన వ్యక్తిని న్యాయమూర్తులు వెంటనే విడుదల చేయాలని ఈ తీర్పు పేర్కొంది. ఈ తీర్పు అధికార దుర్వినియోగాన్ని నిరోధించడంలోనూ, సరైన కారణం లేకుండా అరెస్టులు శిక్షార్హమైనవి కాదని నిర్ధారించడంలోనూ న్యాయవ్యవస్థ పాత్రను బలపరిచింది. 2023 అక్టోబర్‌లో, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఇచ్చిన మరో తీర్పు, సత్వర విచారణను కోరుకోవడం ప్రాథమిక హక్కుగా నొక్కి చెప్పింది. అదే సమయంలో అక్రమాస్తుల నిరోధక చట్టంలోని సెక్షన్ 45 ఆరోపించినట్లుగా నేరాభియోగాలకు తాము పాల్పడలేదని నిందితులే రుజువు చేసుకోవాలంటూ వారిపై ప్రాథమికంగా మోపే భారం అనేది వారి బెయిల్ మంజూరుకు సంపూర్ణ అడ్డంకి కాదని స్పష్టం చేసింది. ‘నిందితుడికి నిమిత్తం లేని కారణాల వల్ల విచారణ కొనసాగనప్పుడు, సరైన కారణాలు ఉంటే తప్ప, బెయిల్ మంజూరు చేసే అధికారాన్ని ఉపయోగించుకునేలా న్యాయస్థానం మార్గనిర్దేశం చేయవచ్చు. విచారణకు సంవత్సరాల కాలం పట్టే చోట ఇది నిజం’ అని చెప్పింది. 2023 నవంబర్‌లో పవన దిబ్బూర్ కేసులో ఇచ్చిన తీర్పులో, మనీలాండరింగ్ దర్యాప్తు ప్రారంభించడానికి భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 120బీ కింద శిక్షార్హమైన నేరపూరిత కుట్ర మాత్రమే సరిపోదనీ, 2002 చట్టం కింద షెడ్యూల్డ్ నేరంగా ఆ కుట్ర ఉండాలనీ ప్రకటించింది. ఈ తీర్పు ఆధారంగానే కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌పై నమోదైన కేసును సుప్రీంకోర్టు గత నెలలో కొట్టేసింది. సంజయ్ సింగ్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశం, మనీలాండరింగ్ నిరోధక చట్టం విషయంలో పురోగమిస్తున్న న్యాయశాస్త్రానికి మరొక ఉదాహరణ. రాజకీయ లేదా వ్యక్తిగత ప్రయోజనాల కోసం చట్టపరమైన యంత్రాంగాలను దుర్వినియోగం చేయకుండా నిరోధించాల్సిన ఆవశ్యకతను ఇది సూచిస్తుంది. ఈ కేసు దృఢమైన న్యాయ పరిశీలన ప్రాముఖ్యతను గుర్తుచేస్తోంది. మనీలాండరింగ్ నిరోధక చట్టాన్ని అమలు చేయడంలో, వ్యక్తిగత స్వేచ్ఛను పరిరక్షించడంలో ప్రభుత్వ అధికారాల మధ్య సమతుల్యతను తిరిగి అంచనా వేయ డానికీ, పునశ్చరణ చేయడానికీ ఒక విస్తృత ధర్మాసనం ద్వారా 2022 తీర్పును సమగ్రంగా సమీక్షించవలసిన అవసరాన్ని కూడా ఇది గుర్తుచేస్తోంది. ఇతర కేసులతో పాటు సంజయ్ సింగ్ కేసు, మనీలాండరింగ్ చట్టపరిధిలో ఉన్న కీలకమైన అంశాన్ని సూచిస్తోంది. ప్రాథమిక హక్కులపై మనీలాండరింగ్ చట్టం కలిగిస్తున్న ప్రభావాలను పూర్తిగా పునఃపరిశీలించవలసిన ఆవశ్యకతను నొక్కి చెబుతుంది. స్వేచ్ఛను కాపాడడానికి ఉద్దేశించిన న్యాయం రాజీ పడకుండా చూసేందుకు ఒక విస్తృత ధర్మాసనం ద్వారా పునఃపరిశీలన చేయాలని ఇది సూచిస్తోంది. మనీలాండరింగ్ నిరోధక చట్టం ప్రాథమిక స్వేచ్ఛలను సవాలు చేస్తూనే ఉన్నందున, అమలు యంత్రాంగాలు న్యాయ, నిష్పక్షపాత సూత్రాలను అధిగమించకుండా చూడటంలో న్యాయవ్యవస్థ జాగ రూకతా పాత్ర అనివార్యమవుతోంది. ఉత్కర్ష్ ఆనంద్ వ్యాసకర్త జర్నలిస్ట్, కాలమిస్ట్ (‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
