UPA alliance
-
జార్ఖండ్ సంక్షోభంలో కీలక పరిణామం.. గవర్నర్‌తో యూపీఏ నేతల భేటీ!
రాంచీ: జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ శాసనసభ్యత్వం రద్దుపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. కేంద్ర ఎన్నికల సంఘం పంపిన లేఖపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు ఆ రాష్ట్ర గవర్నర్ రమేశ్ బయాస్. సంక్షోభం కొనసాగుతున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ నేతృత్వంలోని అధికార యూపీఏ కూటమి గవర్నర్‌ను కలిసేందుకు సిద్ధమైంది. అధికార కూటమి నేతలు గురువారం సాయంత్రం 4 గంటలకు అపాయింట్మెంట్ తీసుకున్నట్లు జేఎంఎం పార్టీ వర్గాలు తెలిపాయి. మరోవైపు.. గవర్నర్‌కు సీఎం హేమంత్ సోరెన్ సైతం ఫోన్ చేసినట్లు పేర్కొన్నాయి. గవర్నర్‌తో జేఎంఎం-కాంగ్రెస్ కూటమి నేతల భేటీతో రాజకీయ సంక్షోభానికి తెరపడనుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యమంత్రిపై ఆరోపణలు వచ్చిన క్రమంలో రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం తలెత్తింది. ఈ నేపథ్యంలో బేరసారాల నుంచి తమ ఎమ్మెల్యేలను కాపాడుకొనేందుకు అధికార యూపీఏ 32 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌కు గత మంగళవారం తరలించింది. గవర్నర్‌ను కలవనున్న నేపథ్యంలో వారు రాంచీకి రానున్నట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: కొనుగోలు అనుమానాలు.. ఎమ్మెల్యేలను రాష్ట్రం దాటించిన కాంగ్రెస్ -
కాంగ్రెస్ సారథ్య బాధ్యతలపై ప్రశాంత్ కిశోర్ కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహించడం ఏ వ్యక్తికి దైవదత్తంగా సంక్రమించే హక్కు కాదని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ అన్నారు. గత పదేళ్ల కాలంలో 90 శాతానికి పైగా ఎన్నికల్లో ఓడిపోయిన ఒక పార్టీకి నేతృత్వం వహించే హక్కు దానంతట అదే రాదని పేర్కొన్నారు. మమతా బెనర్జీ యూపీఏ కూటమి లేదంటూ కామెంట్లు చేసిన మర్నాడు గురువారం రాహుల్‌గాంధీపై ప్రశాంత్ కిశోర్ ట్విట్టర్ వేదికగా మాటల దాడికి దిగారు. దేశ రాజకీయ ముఖచిత్రంలో కాంగ్రెస్ పార్టీకి ఒక స్థానం ఉందని, ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ అవసరం చాలా ఉందని అభిప్రాయపడ్డారు. అయితే ప్రతిపక్ష కూటమికి సారథి ఎన్నిక ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలని తన ట్వీట్లో పేర్కొన్నారు. కాంగ్రెస్ లేని కూటమి ఆత్మ లేని శరీరమే: సిబల్ యూపీఏ కూటమే లేదంటూ మమత చేసిన వ్యాఖ్యల్ని కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ తిప్పికొట్టారు. కాంగ్రెస్ లేని యూపీఏ అంటే ఆత్మ లేని శరీరం వంటిదన్నారు. ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి తమ సత్తా చూపించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ప్రశాంత్ కిశోర్ చేసిన వ్యాఖ్యలనూ తిప్పికొట్టారు. ఇతర పార్టీల ఎజెండా ఏంటో ప్రశాంత్ ఎలా నిర్ణయిస్తారని ప్రశ్నించారు. ఎన్నికల్లో ఎలా పోటీ చేయాలో సలహాలిచ్చుకునే స్వేచ్ఛ ఆయనకు ఉందని, కానీ మరో పార్టీ ఎజెండాపై ఎలా మాట్లాడాతారని నిలదీశారు.‘మమతది పచ్చి రాజకీయ అవకాశవాదం. ఆర్ఎస్ఎస్, బీజేపీలను ఎదుర్కొంటున్నట్లు నటిస్తూ అదే ఫాసిస్టు శక్తులకు అనుకూలంగా పనిచేస్తున్నారు’ అని రణ్‌దీప్ సూర్జేవాలా ధ్వజమెత్తారు. -
యూపీఏకు పవార్ సారథ్యం?
