న్యూఢిల్లీ: ఇప్పటికిప్పుడు దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరిగితే 40 శాతం ఓట్లతో ఎన్డీఏ కూటమి 258 సీట్లు గెలుచుకుంటుందని ఇండియా టుడే– కార్వీ ఒపీనియన్ పోల్‌లో వెల్లడైంది. మొత్తం 543 సీట్లకు గాను కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కూటమి 38 శాతం ఓట్లతో 202 స్థానాల్లో విజయం సాధిస్తుందని తేలింది. ఇతర పార్టీలు 22 శాతం ఓట్లతో 83 సీట్లు సొంతం చేసుకుంటాయి.
ఇండియా టుడే పోల్ ప్రకారం.. తదుపరి ప్రధానిగా 53 శాతం ఓట్లతో మోదీ అగ్రస్థానంలో ఉన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి 22 శాతం ఓట్లు మాత్రమే దక్కాయి. స్వాతంత్య్రం అనంతరం దేశంలో అత్యుత్తమ ప్రధానిగా మోదీకి 28 శాతం, ఇందిరా గాంధీకి 10 శాతం, అటల్ బిహారి వాజ్‌పేయికి 10 శాతం, నెహ్రూకు 8 శాతం మద్దతు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో నిరుద్యోగం(29 శాతం), ధరల పెరుగుదల(23 శాతం) ఎక్కువ ప్రభావితం చేసే అంశాలుగా పోల్‌లో వెల్లడైంది.
Comments
Please login to add a commentAdd a comment