india today survey
-
పరిస్థితి అంతంత మాత్రమేనట!
పరిస్థితి అంతంత మాత్రమేనట! మళ్లీ కశ్మీర్ టూ కన్యా కుమారికి ప్లాన్ చేస్తే ఎలా ఉంటుంది సార్! -
జయహో జగన్.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైఎస్సార్సీపీదే అధికారం..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైఎస్సార్సీపీ మళ్లీ ఘన విజయం సాధిస్తుందని ఇండియా టుడే – సీ ఓటర్ సర్వే తేల్చి చెప్పింది. సార్వత్రిక ఎన్నికలు జరిగి 40 నెలలు పూర్తవుతున్నప్పటికీ, వైఎస్సార్సీపీ హవా ఏమాత్రం తగ్గలేదని స్పష్టం చేసింది. ఆ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ప్రజాదరణ రోజురోజుకూ పెరుగుతోందని వెల్లడించింది. ఏకంగా 57 శాతం మంది ప్రజలు ముఖ్యమంత్రిగా వైఎస్ జగనే కావాలని బలంగా కోరుకుంటున్నట్లుగా తేల్చింది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాదరణలో సీఎం వైఎస్ జగన్‌కు దరిదాపుల్లో మరో నేత లేరని తెగేసి చెప్పింది. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌లు రాష్ట్రంలో ఏమాత్రం ప్రభావం చూపబోవని ఈ సర్వేలో వెల్లడైంది. ఆంధ్రప్రదేశ్‌లో సీఎం వైఎస్ జగన్‌కు, వైఎస్సార్సీపీకి తిరుగులేదన్నది దీన్ని బట్టి తెలుస్తోందంటూ ఇండియా టుడే కన్సల్టింగ్ ఎడిటర్ రాజ్‌దీప్ సర్దేశాయ్, ఇండియా టుడే గ్రూప్ న్యూస్ ఎడిటర్ రాహుల్ కన్వల్‌లు విశ్లేషించారు. సీ ఓటర్–ఇండియా టుడేలు సంయుక్తంగా ఈ నెల 11న దేశ వ్యాప్తంగా ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ పేరుతో సర్వే నిర్వహించాయి. 2,41,553 మంది అభిప్రాయాలను తీసుకుని.. 96,676 మందితో ముఖాముఖి (ఇంటర్వ్యూ) చర్చించారు. ప్రజాభిప్రాయం, ముఖాముఖి చర్చల్లో వెల్లడైన అంశాల ఆధారంగా శుక్రవారం ఇండియా టుడే చానల్లో ఆ సర్వే ఫలితాలను విశ్లేషించారు. ఈ చర్చలో దేశంలో ప్రసిద్ధికెక్కిన పలువురు రాజకీయ నేతలు, విశ్లేషకులు పాలుపంచుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్సీపీకి, సీఎం వైఎస్ జగన్‌కు ఎదురేలేదని రాజ్‌దీప్ సర్దేశాయ్ విశ్లేషిస్తే.. ప్రజాదరణలో వైఎస్ జగన్‌కు మరేవరూ సాటి లేరని రాహుల్ కన్వల్తోపాటు పలువురు విశ్లేషకులు స్పష్టం చేశారు. సంక్షేమాభివృద్ధి.. సుపరిపాలన వైఎస్సార్సీపీ ఆఖండ విజయంతో 2019 మే 30న సీఎంగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేశారు. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే 95 శాతం హామీలు అమలు చేసి.. ఎన్నికల మేనిఫెస్టోకు సరికొత్త నిర్వచనం చెప్పారు. అర్హతే ప్రామాణికంగా.. కులం, మతం, వర్గం, పార్టీలకు అతీతంగా లబ్ధిదారులకు సంక్షేమ పథకాల ద్వారా ప్రయోజనం చేకూర్చారు. కేవలం డీబీటీ ద్వారానే ఇప్పటిదాకా రూ.1.65 లక్షల కోట్లను లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా జమ చేశారు. కరోనా మహమ్మారిని సమర్థవంతంగా కట్టడి చేసి.. ప్రజల ఆరోగ్యానికి భరోసా ఇచ్చారు. మంత్రివర్గం నుంచి నామినేటెడ్ పదవుల వరకూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు సింహభాగం పదవులు ఇచ్చి సామాజిక న్యాయ సాధనలో దేశానికే రోల్ మోడల్‌గా నిలిచారని సామాజిక వేత్తలు ప్రశంసిస్తున్నారు. వలంటీర్లు, గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ప్రజల గుమ్మం వద్దకే ప్రభుత్వ సేవలను అందిస్తున్నారు. ప్రజల సౌకర్యం, పరిపాలన సౌలభ్యం కోసం 26 జిల్లాలను ఏర్పాటు చేశారు. నాడు–నేడులో