సాక్షి, న్యూఢిల్లీ: మరాఠా రాజకీయ యోధుడు శరద్ పవార్‌ను యూపీఏకు సారథ్యం వహించే దిశగా అడుగులు పడుతున్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దేశ రాజధానిలో రైతులు ఆందోళన చేస్తున్న సమయంలో శరద్ పవార్ విపక్ష బృందానికి సారథ్యం వహించి బుధవారం రాష్ట్రపతిని కలిసిన విషయం తెలిసిందే. ఈ భేటీకి ముందు రైతుల అభ్యంతరాల అధ్యయనం, విపక్షాలను ఏకం చేసేందుకు పవార్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కసరత్తు జరిగింది. శరద్ పవార్ నివాసంలో రైతుల సమస్యలపై విపక్ష నాయకులతో సమావేశాలు సైతం జరిగాయి. దీంతో ఇప్పుడు రాష్ట్రపతితో భేటీ తర్వాత యూపీఏ అధ్యక్ష బాధ్యతల మార్పుపై రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. ఎందుకు తప్పుకోవాలనుకుంటున్నారు? 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తరువాత రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయడంతో సోనియాగాంధీ తాత్కాలిక అధ్యక్షురాలిగా మారారు. అయితే, వయోభారం కారణంగా రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకొనేందుకు, యూపీఏ అధ్యక్ష బాధ్యతల్లో కొనసాగేందుకు సోనియా గాంధీ విముఖత చూపిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో, త్వరలోనే ఆ బాధ్యతలను అనుభవం కలిగిన నేతకు అప్పగించాలని చర్చ జరుగుతున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. గతంలో సోనియా కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుంచి వైదొలిగినప్పటికీ, యూపీఏ చైర్‌పర్సన్‌గా, పార్లమెంటరీ పార్టీ నాయకురాలిగా కొనసాగారు. ఈసారి మాత్రం ఆమె రాజకీయాలకే రిటైర్మెంట్ ప్రకటించేందుకు సిద్ధమయ్యారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీంతో సోనియాగాంధీ స్థానాన్ని భర్తీ చేసేందుకు అనుభవజ్ఞుడైన, అన్ని రాజకీయ పార్టీలతో చర్చలు జరపగల చైర్పర్సన్ అవసరమని యూపీఏ భాగస్వామ్య పక్షాలు భావిస్తున్నాయి. మహారాష్ట్ర రాజకీయాల్లో అనుభవజ్ఞుడైన శరద్ పవార్, సోనియా గాంధీ తర్వాత తదుపరి యూపీఏ చైర్‌పర్సన్‌గా ఎంపిక విషయంలో ముందు వరుసలో ఉన్నారు. యూపీఏ అధ్యక్ష బాధ్యతలను అప్పగించే విషయంలో మమతా బెనర్జీ, ఎంకే స్టాలిన్ వంటి ప్రాంతీయ పార్టీ నాయకులు ఉన్నప్పటికీ, రాజకీయంగా వారు ఇతర పార్టీ నాయకులతో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉండే అవకాశాలు తక్కువగా ఉంటాయి. పవార్ ఎందుకంటే.. ప్రస్తుత రాజకీయ సమీకరణాల నేపథ్యంలో మరాఠా యోధుడు శరద్ పవార్‌కు దాదాపు అన్ని పార్టీలతో కలిసి ముందుకు సాగే స్వభావం ఉంది. మహారాష్ట్రలో బీజేపీకి షాకిచ్చి ఎన్సీపీ–శివసేన–కాంగ్రెస్ కలయికతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో పవార్ కీలక పాత్ర పోషించారు. రాజకీయ సూత్రధారిగా కూడా శరద్ పవార్ ఏడాదిగా సక్సెస్ అయ్యారు. ఇతర రాజకీయ పార్టీలతో కలుపుకొని ముందుకెళ్ళే స్వభావం, యూపీఏ చీఫ్‌గా పొత్తులను నిర్వహించేటప్పుడు కీలకం అవుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. రాహుల్‌గాంధీతో మాట్లాడేందుకే ఇష్టపడని మమతా బెనర్జీతో పోలిస్తే, పవార్ వ్యవహార శైలి కారణంగా పొత్తు రాజకీయాలు కష్టం కాకపోవచ్చని పార్టీ వర్గాలు భావిస్తున్నారు. అదంతా ఒట్టిదే: ఎన్సీపీ ముంబై: సోనియాగాంధీ వైదొలిగితే యూపీఏ సారథ్య బాధ్యతలను తమ నేత శరద్ పవార్ చేపట్టే