న్యూఢిల్లీ: బొగ్గు స్కాం కేసులో జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి మధు కోడా, కేంద్ర మాజీ బొగ్గు గనుల శాఖ కార్యదర్శి హెచ్‌సీ గుప్తాలను సీబీఐ ప్రత్యేక కోర్టు దోషులుగా తేల్చింది. కోల్‌కతాకు చెందిన విని ఐరన్, స్టీల్ ఉద్యోగ్ లిమిటెడ్ (విసుల్) కంపెనీకి జార్ఖండ్‌లోని రాజారా నార్త్ బొగ్గు బ్లాక్ కేటాయింపుల విషయంలో అవకతవకలు జరిగాయని కేసు నమోదైంది.
ఈ కేసులో మధు కోడా, గుప్తాలతో పాటు జార్ఖండ్ మాజీ సీఎస్ ఏకే బసు, విసు హస్తముందని సీబీఐ జడ్జి తీర్పుచెప్పారు. వీరికి శిక్ష విధించే విషయంలో నేడు వాదనలు జరగనున్నాయి. స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ అయిన గుప్తా ఈ విషయంలో నిజాలను అప్పటి ప్రధాని, బొగ్గు గనుల శాఖ మంత్రి అయిన మన్మోహన్ సింగ్ వద్ద దాచిపెట్టారని సీబీఐ ఆరోపించింది. కేటాయింపుల విషయంలో మధు కోడా, బసు, మరో ఇద్దరు అధికారులు విసుల్‌కి కేటాయింపులు జరగడంలో సాయపడ్డారంది.
Comments
Please login to add a commentAdd a comment