భాగంగా ప్రభుత్వ పాఠశాలలు, ఆస్పత్రులను కార్పొరేట్ స్థాయికి తీర్చిదిద్ది.. విద్యా, వైద్య రంగాల్లో విప్లవాత్మక సంస్కరణలను తీసుకొచ్చారు. విత్తనం నుంచి విక్రయం వరకు రైతులకు తోడు, నీడగా ప్రభుత్వం ఉండేలా వ్యవసాయ రంగంలో విప్లవాత్మక సంస్కరణలను ప్రవేశపెట్టారు. రైతులకు చేదోడుగా నిలవడం కోసం గ్రామ సచివాలయాలకు అనుంబంధంగా ఏర్పాటు చేసిన ఆర్బీకేల (రైతు భరోసా కేంద్రాలు) పనితీరును నీతి ఆయోగ్‌తో పాటు పలు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రశంసిస్తున్నాయి. ప్రజాభిప్రాయానికి అద్దం పట్టిన సర్వే సీఎం వైఎస్ జగన్ సంక్షేమాభివృద్ధి పథకాలు, సామాజిక న్యాయం, సుపరిపాలనకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్, కార్పొరేషన్.. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక.. బద్వేలు, ఆత్మకూరు శాసనసభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి తిరుగులేని విజయాన్ని ప్రజలు అందించారు. గత ఎన్నికల్లో 50 శాతం ఓట్లతో వైఎస్సార్సీపీకి ప్రజలు ఘన విజయాన్ని అందిస్తే.. అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం వైఎస్ జగన్‌కు, ఆ పార్టీకి ప్రతి ఎన్నికలోనూ ఓట్ల శాతం పెరుగుతూనే వస్తోంది. సీఓటర్–ఇండియా టుడే సర్వే.. ఏకంగా 57 శాతం మంది సీఎంగా వైఎస్ జగనే కావాలంటూ బలంగా కోరుకున్నట్లు తేల్చింది. ఈ సర్వే ప్రజాభిప్రాయాన్ని మరోసారి ప్రతిబింబించిందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. దేశ వ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన ముఖ్యమంత్రుల్లో వరుసగా యోగి ఆదిత్యనాథ్ (ఉత్తరప్రదేశ్), అరవింద్ కేజ్రీవాల్ (ఢిల్లీ), మమతా బెనర్జీ (పశ్చిమ బెంగాల్), ఎంకే స్టాలిన్(తమిళనాడు), వైఎస్ జగన్ (ఆంధ్రప్రదేశ్)లు అగ్రభాగాన నిలిచారు. స్వరాష్ట్రంలో అత్యధిక ప్రజాదరణ కలిగిన సీఎంలలో కూడా వైఎస్ జగన్ అదే స్థానంలో ఉండటం విశేషం. -
ఇప్పటికిప్పుడు ఎన్నికలొస్తే కేంద్రంలో బీజేపీ.. ఏపీలో వైఎస్సార్సీపీ..
న్యూఢిల్లీ: దేశంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కేంద్రంలో మరోసారి బీజేపీయే అధికారంలోకి వస్తుందని, ప్రధానిగా వరుసగా మూడోసారి కూడా ప్రజలు నరేంద్ర మోదీనే కోరుకుంటున్నారని సీ ఓటర్– ఇండియా టుడే సంయుక్త సర్వే తేల్చింది. నేషనల్ డెమొక్రాటిక్ అలయన్స్ (ఎన్డీయే) సీట్ల సంఖ్య 350 నుంచి 296కు పడిపోతుందని చెప్పింది. ఎంపీల సంఖ్య 303 నుంచి 271 సీట్లతో సొంతంగా అధికారంలోకి వచ్చే స్థితిలోనే ఉందని తేల్చింది. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికిప్పుడు ఎన్నికలొస్తే మళ్లీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని సీ ఓటర్– ఇండియా టుడే సర్వే తేల్చిచెప్పింది. పార్టీ అధినేత వైఎస్ జగన్‌కు ప్రజాదరణ అణుమాత్రం తగ్గలేదని స్పష్టం చేసింది. ఏపీలోని 25 లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్, బీజేపీలకు ఒక్క సీటు కూడా రాదని కుండబద్దలు కొట్టింది. సర్వే విశ్లేషణలో నిపుణులుగా పరిగణించే సీనియర్ జర్నలిస్టులు రాహుల్ కన్వల్ (ఇండియా టుడే గ్రూపు న్యూస్ డైరెక్టర్), రాజ్ చెంగప్ప (ఇండియా టుడే గ్రూపు ఎడిటోరియల్ డైరెక్టర్)లు ప్రజాదరణ విషయంలో జగన్‌కు తిరుగులేదని దీన్ని బట్టి తెలుస్తోందని విశ్లేషించారు. చదవండి: (ఎన్నికలొస్తే... కేంద్రంలో మళ్లీ బీజేపీయే) -
ఇదిగో అభివృద్ధి చిరునామా!
