రాంచీ: జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ శాసనసభ్యత్వం రద్దుపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. కేంద్ర ఎన్నికల సంఘం పంపిన లేఖపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు ఆ రాష్ట్ర గవర్నర్ రమేశ్ బయాస్. సంక్షోభం కొనసాగుతున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ నేతృత్వంలోని అధికార యూపీఏ కూటమి గవర్నర్‌ను కలిసేందుకు సిద్ధమైంది. అధికార కూటమి నేతలు గురువారం సాయంత్రం 4 గంటలకు అపాయింట్‌మెంట్ తీసుకున్నట్లు జేఎంఎం పార్టీ వర్గాలు తెలిపాయి. మరోవైపు.. గవర్నర్‌కు సీఎం హేమంత్ సోరెన్ సైతం ఫోన్ చేసినట్లు పేర్కొన్నాయి. గవర్నర్‌తో జేఎంఎం-కాంగ్రెస్ కూటమి నేతల భేటీతో రాజకీయ సంక్షోభానికి తెరపడనుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ముఖ్యమంత్రిపై ఆరోపణలు వచ్చిన క్రమంలో రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం తలెత్తింది. ఈ నేపథ్యంలో బేరసారాల నుంచి తమ ఎమ్మెల్యేలను కాపాడుకొనేందుకు అధికార యూపీఏ 32 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌కు గత మంగళవారం తరలించింది. గవర్నర్‌ను కలవనున్న నేపథ్యంలో వారు రాంచీకి రానున్నట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి: కొనుగోలు అనుమానాలు.. ఎమ్మెల్యేలను రాష్ట్రం దాటించిన కాంగ్రెస్
Comments
Please login to add a commentAdd a comment