అవకాశాలున్నాయంటూ వస్తున్న వార్తలను ఎన్సీపీ ఖండించింది. అవన్నీ మీడియా ఊహాగానాలేనని ఎన్సీపీ ప్రతినిధి మహేశ్ తపసే కొట్టిపారేశారు. ప్రస్తుతం జరుగుతున్న రైతుల ఆందోళనల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు, కొందరి స్వార్థం కోసం ఇటువంటి నిరాధార అంశాలను మీడియా బయటకు తెస్తోందని ఆయన ఆరోపించారు. శరద్ పవార్(80) జాతీయ స్థాయి పాత్ర సైతం పోషించగల సమర్థులు, జనం నాడి తెలిసిన వ్యక్తి అని శివసేన పేర్కొంది. -
ప్రగతి లేని కూటమి
జాతీయ ప్రజాస్వామిక కూటమికి (ఎన్డీఏ)కు గట్టి పోటీ ఇస్తుందనుకున్న ఉమ్మడి ప్రగతిశీల కూటమి(యూపీఏ) కనీసం యుద్ధం కూడా సరిగా చేయకుండా మరోమారు చతికిలపడింది. ప్రతిపక్షమంటే ప్రభుత్వం చేసే ప్రతిపనీ విమర్శించేది కాదని ప్రజలు గుణపాఠం చెప్పారు. ప్రతిపక్షమంటే ప్రజలు చెప్పేది వినే పక్షం కావాలి కానీ, సొంత సోది ప్రజలకు చెప్పే పక్షం కాకూడదని తేల్చి చెప్పారు. 2014తో పోలిస్తే యూపీఏ అత్యంత స్వల్పంగా మెరుగుపడినట్లున్నా, ఎన్డీఏ సాధించిన మెజార్టీతో పోలిస్తే తేలిపోయింది. కూటమిలో ప్రధాన పక్షం కాంగ్రెస్ కనీసం 60 సీట్లను కూడా గెలుచుకోలేకపోవడం, కాంగ్రెస్ అధ్యక్షుడు అమేథీ నుంచి ఓటమి పాలవడం, కూటమిలోని ప్రధాన పక్షాలు ఆశించిన ఫలితాలు సాధించకపోవడం (డీఎంఏకే మినహా).. యూపీఏ భవితవ్యంపై నీలినీడలు కమ్మేలా చేస్తున్నాయి. ప్రస్తుత ఎన్నికల్లో కాంగ్రెస్ మిత్రపక్షాల్లో ఒక్క డీఎంకే తప్ప మిగిలిన ఏ పార్టీ కనీసం చెప్పుకోదగ్గ ఫలితాలను సాధించలేదు. స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే మాత్రం తమిళనాడులో 37 సీట్లలో విజయం సాధించింది. కొండంత ‘రాగా’లు తీసి.. యూపీఏకి వెన్నెముక కాంగ్రెస్ పార్టీ. 2014లో చతికిలపడిన కాంగ్రెస్‌కి రాహుల్ గాంధీ(రాగా)పగ్గాలు చేపట్టడంతో ఉత్సాహం వచ్చింది. గతంతో పోలిస్తే రాహుల్‌లో మార్పు వచ్చింది.. ప్రసంగాల్లో పరిణితి వచ్చింది.. దేశానికి భవిష్యత్ నేతగా ఎదిగాడు.. మోదీని మించిపోయాడు.. అని కాంగ్రెస్ వాదులు మురిసిపోవడంలో మునిగిపోయారు. ఇందుకు తగ్గట్లే ఇటీవల మూడు శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ మంచి ఫలితాలు సాధించింది. దీంతో రాహుల్‌పై కాంగ్రెస్‌కు మరింత ధీమా పెరిగింది. కానీ లోక్‌సభ ఎన్నికలకు వచ్చేసరికి ఫలితాలు మాత్రం తేడాకొట్టాయి. రాహుల్‌ను చూసి కాంగ్రెస్ శ్రేణులు మురిసినట్లు ప్రజలు మక్కువ చూపలేదని, ఆయనలో ఇంకా సమర్థత పొడ ప్రజలకు కనిపించలేదని, దేశ్‌కీ నేతగా ఎదగాలంటే మరింత శ్రమించాలని ప్రజలు తీర్పునిచ్చారు. వారసత్వం సరిపోదని, నాయకుడంటే ప్రజలకు తనపై విశ్వాసం కలిగించాలని రాహుల్‌కు అర్ధమయ్యేలా చెప్పారు. కూటమికి నేతృత్వం వహిస్తున్నారన్న మాటేకానీ ఆయన్ను ప్రధానిగా కూటమిలోని పక్షాలే కొన్ని ఒప్పుకోలేదు. కూటమిలోనే ఏకాభిప్రాయం సాధించలేని వ్యక్తిగా ప్రజల్లో రాహుల్‌పై ముద్ర పడింది. దీనికితోడు ఇన్నాళ్లూ రాజకీయాలకు దూరంగా ఉన్న ప్రియాంకను అకస్మాత్తుగా తెరపైకి తీసుకురావడం రాగాకు, కాంగ్రెస్‌కు నష్టమే కలిగించింది. రాహుల్‌కు సత్తా లేకపోవడంతోనే ఆమెను రంగంలోకి దించారని ప్రజలకు అనిపించింది. పొత్తులు.. చిత్తు కూటమిగా 2 మార్లు అధికారంలో ఉన్న యూపీఏ ఈ సారి బలహీనపడింది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్‌తో పొత్తుకు ఎస్పీ, బీఎస్పీ నిరాకరించడం తీవ్ర ప్రభావం చూపింది. బీజేపీ వ్యతిరేక ఓటు చీలిపోకుండా చూడాల్సిన కాంగ్రెస్ ప్రాంతీయ పార్టీలను ఏకం చేయలేకపోయింది. ఆర్జేడీ, డీఎంకే, జేడీఎస్, ఎన్సీపీ, ఎండీఎంకే, నేషనల్ కాన్ఫరెన్స్‌లు తోడుగా ఉన్నా పెద్దగా ప్రయోజనం కనిపించలేదు. కీలకమైన బెంగాల్, యూపీల్లో పొత్తు లేకపోవడం, దక్షిణాదిన కేరళ మినహా మిగిలిన చోట్ల కాంగ్రెస్ ప్రాభవం బాగా క్షీణించడం యూపీఏపై ప్రభావం చూపాయి. రాహుల్ ప్రధాని అభ్యర్థిత్వానికి అంగీకరించని మాయావతి, మమతా బెనర్జీ ఏకంగా ప్రధాని పీఠంపై కూర్చోవాలని కలలుగన్నారు. వీరిద్దరి ఆశ అంతిమంగా కాంగ్రెస్‌ని దెబ్బతీసింది. ప్రతిపక్షాలను ఏకతాటిపై నడిపించేందుకు రాహుల్ నాయకత్వ చరిష్మా సరిపోలేదు. చివరి నిమిషం వరకు ఢిల్లీలో చర్చలు జరిపినా ఆప్‌తో పొత్తు కుదరలేదు. తెలంగాణలో టీడీపీతో ఉన్న పొత్తు ఏపీలో కనిపించలేదు. కర్నాటకలో సంకీర్ణ ప్రభుత్వం ఉన్నా అనుక్షణం జేడీఎస్‌తో కీచులా టలే. మరోపక్క ఎన్డీఏ కొందరు మిత్రులను కోల్పోయినా సొంతంగా పలుచోట్ల బలం పెంచుకుంది. కానీ కాంగ్రెస్ మాత్రం పొత్తు ధర్మాన్ని సరిగా నిర్వర్తించలేకపోయింది. రాజీనామా చేస్తారా? రాహుల్ కాంగ్రెస్ అధ్యక్ష పదవి చేపట్టాక ఆయన నేతృత్వంలో కాంగ్రెస్ ఎదుర్కొన్న తొలి పూర్తిస్థాయి ఎన్నికలు ఇవి. కొందరు రాహుల్‌ను ‘పప్పు’ అంటూ తిరస్కరించారు. మరికొందరేమో యువరాజులాంటి వాడని తిరస్కరించారు. ఏదేమైనా ఈఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర ఓటమికి పూర్తిస్థాయి బాధ్యత తనదేనని రాహుల్ ప్రకటించారు. ప్రధాని మోదీకి శుభాకాంక్షలు కూడా చెప్పారు. ‘ఓటమికి బాధ్యత మీదేనని ఒప్పుకున్నారు కాబట్టి అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటారా?’ అన్న ప్రశ్నకు మాత్రం ఆయన సూటిగా సమాధానం ఇవ్వలేదు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఈ అంశాన్ని పరిశీలిస్తారంటూ వెళ్లిపోయారు. మరి పార్టీ అధ్యక్ష పదవికి రాహుల్ రాజీనామా చేస్తారో లేదో చూడాల్సి ఉంది. పనిచేయని ప్రియాంక ‘మేజిక్’ న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో తాము తురుపు ముక్కగా భావించి బరిలోకి దించిన ప్రియాంకా గాంధీ వాద్రా ఓటర్లను ఆకర్షిస్తారనే కాంగ్రెస్ భావించింది. అయితే ఈ విషయంలో ఆమె పెద్దగా విజయం సాధించలేకపోయారనే చెప్పవచ్చు. 47 ఏళ్ల ప్రియాంకా ఏఐసీసీ ఉత్తరప్రదేశ్ (తూర్పు) జనరల్ సెక్రటరీ ఇన్చార్జ్గా నియమితులయ్యారు. ఆమె ఈ ఎన్నికల ప్రచారంలో సామాన్యుల దగ్గరకు అరమరికలు లేకుండా నడచివెళ్లడం, వారి సమస్యలను అడిగి తెలుసుకోవడం, మోదీ అనుకూల నినాదాలు చేస్తున్న వారి వద్దకు స్వయంగా నడచివెళ్లి వారితో కరచాలనం చేయడం, పాములను సైతం పట్టుకోవడం వంటి ఎన్నో ఆకర్షణీయమైన చర్యలకు శ్రీకారం చుట్టారు. ప్రధాని మోదీ విధానాల్లో లొసుగులను వివరించడమూ చేశారు. మరోవైపు తన అన్న రాహుల్‌కే ప్రచారంలో అధిక ప్రాధాన్యత ఇస్తూ, తాను మద్దతుదారు మాత్రమేనన్న సంకేతాలు ఇచ్చారు. అయితే ఆమె చర్యలు ఓట్లరూపంలోకి మారలేదు. కాంగ్రెస్ అభ్యర్థులు ప్రధాన ప్రత్యర్థులుగా పోటీ ఇవ్వలేకపోయారు. ప్రియాంక తన ఎన్నికల ప్రచారంలో వాస్తవ పరిస్థితి అనుగుణంగానే మసలుకున్నారు. తన వద్ద ఇంద్రజాలం ఏదీ లేదని, పార్టీని పటిష్టం చేయాల్సింది కార్యకర్తలేనని తరచూ పేర్కొన్నారు. -
ఆ ముగ్గురు కలిస్తే.. మోదీ అవుట్!