ఇండియన్ యూనియన్‌లోని అన్ని రాష్ట్రాల సామాజిక – ఆర్థిక స్థితిగతులపై ‘ఇండియా టుడే’ మీడియా సంస్థ గత పద్దెనిమిదేళ్లుగా సర్వే చేస్తున్నది. ఏడెనిమిది అంశాలపై ఈ సర్వే ఉంటుంది. వివిధ రంగాల నిష్ణాతులతో కూడిన బృందం తుది ఫలితాలను నిర్ధారిస్తుంది. ఈ సంవత్సరానికి గాను తాజాగా వెలువరించిన ఫలితాల్లో ‘సమ్మిళిత అభివృద్ధి’ అనే విభాగంలో ఆంధ్రప్రదేశ్‌కు తొలిస్థానం లభించింది. సమ్మిళిత అభివృద్ధి అంటే ఏమిటి?... సమాజంలోని అన్ని వర్గాలు, సమూహాలకు ఆర్థికాభివృద్ధి ఫలితాలు అందడం. పేదలకు కూడా విద్య, వైద్యం వంటి అత్యవసర సేవలు అందుబాటులో ఉండటం. అవకాశాల్లో సమానత్వం. వెనుకబాటు తనానికి గురైన వారిని గుర్తించి వారిని సాధికార శక్తులుగా తీర్చిదిద్దడానికి వారి విద్య, నైపుణ్యాభివృద్ధిపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టడం. పర్యావరణ హితమైన అభివృద్ధి మార్గాన్ని ఎంచుకోవడం. అవకాశాల్లో, అధికారాల్లో స్త్రీ పురుష సమానత్వం. ప్రజలకు చేరువగా ఉండే సుపరిపాలన. సమ్మిళిత అభివృద్ధిలో ఇవన్నీ కీలకాంశాలు. వరల్డ్ సోషల్ ఫోరం, ఓఈసీడీ వంటి అంతర్జాతీయ వేదికలు నిజమైన అభివృద్ధిని ఈ కోణం నుంచే చూస్తున్నాయి. ఐక్యరాజ్యసమితి ప్రబోధిస్తున్న ‘సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు’ కూడా సమ్మిళిత అభివృద్ధిని అందుకోవడానికి ఉద్దేశించినవే. సమ్మిళిత అభివృద్ధిలో ఆర్థికాభివృద్ధి ఒక భాగం మాత్రమే! ఏడంతస్తుల మేడలు ఒకవైపూ, పెరుగుతున్న మురికివాడలు ఒకవైపా? ఇదేమి న్యాయమని తరతరాల నుంచి తాత్వికులు, రచయితలు, సామ్యవాదులు ప్రశ్నిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ ప్రశ్నలకు పెట్టుబడిదారీ వ్యవస్థ పరిధిలోనే లభించిన ఒక సమాధానం సమ్మిళిత అభివృద్ధి. ఇది ఆర్థికాభివృద్ధి కంటే బహుముఖీనమైనది. విశాలమైనది. మానవీయమైనది. సంపద సృష్టి ఆర్థికాభివృద్ధికి తార్కాణం. సంపదను సృష్టించడంతోపాటు దాని పంపిణీ, ఫలితంగా ఏర్పడే సర్వతోముఖ సమాజ వికాసాన్ని ‘సమ్మిళిత అభివృద్ధి’ (Inclusive development) అంటాము. ఇటువంటి ఆదర్శప్రాయమైన అభివృద్ధి పథంలో దేశంలోని మిగిలిన రాష్ట్రాలకంటే ఆంధ్రప్రదేశ్ ఓ నాలుగడుగులు ముందుకు వేసిందని ‘ఇండియా టుడే’ సర్వే ధ్రువీకరించింది. ఈ ధ్రువీకరణకోసం పరిశీలించిన అంశాలను కూడా ఆ మీడియా సంస్థ ప్రకటించింది. పేదరిక నిర్మూలన కార్యక్రమాలు, బ్యాంకు ఖాతాలున్న పేద కుటుంబాలు, వంటగ్యాస్ కనెక్షన్ ఉన్న కుటుంబాలు, ఉపాధి హామీ విస్తృతి, సార్వత్రిక ఆరోగ్య ధీమా, ప్రజా పంపిణీతో లబ్ధి పొందుతున్న కుటుంబాలు, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, బడికి వెళ్తున్న పిల్లల శాతం, శాచ్యురేషన్ పద్ధతిలో అమలు జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాల వంటి అంశాల ఆధారంగా సమ్మిళిత అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానాన్ని