
ఇలాంటి వారిని గుర్తించి తామే సహాయం అందిస్తామని, కంగారు పడాల్సిన పనిలేదన్నారు.
రాంచీ: లాక్‌డౌన్ కారణంగా వివిధ రాష్ట్రాల్లో చిక్కకుపోయిన జార్ఖండ్ వాసులకు తీసుకొచ్చే బాధ్యత తమదని ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ భరోసాయిచ్చారు. తమ రాష్ట్రానికి చెందిన వలస కార్మికులు, విద్యార్థులు, ఇతరులను స్వస్థలాలకు తరలిస్తామని ఆయన చెప్పారు. ఇలాంటి వారిని గుర్తించి తామే సహాయం అందిస్తామని, కంగారు పడాల్సిన పనిలేదన్నారు.
కాగా, దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులు, విద్యార్థులు పర్యాటకులను ‘శ్రామిక్ స్పెషల్’ రైళ్లలో స్వస్థలాలకు తరలించేందుకు కేంద్ర హెంశాఖ శుక్రవారం అనుమతి ఇచ్చింది. దీంతో 400పైగా రైళ్లు పట్టాలెక్కనున్నాయి. కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం మార్చి 25 నుంచి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగిస్తుండటంతో లక్షల సంఖ్యలో వలస కార్మికులు, విద్యార్థులు తిండి తిప్పలు లేక చాలా ప్రాంతాల్లో చిక్కుకుపోయారు. వీరంతా తమ ఊళ్లకు తిరిగి వెళ్లిపోవాలని భావిస్తున్నారు. (ప్రత్యేక రైళ్లలో ప్రయాణించాలంటే..)
కాగా, తమ రాష్ట్రంలోని వలస కూలీలను తరలించేందుకు తెలంగాణ ముందడుగు వేసింది. జార్ఖండ్ వాసులతో కూడిన ప్రత్యేక రైలు శుక్రవారం ఉదయం లింగపల్లి నుంచి హతియా బయలుదేరింది. లాక్‌డౌన్ సమయంలో వలస కార్మికులను తరలించడానికి ఏర్పాటు చేసిన తొలి రైలు ఇదే కావడం గమనార్హం. (3 తర్వాత లాక్‌డౌన్ సడలింపు పక్కా..)