టోనీ వ్యవహారంలో మనీల్యాండరింగ్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్, బెంగళూరు, ముంబై కేంద్రంగా ఏళ్లుగా డ్రగ్స్ దందా సాగించిన నైజీరియన్ టోనీ మనీ లాండరింగ్‌కు పాల్పడినట్లు పంజగుట్ట పోలీసులు గుర్తించారు. దీనికి సంబంధించి ఆధారాలు సేకరించాక ఈడీ అధికారులకు సమాచారం ఇవ్వనున్నారు. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్ఏ) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేసే అవకాశం ఈడీ అధికారులకు ఉంది. అయితే పీఎంఎల్ఏ కింద నమోదయ్యే కేసులు రూ. వందలు, రూ.వేల కోట్లలో ఉంటాయి. టోనీ దందా రూ.10 కోట్ల లోపే ఉంటుందని భావిస్తుండటంతో ఎలా స్పందిస్తారో చెప్పలేమని ఓ పోలీసు అధికారి అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయిపై జంగ్ నడుస్తుండటంతో కేసు ప్రాధాన్యతను వివరిస్తూ ఈడీకి లేఖ రాస్తామని చెప్పారు. విగ్గుల వ్యాపారం ముసుగులో.. కస్టమర్లతో సోషల్ మీడియా ద్వారా సంప్రదింపులు జరిపిన టోనీ ఆర్థిక లావాదేవీలకు అనుచరులైన ఆరిఫ్ తదితరుల ఖాతాలు వాడుకున్నాడు. వీటిలోకి వచ్చిన డబ్బులో ఖర్చులు, ఏజెంట్ల కమీషన్లు పోగా మిగతాది విగ్గులు, వస్త్రాల వ్యాపారం ముసుగులో నైజీరియాలోని తన స్వస్థలానికి తరలించాడు. ఇందుకు ముంబైలోని అంధేరీలో వెస్ట్రన్ యూనియన్ సంస్థ ద్వారా ఈ లావాదేవీలు చేశాడు. డ్రగ్ దందాకు సంబంధించిన ఇవన్నీ మనీ లాండరింగ్ కిందికే వస్తాయని పంజగుట్ట పోలీసులు చెప్తున్నారు. టోనీతో పాటు ఆరిఫ్, ఆసిఫ్, ఆఫ్తాబ్‌ల విచారణలో వెలుగులోకి వచ్చిన అంశాలకు సంబంధించి ఆధారాలు సేకరించాక టోనీ, అతడి అనుచరులతో పాటు వీరి వద్ద డ్రగ్స్ కొన్న బడాబాబుల వివరాలు, బ్యాంకు స్టేట్మెంట్లను ఈడీకి అప్పగించాలని నిర్ణయించారు. మరోపక్క 2019లో గోల్కొండ, నాంపల్లి ఎక్సైజ్ పోలీసుస్టేషన్లలో నమోదైన కేసుల్లో ఎస్కే చుక్స్ పేరుతో టోనీ వాంటెడ్‌గా ఉన్నాడు. దీని ఆధారంగా టోనీని పీటీ వారెంట్‌పై తమ కేసుల్లో అరెస్టు చేయడానికి ఎక్సైజ్ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఆపై రెండు కేసుల్లోనూ వేర్వేరుగా కస్టడీలోకి తీసుకోవాలని నిర్ణయించారు. ముగ్గురి రిమాండ్ పంజగుట్ట: డ్రగ్స్ కేసులో మహారాష్ట్రలో అరెస్టు చేసిన ముగ్గురు డ్రగ్స్ సప్‌లైయర్స్‌ను పంజగుట్ట పోలీసులు శుక్రవారం రిమాండ్‌కు తరలించారు. కేసులో 5వ నిందితుడుగా ఉన్న మహారాష్ట్రలో డెలివరీ బాయ్‌గా పని చేసే ఎమ్.డీ ఆసిఫ్ ఆరిఫ్ షేక్ (22), ముంబైలో మొబైల్ సర్వీసింగ్ చేసే ఆరిఫ్ అహ్మద్ ఖాన్ (21) (7వ నిందితుడు), మహారాష్ట్రలో మొబైల్ సర్వీసింగ్ సెంటర్ నడిపిస్తున్న మహ్మద్ ఇర్ఫాన్ ఆరిఫ్ షేక్ (27) (9వ నిందితుడు)లను అదుపులోకి తీసుకున్నారు. వీరిని శుక్రవారం నాంపల్లిలోని కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. -
చింపాంజీలను అటాచ్ చేసిన ఈడీ!
న్యూఢిల్లీ: ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మూడు చింపాంజీలు, నాలుగు మార్మోసెట్ల (పొడవాటి తోక గల దక్షిణ అమెరికా కోతులు) ను అటాచ్చేసింది. ఈడీ చింపాంజీలను అటాచ్ చేయడమేంటి అనుకుంటున్నారా? మీరు చదివింది నిజమే. పశ్చిమ బెంగాల్‌కు చెందిన వన్యప్రాణి స్మగ్లర్‌పై మనీలాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా వీటిని అటాచ్ చేసింది. స్మగ్లర్ ఇంటి నుంచి వాటిని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకుని కోల్‌కతాలోని అలిపోర్ జంతుప్రదర్శన శాలలో ఉంచినట్లు కేంద్ర సంస్థ వెల్లడించింది. ఈ చింపాంజీలు సందర్శకులను ఆకర్షించడమే కాకుండా, జూకి ఒక మంచి ఆదాయ మార్గం అని చెప్పింది. కాగా, కోతులను జంతు శాలలో ఉంచినట్లు తెలిపింది. ఈ విధంగా మనీ లాండరింగ్ చట్టంకింద జంతువులను అటాచ్ చేయడం మొదటి సారి అని ఈడీ పేర్కొంది. స్మగ్లర్ ఆ జంతువులను అక్రమంగా రవాణా చేసేందుకు ప్రయత్నించినట్లు ఆరోపించింది. మొత్తం ఏడు జంతువుల విలువ రూ.81 లక్షలు ఉంటుందని, ఒక్కో చింపాంజీ విలువ రూ.25 లక్షలు కాగా.. కోతుల విలువ రూ.1.5 లక్షలుంటుందని వెల్లడించింది. అడవి జంతువులను అక్రమంగా నిర్భంధించాడని స్మగ్లర్ సుప్రదీప్ గుహపై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కేసు నమోదు చేసింది. గుహ ‘వ్యవస్థీకృత వన్యప్రాణుల అక్రమ రవాణా రాకెట్‌ను నడుపుతున్నట్లు తమ పరిశోధనలో వెల్లడైనట్లు ఈడీ తెలిపింది. -
రూ.16 కోట్ల జకీర్ ఆస్తుల అటాచ్మెంట్
న్యూఢిల్లీ: వివాదాస్పద ఇస్లాం మత బోధకుడు జకీర్ నాయక్‌కు సంబంధించిన రూ. 16.40 కోట్ల విలువైన ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ స్వాధీనం చేసుకుంది. మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి ఈ ఆస్తులను జప్తు చేసినట్లు శనివారం వెల్లడించింది. జకీర్ కుటుంబసభ్యుల పేరిట ముంబై, పుణేలో ఉన్న ఈ స్థిరాస్తులను ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్ (పీఎమ్ఎల్ఏ) కింద జప్తు చేసినట్లు పేర్కొంది. జకీర్ బ్యాంక్ ఖాతాకు వచ్చిన విరాళాలను తన భార్య, కొడుకు, మేనకోడలు అకౌంట్లకు పంపినట్లు ఆధారాలు సేకరించిన ఈడీ ఈ ఆస్తులను జప్తు చేసింది. జప్తు చేసిన వాటిలో ముంబైలోని ఫాతిమా హైట్స్, ఆఫియా హైట్స్ భవంతులతో పాటు బాందప్ ప్రాంతంలోని ఆస్తులు, పుణేలోని కొన్ని ప్రాజెక్టులు ఉన్నాయి. -
‘పోంజీ’ బాధితులకు పరిహారం!