దక్కించుకున్నది. నిజానికి ‘ఇండియా టుడే’ ఎంచుకున్న పరిశీలనాంశాల పరిధిని దాటి మరిన్ని విప్లవాత్మక కార్యక్రమాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టింది. గ్రామ సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ, ఆర్బీకే సెంటర్ల ఏర్పాటు ద్వారా పాలనా వికేంద్రీకరణలో చిట్టచివరి దశకు చేరుకున్నట్టయింది. కడగొట్టున నిలబడిన పౌరునితో సర్కార్ కరచాలనం చేసినట్టయింది. వికేంద్రీకరణతోపాటు ప్రవేశపెట్టిన పారదర్శకత కూడా ముఖ్యమైన అంశం. ఏ రాజకీయ నాయకుని తోడు లేకుండా, ఏ పైరవీ లేకుండా, పైసా ఖర్చు కాకుండా గ్రామ సచివాలయానికి వెళ్లి తన అర్హతలకు తగిన పథకంలో లబ్ధి కోసం పౌరుడు దరఖాస్తు చేసుకోవచ్చు. నిర్ణీత కాలపరిమితిలోగా ఆ దరఖాస్తు పరిష్కారం కావాలి. ఈ రకమైన పారదర్శకత, వికేంద్రీకరణలే సుపరిపాలనకు (good governance) కొండగుర్తులు. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది మూడో ఆర్థిక సంవత్సరం. ఈ మూడేళ్ల బడ్జెట్లలో సామాజిక వ్యయంతోపాటు అభివృద్ధి వ్యయం కూడా గణనీయంగా పెరిగిందని సాక్షాత్తూ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా తన నివేదికలో ఘంటాపథంగా వెల్లడించింది. మొదటి బడ్జెట్లో ఒకలక్షా ఆరువేల కోట్లున్న అభివృద్ధి వ్యయం రెండేళ్లు తిరిగేసరికి 1 లక్షా 58 వేల కోట్లకు పెరిగిందని రిజర్వు బ్యాంకు విశ్లేషించింది. సోషల్ సెక్టార్‌పై చేసిన వ్యయం 78 వేల కోట్ల నుండి 1 లక్షా 13 వేల కోట్లకు పెరిగింది. గత మూడేళ్లుగా ప్రజారోగ్యం, కుటుంబ సంక్షేమ పద్దులు పెరిగాయి. ఉద్యోగుల జీతభత్యాల ఖర్చు భారీగా పెరిగింది. చంద్రబాబు పాలన చివరి సంవత్సరంలో (2018–19) ఉద్యోగుల జీతభత్యాల ఖర్చు రూ. 32,743 కోట్లు. వర్తమాన సంవత్సరం (2021–22)లో ఆ పద్దు రూ. 50,662 కోట్లకు చేరింది. మూడేళ్లలో 55 శాతం పెరుగుదల. ఈ మూడేళ్ల బడ్జెట్ పద్దుల్ని పరిశీలిస్తే మిగతా వ్యయాల కంటే అభివృద్ధి వ్యయమే ఎక్కువగా పెరిగింది. ఇవన్నీ రిజర్వు బ్యాంకు విశ్లేషణలో తేలిన లెక్కలు. నిపుణులు నిగ్గుతేల్చిన వాస్తవాలు ఇట్లా వుంటే – ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష కూటమి (టీడీపీ, మీడియా, ఇతర పార్టీల్లోని కోవర్టులు, స్లీపర్ సెల్స్ కలిపి) ప్రచారం ఇందుకు పూర్తి భిన్నంగా నడుస్తున్నది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దివాళా తీసిందని, అభివృద్ధి జాడే లేదని, వచ్చిన ఆదాయాన్ని పప్పు బెల్లాలకు ఖర్చు చేస్తున్నారనీ, పరిపాలన స్తంభించిపోయిందనీ, ఈ కూటమి యుద్ధప్రాతిపదికపై ప్రచారాన్ని చేపట్టింది. ఈ ప్రచారోధృతి ఏ స్థాయిలో వుందంటే, కొందరు తటస్థులుగా చెప్పుకునే వాళ్లు, మేధావులమనుకునేవాళ్లు, కూడా ఏమో నిజమే కామోసు అనుకునేంతగా! సుపరిపాలన దిశగా, సమ్మిళిత అభివృద్ధి పథంలో ఆంధ్రప్రదేశ్ అడుగులు పడుతున్నాయన్న ‘ఇండియా టుడే’ సర్వేకూ, రాష్ట్రంలో అభివృద్ధి వ్యయమే