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కూటమితో అఖిలేశ్ యాదవ్, మాయావతి, మమతా బెనర్జీ చేతులు కలిపితే నరేంద్ర మోదీ పదవికి ముప్పు వాటిల్లే అవకాశముంది. ఎస్పీ, బీఎస్పీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలను కలుపుకుని సమిష్టిగా పోటీ చేస్తే కమలం పార్టీకి కష్టాలు తప్పవని ఇండియా టుడే- కార్వీ ఇన్సైట్స్ నిర్వహించిన ‘మూడ్ ఆఫ్ ది నేషన్ పోల్’లో వెల్లడైంది. ఇప్పటికిప్పుడు లోక్‌సభ ఎన్నికలు జరిగితే ఎస్పీ, బీఎస్పీ, తృణమూల్ కాంగ్రెస్‌లతో కూడిన యూపీఏ కూటమి 269 సీట్లు గెల్చుకుంటుందని అంచనా వేసింది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకు 219 స్థానాలు దక్కుతాయి. ఇతరులు 55 సీట్లతో సరిపెట్టుకోవాల్సి ఉంటుంది. ఓట్ల శాతం పరంగా చూస్తే యూపీఏ 44, ఎన్డీఏ 35, ఇతరులు 21 శాతం ఓట్లు దక్కించుకుంటారు. (ఏపీలో వైఎస్సార్ సీపీ ప్రభంజనం) నరేంద్ర మోదీ మళ్లీ అధికారంలోకి రాకుండా ఉండాలంటే యూపీఏతో ఎస్పీ, బీఎస్పీ, తృణమూల్ కాంగ్రెస్ తప్పనిసరిగా చేతులు కలపాల్సివుంటుంది. ఇవన్నీ కలిసినా ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మేజిక్ ఫిగర్ (272)కు మూడు స్థానాల దూరంలో నిలిచిపోతాయని సర్వే విశ్లేషించింది. అఖిలేశ్ యాదవ్, మాయావతి, మమతా బెనర్జీలను రాహుల్ గాంధీ ఒప్పిస్తారా, లేదా అనే దానిపై యూపీఏ విజయం ఆధారపడి ఉంటుందని స్పష్టం చేసింది. బీజేపీని ఓడించేందుకు వీరంతా ఏకతాటిపైకి వస్తారో, లేదో త్వరలోనే తేలనుంది. (తాజా సర్వే... మోదీకి భారీ షాక్) -
యూపీఏలోకి ఆర్ఎల్ఎస్పీ
న్యూఢిల్లీ: ఇటీవలే కేంద్ర మంత్రి పదవిని వదులుకుని ఎన్డీయే నుంచి బయటకొచ్చిన ఉపేంద్ర కుష్వాహ గురువారం యూపీఏతో చేతులు కలిపారు. బిహార్‌లో తమ రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ (ఆర్ఎల్ఎస్పీ) ప్రతిపక్షాల మహాకూటమిలో చేరిందని ఆయన ప్రకటించారు. ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో, సీనియర్ కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్, ఏఐసీసీ బిహార్ ఇన్ చార్జ్ శక్తిసింహ్ గోహిల్, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, ఇతర ప్రతిపక్ష నేతలు శరద్ యాదవ్, జతిన్ రాం మాంఝీ తదితరుల సమక్షంలో కుష్వాహ ఈ ప్రకటన చేశారు. కుష్వాహను మహాకూటమిలోకి ఆహ్వానించిన పై నేతలు.. తామంతా కలిసి వచ్చే ఎన్నికల్లో బీజేపీని గద్దె దింపుతామని చెప్పారు. మోదీ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైనందునే తాను ఎన్డీయే నుంచి బయటకొచ్చాననీ, అలాగే బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తమ పార్టీని అవమానిస్తున్నా మోదీ మౌనం వహించడం తనను బాధించిందని కుష్వాహ చెప్పారు. ప్రమాదంలో బీజేపీ–ఎల్జేపీ బంధం! బిహార్‌లో ఇప్పటికే ఆర్ఎల్ఎస్పీ ఎన్డీయే నుంచి బయటకొచ్చేయగా తాజాగా లోక్ జనశక్తి పార్టీ (ఎల్జేపీ) కూడా ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. -
ఎన్డీఏకు 258.. యూపీఏకు 202!