చట్ట సవరణ చేస్తున్నట్లు కేంద్రం ప్రకటన న్యూఢిల్లీ: మోసపూరిత పథకాల్లో(పోంజీ స్కీమ్స్) నష్టపోయిన వారికి ఊరట కలిగించే కీలక సంకేతాన్ని కేంద్రం ఇచ్చింది. శారద తరహా పథకాల్లో మోసానికి గురైన వారికి నష్టపరిహారం అందేలా ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్ఏ)కు సవరణలు చేస్తున్నట్లు రెవెన్యూ కార్యదర్శి శక్తికాంత దాస్ శుక్రవారం ఇక్కడ ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టర్ (ఈడీ) నిర్వహించిన ఒక కార్యక్రమంలో వెల్లడించారు. మోసపూరిత పథకాల్లో నష్టపోయిన మదుపుదారుల సంఖ్య దాదాపు 6 కోట్లు ఉంటుందని అంచనా. నష్టపోయిన విలువ దాదాపు రూ.80,000 కోట్లుగా భావిస్తున్నారు. ఆయా అంశాలను శక్తికాంత దాస్ ప్రస్తావిస్తూ... ఐబీ, సీబీఐ, కస్టమ్స్, డీఆర్ఐ, ఆదాయపు పన్ను శాఖ, ఈడీ వంటి వివిధ విచారణా సంస్థల మధ్య చక్కటి సమన్వయం, సహకారం ద్వారా మోసపూరిత పథకాలను నిరోధించవచ్చని అన్నారు. ఫైనాన్స్ బిల్లులో చొరవ... ఫైనాన్స్ బిల్లులో పోంజీ స్కీమ్‌ల నిరోధానికి సంబంధించి నిబంధనలు ఉన్నట్లు పేర్కొంటూ, అయితే ఈ విషయం తగినంత ప్రచారం కాలేదని అన్నారు. పోంజీ స్కీమ్‌ల బాధితులకు పరిహారం కల్పించేలా చర్యలకు ఒక నిబంధన ఫైనాన్స్ బిల్లులో ఉందన్నారు. మోసపూరిత పథకాల్లో నష్టపోయిన వారికి పరిహారం అందించడం... కోర్టుల పర్యవేక్షణ వంటి అంశాలకు సంబంధించి రానున్న కాలంలో తగిన మార్గదర్శకాలు, నిబంధనలను వెలువరించనున్నట్లు రెవెన్యూ కార్యదర్శి వెల్లడించారు. ప్రత్యక్ష, పరోక్ష పన్ను చట్ట నిబంధనలను ఉల్లంఘించినవారిపై ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేటే కఠిన చర్యలు తీసుకునేలా పీఎంఎల్ఏలో సవరణల అంశం ఫైనాన్స్ బిల్లులో మరో ముఖ్యమైన అంశంగా పేర్కొన్నారు. -
144 కోట్ల విలువైన మధుకోడా ఆస్తుల జప్తు!
న్యూఢిల్లీ/లక్నో: అక్రమ ఆస్థుల కేసులో జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి మధు కోడా కు చెందిన 144 కోట్ల విలువైన ఆస్టులను ప్రత్యేక మానిలాండరింగ్ కోర్టు జప్తు చేసింది. పూణే, ముంబైలోని ప్రధాన ప్రాంతాల్లోని 25 ఫ్లాట్లను, జమ్ షెడ్ పూర్ లో ఓ షాపింగ్ మాల్ ను ప్రత్యేక కోర్టు జప్తు చేసింది. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టెరెట్ (ఈడీ) దర్యాప్తులో భాగంగా ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ పరిధి కింద ఆస్తులను జప్తు చేయడం జరిగిందని ప్రత్యేక కోర్టు తెలిపింది. ఈ ఏడాది ప్రారంభంలో ఇండోనేషియాలో అరెస్ట్ చేసిన వ్యాపార వేత్త అనిల్ ఆదినాథ్ బస్తవాడే కు సంబంధించిన ఆస్తులను కూడా జప్తు చేశారు. ముంబైలోని మతుంగ ప్రాంతంలోని ఓ ఆపార్ట్ మెంట్ లో కోడా సన్నిహితుడు మనోజ్ బి పునామియా పేరిట ఉన్న పది ఫ్లాట్లను, మలాడ్, గోరేగావ్, నారిమన్ పాయింట్ లోని ఖరీదైన ఫ్లాట్లను జప్తు చేసింది. ఇక జార్ఖండ్ లోని 14.20 కోట్ల విలువైన 'ఎమెరాల్డ్ మాల్' కూడా జప్తు చేసిన వాటిలో ఉంది.