ఎక్కువుందనీ–ఉద్యోగుల జీతభత్యాల వ్యయం కూడా మూడేళ్లలో 55 శాతం పెరిగిందనీ రిజర్వు బ్యాంకు చేసిన విశ్లేషణకూ ఈ ప్రచారం పూర్తి విరుద్ధం. నిపుణుల అంచనాలకు భిన్నమైన గణాంకాలు ఎక్కడి నుంచి తెచ్చారని తటస్థులనుకునేవాళ్లు ప్రతిపక్ష కూటమిని ప్రశ్నించాలి. అలా కాకుండా వారి తప్పుడు ప్రచారంలో కొట్టుకొనిపోవడం బాధాకరం. అప్పులు వాస్తవం. ఆర్థిక ఇబ్బందులు వాస్తవం. అవి వారసత్వ సంపదగా ఈ ప్రభుత్వానికి సంక్రమించాయన్నది కూడా నిఖార్సయిన నిజం. రాష్ట్ర విభజనకు ముందు ఉమ్మడి రాష్ట్ర ఆదాయంలో హైదరాబాద్ వాటా 55 శాతం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ఆదాయంలో ఆ ఒక్క నగరం వాటా 75 శాతం. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు ఈ ఆదాయ గండి పడింది. ఈ గండికి పరిహారాన్ని సమకూర్చడంలో నాటి అధికార ప్రతిపక్షాలు విఫలమయ్యాయి. అప్పటి ప్రతిపక్ష నేత స్వయంగా చంద్రబాబే. తిలాపాపంలో తలా పిడికెడు పాత్ర ఉన్నది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామన్న యూపీఏ హామీని ఎన్డీఏ సర్కార్‌కు అమ్మేసుకుని ఆంధ్రప్రదేశ్‌కు మరో భారీ గండిని తవ్వింది మళ్లీ స్వయంగా చంద్రబాబే! ప్రత్యేక హోదా సంజీవని ఏమీ కాదనీ, ప్రత్యేక ప్యాకేజీ వల్ల ఎక్కువ ప్రయోజనం కలుగుతుందనీ ఆనాడు ఆయన సుభాషితాలు కూడా చెప్పారు. ప్రత్యేక హోదాకు ముఖ్యమంత్రే నీళ్లొదులుకోవడంతో అది ‘గతం గతః’ పద్దులో పడిపోయింది. పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ను ఉపయోగించుకునే వెసులుబాటును కూడా చేజేతులా చంద్రబాబే వదిలేసుకున్నారు. తెలంగాణ రాజకీయాల్లో దొంగవేలు దూర్చి అడ్డంగా దొరికిపోయి, కేసుల భయంతో రాత్రికి రాత్రే బిస్తరు సర్దేశారు. ఐదేళ్ల పదవీకాలంలో ఉమ్మడి రాష్ట్రం చేసిన అప్పులను మించి చేశారు. అయినా బడ్జెట్ పద్దుల్లో అభివృద్ధి వ్యయానికి అగ్రాసనం దక్కలేదు. అప్పు చేసిన డబ్బులతో అధికారికంగా ఓట్ల కొనుగోలుకు కూడా ప్రయత్నించారు. అప్పుడు చేసిన అప్పులకు ఏటా రూ. 20 వేల కోట్ల వడ్డీలు కట్టాల్సిన వారసత్వ బాధ్యత ఈ ప్రభుత్వం మీద పడింది. ఈ అప్పుల భారం మళ్లీ అప్పులకు దారి తీసింది. రాజధాని పేరుతో ఐదేళ్ల పుణ్యకాలాన్ని పూర్తిగా వ్యాపార లావాదేవీల కోసం హారతి కర్పూరం చేశారు. ఒక్క శాతం పనిని కూడా పూర్తి చేయలేదు. అసలు అమరావతి రాజధాని ప్రకటనే ఏకపక్షం. వ్యాపార ప్రేరేపితం. నిపుణుల అభిప్రాయాలకు విరుద్ధం. ప్రాంతీయ అసమానతలను తొలగించడం, ప్రాంతీయ ఆకాంక్షలను గుర్తించి నెరవేర్చడం కూడా సమ్మిళిత అభివృద్ధిలో ముఖ్యమైన అంశాలే. రాయలసీమ వెనకబాటుతనానికి నెట్టబడిన ప్రాంతం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కోసం రాజధాని హోదాను త్యాగం చేసిన ప్రాంతం. ఉత్తరాంధ్ర అలక్ష్యానికి గురైన ప్రాంతం. ఆధునిక తెలుగు సంగీత సాహిత్య సంస్కృతులకు తొలి భిక్ష వేసిన ప్రాంతం. ఈ ప్రాంతాల గుండె చప్పుళ్లను చంద్రబాబు ప్రభుత్వం