న్యూఢిల్లీ: ఇప్పటికిప్పుడు దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరిగితే 40 శాతం ఓట్లతో ఎన్డీఏ కూటమి 258 సీట్లు గెలుచుకుంటుందని ఇండియా టుడే– కార్వీ ఒపీనియన్ పోల్‌లో వెల్లడైంది. మొత్తం 543 సీట్లకు గాను కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కూటమి 38 శాతం ఓట్లతో 202 స్థానాల్లో విజయం సాధిస్తుందని తేలింది. ఇతర పార్టీలు 22 శాతం ఓట్లతో 83 సీట్లు సొంతం చేసుకుంటాయి. ఇండియా టుడే పోల్ ప్రకారం.. తదుపరి ప్రధానిగా 53 శాతం ఓట్లతో మోదీ అగ్రస్థానంలో ఉన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి 22 శాతం ఓట్లు మాత్రమే దక్కాయి. స్వాతంత్య్రం అనంతరం దేశంలో అత్యుత్తమ ప్రధానిగా మోదీకి 28 శాతం, ఇందిరా గాంధీకి 10 శాతం, అటల్ బిహారి వాజ్‌పేయికి 10 శాతం, నెహ్రూకు 8 శాతం మద్దతు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో నిరుద్యోగం(29 శాతం), ధరల పెరుగుదల(23 శాతం) ఎక్కువ ప్రభావితం చేసే అంశాలుగా పోల్‌లో వెల్లడైంది. -
కాంగ్రెస్ తో పొత్తుకు రెడీ
రాష్ట్రంలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే, కాంగ్రెస్‌లో ఒకే వేదికగా పయనం సాగించడం దాదాపు ఖరారైనట్టే. ఇందుకు అద్దం పట్టే రీతిలో ఆ రెండు పార్టీల నాయకులు మనదంటే, మనది కూటమే అని వ్యాఖ్యానించడం విశేషం. ఇక, అన్నాడీఎంకే పతనం కోసం డబుల్ బ్యారెల్ గన్స్‌గా పనిచేయడానికి రెడీ అయ్యారు. సాక్షి, చెన్నై :2004 నుంచి యూపీఏ కూటమి వేదికగా డీఎంకే, కాంగ్రెస్ కలసి పనిచేసిన విషయం తెలిసిందే. తమ బంధం విడదీయరానిదంటూ ఏళ్ల తరబడి రెండు పక్షాల నాయకులు భుజం రాసుకుంటూ ముందుకు సాగారు. ఈ పరిస్థితుల్లో 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణం డీఎంకే మంత్రుల మెడకు చుట్టుకోవడం బంధం బెడిసి కొట్టేందుకు కారణం అయింది.యూపీఏకు టాటా చెప్పిన డీఎంకే ఇటీవలి లోక్ సభ ఎన్నికల్ని చిన్నా చితక పార్టీలతో కలసి ఎదుర్కొని డిపాజిట్లను గల్లంతు చేసుకుంది. ఇక ఒంటరిగా రాష్ట్రంలో బరిలోకి దిగిన కాంగ్రెస్‌కు అదే పరిస్థితి. తాజాగా, రానున్న అసెంబ్లీ ఎన్నికల్ని లక్ష్యంగా చేసుకుని కోల్పోయిన వైభవాన్ని మళ్లీ చేజిక్కించుకునేందుకు రెండు పార్టీలు కుస్తీలు పడుతున్నాయి.అదే సమయంలో మెగా కూటమి ఏర్పా టు ద్వారా అధికార పగ్గాలు చేజిక్కించుకోవాలన్న కాంక్షతో డీఎంకే అధినేత ఎం కరుణానిధి ముందుకు సాగుతున్నారు. పాత మిత్రుల్ని మళ్లీ ఏకం చేయడంతో పాటుగా కాంగ్రెస్‌తో మళ్లీ బంధానికి సిద్ధం అవుతూ వస్తున్నారు. ఈ పరిస్థితుల్లో డీఎంకే, కాం గ్రెస్ అధినాయకులు ఒకే వేదిక మీదకు రావడం పాత బంధాన్ని గుర్తు చేసుకుంటూ, మనదంటే, మనదీ కూటమి అంటూ, అన్నాడీఎంకే పాలనకు మంగళం పాడేందుకు డబుల్ బేరెల్ గన్‌గా మారతామని మన కూట్టమి : ఆది ద్రావిడ పేరవై నేతృత్వంలో సమాజ హితాన్ని కాంక్షించే మహానాడు కామరాజర్ అరంగం వేదికగా జరిగింది. ఇందులో డిఎంకే తరపున ఆ పార్టీ కోశాధికారి ఎంకేస్టాలిన్, టీఎన్‌సీసీ తరపున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఈవికేఎస్ ఇళంగోవన్ హాజరు అయ్యారు. డీఎంకేను గతంలో పదే పదే విమర్శిస్తూ, ఆరోపణలతో ఇరకాటంలో పెట్టిన ఈవీకేఎస్ ప్రస్తుతం తన ధోరణిని మార్చుకుని ఆ పార్టీకి దగ్గరయ్యేందుకురెడీ అయ్యారు. ఇందుకు అద్దంపట్టే రీతిలో స్టాలిన్‌తో కలసి ఆ మహానాడు వేదికగా ఈవీకేఎస్ చేతులు కలపడమే కాదా, స్నేహం అంటే మనదేరా ... అన్నట్టుగా వ్యవహరించి అందర్నీ విస్మయంలో పడేశారు. ముందుగా ప్రసంగాన్ని అందుకున్న ఈవీకేఎస్ కాంగ్రెస్, డీఎంకేలు కూట్టమిగానే పనిచేస్తూ వస్తున్నాయని వ్యాఖ్యానించారు. ఎన్నికల కూటమి అన్నది ఆ సమయానికి తగ్గట్టుగా ఉంటుందని, ప్రజా సమస్యలపై ఒకే బాటలో కూటమిగానే పయనిస్తున్నామని వివరించారు. అన్నాడీఎంకే సర్కారును ఇంటికి సాగనంపడం లక్ష్యంగా డబుల్ బ్యారెల్ గన్స్‌గా తామిద్దరం పనిచేయడానికి సిద్ధం అని వ్యాఖ్యానించడం,ఆ మహానాడు వేదికలో కరతాళ ధ్వనుల్ని మర్మోగించింది. ఇక, స్టాలిన్ తన ప్రసంగంలో ఈవీకేఎస్ కొంతే చెప్పారంటూ, మిగిలింది తాను చెబుతానని గతాన్ని అందుకున్నారు. తాను, ఇళంగోవన్ ఒకే కూటమి అని, తామిద్దరూ ఒకే బాణిలో స్పందిస్తామని, ప్రజా సమస్యలపై తమ గళం ఒక్కటేనని స్పష్టం చేశారు. ప్రజల కోసం , అవినీతి ప్రభుత్వాన్ని తరిమి కొట్టడం కోసం తామిద్దరం బలమైన కూటమిగా ఎదగడానికి వెనుకాడబోమని వ్యాఖ్యానించడం బట్టి చూస్తే, ఇక కాంగ్రెస్, డీఎంకేల బంధం మళ్లీ చిగురించినట్టేనని, త్వరలో అధికార పూర్వకంగా వీరి బంధం కలవబోవడం ఖాయం అంటూ రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. -
టార్గెట్ ‘అల్లుడు’
వాద్రాపై కాషాయ అతిరథుల గురి... 2జీ నుంచి ‘జీజాజీ’ వరకు కాంగ్రెస్ అవినీతిని ఎండగడుతున్న బీజేపీ నేతలు ఎలక్షన్ సెల్: యూపీఏ కూటమికి సారథ్యం వహిస్తున్న కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాపై ‘కాషాయ’ అతిరథులు కొద్దిరోజులుగా విమర్శల జోరు పెంచారు. ఎన్డీఏ అధికారంలోకి వస్తే ఆయనను జైలుకు పంపుతామని సైతం వారు హెచ్చరిస్తున్నారు. యూపీఏ అధికారంలో ఉన్న తొలి ఐదేళ్లలో వాద్రా పేరు పెద్దగా వినిపించేది కాదు. రెండోసారి తిరిగి అధికారంలోకి వచ్చాక వరుస కుంభకోణాలు యూపీఏ సర్కారును కుదిపేస్తున్న తరుణంలోనే వాద్రాపైనా ఆరోపణలు వెల్లువెత్తాయి. రియల్ ఎస్టేట్ దిగ్గజం డీఎల్ఎఫ్ కంపెనీతో ఆయన జరిపిన లావాదేవీల్లో భారీ అవకతవకలు జరిగాయని, హర్యానా సర్కారు ఆయనకు కారుచౌకగా విలువైన భూములను కట్టబెట్టిందని కథనాలు వెలువడ్డాయి. హర్యానా సర్కారు డీఎల్ఎఫ్ కంపెనీకి ఏజెంటుగా పనిచేస్తోందంటూ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) వ్యవస్థాపకుడు అరవింద్ కేజ్రీవాల్ దుయ్యబట్టారు. డీఎల్ఎఫ్-వాద్రా అవకతవకల చిట్టాను రెండేళ్ల కిందటే ఆయన మీడియా ముందు పెట్టా రు. వాద్రాకు చెందిన అక్రమ భూ లావాదేవీలను రద్దుచేసిన ఐఏఎస్ అధికారి అశోక్ ఖేమ్కాను హర్యానాలోని కాంగ్రెస్ సర్కా రు బలిపశువును చేసింది. భూసేకరణ విభాగం స్పెషల్ కలెక్టర్‌గా ఉన్న ఆయనను ప్రాధాన్యం లేని పురాతత్వ విభాగం కార్యదర్శిగా బదిలీ చేసింది. అంతటితో ఆగకుండా, గతంలో ఆయన హర్యానా విత్తనాభివృద్ధి సంస్థ మేనేజింగ్ డెరైక్టర్‌గా ఉండ గా, విధి నిర్వహణలో నిర్లక్ష్యానికి పాల్పడ్డారంటూ రెండు చార్జిషీట్లు దాఖలు చేసిం ది. కొద్దికాలానికి మీడియాలో వాద్రా గొడవ సద్దుమణిగినా, ప్రస్తుతం ఎన్నికల వాతావరణం వేడెక్కడంతో ‘కాషాయ’ పార్టీ అతిరథులందరూ ఆయనపైనే ప్రధానంగా