వినిపించుకోలేదు. రాజధాని విషయంలో చంద్రబాబు చేసిన చారిత్రక తప్పిదాన్ని వైఎస్ జగన్ ప్రభుత్వం సరిదిద్దే ప్రయత్నం చేసింది. అమరావతిని శాసన రాజధానిగా కొనసాగిస్తూనే... న్యాయ రాజధానిగా కర్నూలును, కార్యనిర్వాహక రాజధానిగా విశాఖను ప్రకటించింది. ఈ పని 2014లోనే చేసి ఉన్నట్లయితే ఆంధ్రప్రదేశ్‌కు అన్నివిధాలా కలిసి వచ్చేది. సమయం, డబ్బు వృథా కాకుండా వుండేవి. ఇప్పటికే విశాఖ అభివృద్ధి చెందిన కాస్మొపాలిటన్ నగరం. సహజసిద్ధ రేవు పట్టణం. కలకత్తా, చెన్నైలను మించి అంతర్జాతీయ సముద్ర వర్తకాన్ని శాసించగల సత్తా వున్న నగరం. దేశంలోని సహజ సంపదలో సగానికి పైగా నిక్షిప్తమై ఉన్న ఒడిషా, ఛత్తీస్గడ్, జార్ఖండ్‌లకు అందుబాటులో ఉన్న నగరం. రాజధాని హోదాను సమకూర్చి మౌలిక వసతులను జోడించినట్లయితే ఈ ఏడేళ్లలో ఇబ్బడిముబ్బడిగా రాష్ట్రానికి ఆదాయాన్ని సమకూర్చి ఉండేది. ఇప్పుడు కూడా మూడు రాజధానులను అడ్డుకుంటూ చంద్రబాబు తన చారిత్రక తప్పిదాన్ని కొనసాగిస్తున్నారు. రాష్ట్ర ఆదాయం పెరగకుండా అడ్డుపడుతున్నారు. రావణాసురుడు జటాయువు రెక్కల్ని తెగనరికినట్టు చంద్రబాబు రాష్ట్ర ఆదాయ వనరుల్ని ఖండిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌కే పరిమితమైన ఈ శాపాలతోపాటు ప్రపంచాన్నే శాపగ్రస్థం చేసిన కోవిడ్ మహమ్మారి వేటును కూడా కాచుకోవలసి వచ్చింది. రెండున్నరేళ్ల పాలనాకాలంలో రమారమి రెండేళ్లుగా కోవిడ్ ముప్పు తరుముతూనే వస్తున్నది. అన్ని రాష్ట్రాలు దేశాల ఆదాయాలు గణనీయంగా పడిపోయాయి. అప్పోసప్పో చేసి ఈ రెండేళ్లలో లక్షా పదహారువేల కోట్ల రూపాయలను పేద వర్గాలకు నగదు బదిలీ చేయకపోయి ఉన్నట్లయితే ఏమి జరిగేది? పేద వర్గాలు అనాధలయ్యేవారు. కొనుగోలు శక్తి నశించి ఉండేది. వ్యాపారాలు దివాళా తీసేవి. ఫలితంగా మధ్యతరగతి ప్రజలు, ఉద్యోగస్థులు కూడా ఉపాధి కోల్పోయేవారు. ఆర్థిక చక్రం విరిగిపోయి ఉండేది. ఈ ప్రభుత్వం అప్పుచేసి రాష్ట్రాన్ని పెను సంక్షోభం నుంచి కాపాడింది. ఫలితంగా ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు పూర్తిస్థాయి జవసత్వాలను కూడదీసుకుంటున్నది. ఇదీ జరిగింది. జరుగుతున్న ప్రచారం మాత్రం రాష్ట్రం దివాళా తీసిందని! ఈ దివాళాకోరు ప్రచారానికి చెంపపెట్టు ‘ఇండియా టుడే’ సర్వే. సమ్మిళిత అభివృద్ధి దిశగా ఆంధ్రప్రదేశ్ వేస్తున్న అడుగులను ఈ సర్వే శాటిలైట్ కెమెరాలు గుర్తించాయి. అవును... చుట్టూ చీకటి ఆవరించి ఉన్నది. భయం లేదు. చేతిలో అభివృద్ధి దీపం ఉన్నది. ఎగుడు దిగుడు దారి ముందున్నది. పరవాలేదు. దీపకాంతిలో గమ్యం కనిపిస్తున్నది. జాగ్రత్తగా అడుగులు వేస్తే చాలు! వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
AP: బతుకులు బాగుపడుతున్నాయ్..‘ఇండియా టుడే’ సర్వే
సాక్షి, అమరావతి: గ్రామాల్లోనే పారదర్శకంగా పౌర సేవలన్నీ అందుబాటులోకి తేవడం.. వ్యవసాయానికి వెన్నుదన్నుగా నిలవడం.. విద్య, వైద్య రంగాలను సంస్కరించి నాడు – నేడు ద్వారా పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలు కల్పించడం.. అభివృద్ధి పథంలో ప్రజలందరినీ భాగస్వాములుగా చేయడం.. వివక్ష లేకుండా అర్హులందరికీ సంతృప్త స్థాయిలో ప్రయోజనం చేకూర్చడం ద్వారా రాష్ట్రంలో అన్ని వర్గాల స్థితిగతుల్లో గణనీయమైన మార్పు కనిపిస్తోంది. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం ద్వారా సమగ్రాభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ అగ్రపథంలో నిలిచింది. దేశవ్యాప్తంగా ఈ ఏడాది సమ్మిళిత అభివృద్ధి (ఇన్‌క్లూజివ్ గ్రోత్) సాధించిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానం సాధించిందని జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మక ‘ఇండియా టుడే’ సంస్థ నిర్వహించిన సర్వే వెల్లడించింది. అంతేకాకుండా ఉత్తమ పనితీరు కనబరుస్తున్న రాష్ట్రాల్లో ఏపీ తన స్థానాన్ని మరింత మెరుగుపరచుకుంది. గతేడాది ఏడో స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఈ ఏడాది ఒక స్థానం ఎగబాకి ఆరో స్థానానికి చేరడం గమనార్హం. 2021 ఏడాదికిగానూ ‘స్టేట్ ఆఫ్ స్టేట్స్’ పేరిట నిర్వహించిన సర్వే ఫలితాలను ‘ఇండియా టుడే’ సంస్థ తాజాగా ప్రకటించింది. 2018లో పదో స్థానం నుంచి.. టీడీపీ హయాంతో పోలిస్తే రాష్ట్రం అన్ని రంగాల్లో అత్యుత్తమ పనితీరు ప్రదర్శిస్తోందని ఈ సర్వే ఫలితాలు తేటతెల్లం చేస్తున్నాయి. చంద్రబాబు అధికారంలో ఉండగా 2018లో ఇండియా టుడే నిర్వహించిన సర్వేలో అత్యుత్తమ పనితీరు కనబర్చిన రాష్ట్రాల జాబితాలో ఏపీ పదో స్థానంలో ఉంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 2019లో రెండు స్థానాలు మెరుగుపరచుకుని ఎనిమిదో స్థానానికి ఎగబాకింది. ఇక 2020లో ఏడో స్థానానికి చేరుకున్న మన రాష్ట్రం తాజాగా ఆరో స్థానం సాధించడం విశేషం. 2019 నుంచి రాష్ట్రం అన్ని రంగాల్లోనూ అత్యుత్తమ పనితీరు కనబరుస్తోందన్నది ‘ఇండియా టుడే’ సర్వే స్పష్టం చేసింది. ఈ సర్వేలో తమిళనాడు మొదటిస్థానంలో నిలిచింది. జీవన ప్రమాణాలకు కొలమానం ప్రజల మెరుగైన జీవన ప్రమాణాలకు కొలబద్ధ లాంటి సమ్మిళత అభివృద్ధి సూచీలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానాన్ని సాధించింది. ఏ రాష్ట్ర అభివృద్ధికైనా సమ్మిళిత అభివృద్ధి ప్రధాన సూచిక అని ఇండియా టుడే సర్వే పేర్కొంది. పేద, మధ్య తరగతి కుటుంబాల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం ద్వారానే సర్వతోముఖాభివృద్ధికి బాటలు వేయగలమన్న నిపుణుల అభిప్రాయాలను ఉదహరించింది. ఎలా సాధ్యమైందంటే... రాష్ట్రంలో అర్హులందరికీ సంక్షేమ పథకాలను వర్తింపజేయడం, ఇంటింటికి రేషన్ బియ్యం పంపిణీ, రికార్డు స్థాయిలో ఉపాధి హామీ పనుల కల్పన, పలు పథకాల ద్వారా చిరు వ్యాపారులు, వివిధ వృత్తుల వారికి ప్రభుత్వం అండగా నిలవడం ద్వారా ప్రజలు మెరుగైన ఆదాయాన్ని పొందుతున్నారు. జగనన్న అమ్మ ఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, విద్యా కానుక లాంటి పథకాలతో రాష్ట్రంలో పాఠశాలల్లో విద్యార్థుల నమోదు శాతం పెద్ద ఎత్తున పెరిగింది. రూ.