గురి పెడుతున్నారు. ఎన్డీఏ కూటమి కేంద్రంలో అధికారంలోకి వస్తే, వాద్రాను జైలుకు పంపుతామని తాజాగా బీజేపీ నేత ఉమాభారతి హెచ్చరించారు. బీజేపీ నేతలు ఇటీవల కొద్ది రోజులుగా వాద్రాపై చేసిన వ్యాఖ్యలు... ‘దేశ ప్రజలకు 2జీ కుంభకోణం గురించి ఇప్పటికే తెలుసు. కానీ కొత్తగా జీజాజీ (బావ) కుంభకోణాల గురించి వింటున్నారు’ అంటూ బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ పరోక్షంగా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ బావ అయిన వాద్రాపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తల్లీ కొడుకుల (సోనియా, రాహుల్) ప్రభుత్వంలో యువతకు రావలసిన ఉద్యోగాలు వాద్రాకు వచ్చినట్లున్నాయని, అందుకే ఆయన ఆస్తులు భారీగా పెరిగాయని ఎద్దేవా చేశారు. ఒక అమెరికన్ పత్రిక ప్రచురించిన కథనం ద్వారానే తనకు వాద్రా ఆస్తుల పెరుగుదల గురించి తెలిసిందని, పదో తరగతి పాసైన యువకుడు, చేతిలో ఉన్న లక్ష రూపాయల పెట్టుబడితో నాలుగేళ్లలోనే రూ.300 కోట్లకు అధిపతి అయ్యాడని ఆ పత్రిక రాసిందని అన్నారు. - కాంగ్రెస్ హయాంలో 2జీ కుంభకోణమే కాదు, ‘జీజాజీ’ కుంభకోణమూ జరిగిందని బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ దుయ్యబట్టారు. ఉత్తరప్రదేశ్‌లోని సిధ్‌పురాలో నిర్వహించిన ప్రచార సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. - వాద్రాపై అవినీతి ఆరోపణలు రుజువైతే ఆయనను ఉపేక్షించేది లేదని బీజేపీ నేత అరుణ్ జైట్లీ ఇటీవల ఎన్డీటీవీ ఇంటర్వ్యూలో చెప్పారు. - తమ పార్టీ అధికారంలోకి వస్తే, వాద్రా అవినీతిపై దర్యాప్తు జరిపిస్తామని బీజేపీ ఉపాధ్యక్షుడు ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ అన్నారు. - వాద్రా-డీఎల్ఎఫ్ అవినీతిపై సీబీఐ, సీవీసీల చేత దర్యాప్తు జరిపించాలంటూ బీజేపీ నేత సుబ్రమణ్యం స్వామి కొద్దిరోజుల కిందట ఏకంగా రాష్ట్రపతికి లేఖ రాశారు. బీజేపీ దూకుడు వెనుక... బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సహా ఆ పార్టీ నేతలు వ్యక్తిగత విమర్శలకు దిగుతున్న సంగతి తెలిసిందే. మోడీపై కాంగ్రెస్ దాడిని తిప్పికొట్టేందుకే బీజేపీ నేతలు సోనియా అల్లుడు రాబర్ట్ వాద్రాను లక్ష్యంగా ఎంచుకున్నారు. ఈ విషయాన్ని బీజేపీ ఉపాధ్యక్షుడు ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ మాటలే స్పష్టం చేస్తున్నాయి. ‘మా పార్టీ ప్రధాని అభ్యర్థిపై కొద్దిరోజులుగా వ్యక్తిగత విమర్శల దాడి సాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో వెనక్కు తగ్గకూడదని మేమూ నిర్ణయించుకున్నాం’ అని నఖ్వీ అన్నారు. వాద్రా-డీఎల్ఎఫ్ కుంభకోణంపై కథనాలు పత్రికల పతాక శీర్షికలకెక్కిన సమయంలో బీజేపీ సంయమనంతోనే వ్యవహరించింది. ఈ విషయాన్ని పార్లమెంటులో లేవనెత్తాలంటూ కార్యకర్తల నుంచి ఒత్తిళ్లు వచ్చినా పార్టీ నాయకత్వం అనవసర రాద్ధాంతానికి దిగకుండా హుందాగానే ఉంది. మోడీ తన నామినేషన్ పత్రాల్లో తొలిసారిగా తన భార్య పేరును పేర్కొనడంతో కాంగ్రెస్ నేతలు ఆయనపై వ్యక్తిగత విమర్శలు సంధిస్తూ రావడంతో బీజేపీ సైతం తన పంథాను మార్చుకుంది. వాద్రాపై బీజేపీ నేతలు విమర్శల జోరు పెంచడంతో స్టాక్మార్కెట్లో డీఎల్ఎఫ్ షేర్ల ధర మూడు రోజుల్లోనే 12 శాతం మేరకు పతనమైంది.