వెయ్యికు మించిన వైద్య చికిత్సలు అన్నింటినీ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం పరిధిలోకి తీసుకురావడం, పథకం వర్తించేందుకు వార్షిక ఆదాయ పరిమితి రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచడం ద్వారా రాష్ట్రంలో దాదాపు 95 శాతం కుటుంబాలకు ఆరోగ్యశ్రీ ద్వారా బీమా రక్షణ కల్పించారు. పేదరిక నిర్మూలన, ఉపాధి కల్పన, ఆరోగ్య రక్షణ, విద్యాభివృద్ధి చర్యలతో ప్రజల జీవన ప్రమాణాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గణనీయంగా మెరుగుపరిచింది. నిపుణులతో సమగ్ర సర్వే రాష్ట్రాల పనితీరును నిగ్గు తేల్చేందుకు ఇండియా టుడే సంస్థ నిర్వహిస్తున్న ఈ సర్వేకు దేశవ్యాప్తంగా విశేష గుర్తింపు ఉంది. ఇండియా టుడే సంస్థకు చెందిన ‘మార్కెటింగ్– డెవలప్మెంట్ రీసెర్చ్ అసోసియేట్స్ (ఎండీఆర్ఏ)’ ద్వారా 2003 నుంచి ఏటా ఈ సర్వేను నిర్వహిస్తోంది. 2021కుగాను ఈ ఏడాది జూలై నుంచి నవంబర్ వరకు దేశవ్యాప్తంగా సర్వే చేపట్టారు. సర్వే బృందంలో ప్రముఖ విధాన నిర్ణేతలు, నీతి ఆయోగ్ ప్రతినిధులు, సామాజికవేత్తలు, ఆర్థికవేత్తలు, వివిధ పరిశోధన సంస్థల ప్రతినిధులు సభ్యులుగా ఉన్నట్లు ఇండియా టుడే సంస్థ వెల్లడించింది. రాష్ట్రాల పనితీరును మదింపు చేసేందుకు మొత్తం 123 ప్రామాణిక అంశాలను పరిగణనలోకి తీసుకుని సర్వే చేపట్టినట్లు వెల్లడించింది. కీలక అంశాలే ప్రామాణికం.. సమ్మిళిత అభివృద్ధిని నిర్ధారించేందుకు పలు కీలక అంశాలను ప్రామాణికంగా తీసుకుని ఇండియా టుడే ఈ సర్వే నిర్వహించింది. పేదరిక నిర్మూలన కార్యక్రమాల అమలు తీరు, బ్యాంకు ఖాతాలున్న పేద కుటుంబాలు, వంట గ్యాస్ కనెక్షన్లు ఉన్న కుటుంబాలు, ఉపాధి హామీ ద్వారా ప్రయోజనం పొందుతున్న కుటుంబాలు, ఆరోగ్య బీమా పథకాల పరిధిలోకి వచ్చిన కుటుంబాలు, రేషన్ పంపిణీతో లబ్ధి పొందుతున్న కుటుంబాలు, కుటుంబ సగటు వేతన ఆదాయం, బాల కార్మిక నిర్మూలన వ్యవస్థ పనితీరు, 6 నుంచి 14 ఏళ్ల లోపు పిల్లల్లో పాఠశాలలకు వెళ్తున్న వారి శాతం.. ఇలా పలు అంశాలను పరిగణనలోకి తీసుకుని సర్వే నిర్వహించింది. సంక్షేమ కార్యక్రమాల ద్వారా పేదరిక నిర్మూలన, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడంతో ఏపీ అగ్రస్థానంలో నిలిచిందంది. రాష్ట్ర ప్రభుత్వం నిబద్ధతతో ‘శాచ్యురేషన్ విధానం’లో సంక్షేమ పథకాలను అమలు చేస్తుండటంతోనే ఇది సాధ్యమైందని సర్వే నివేదిక విశ్లేషించింది. -
ఎన్నెన్నో కష్టాలు.. డ్యూటీ ఎలా చేసేది
ఆగ్రా: దేశంలో మహిళా పోలీసుల బలవన్మరణాల సంఖ్య పెరుగుతోంది. ఇటీవల ఉత్తరప్రదేశ్‌లో ఇద్దరు మహిళా పోలీసులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీంతో పోలీసు శాఖలో మహిళా ఉద్యోగుల స్థితిగతులపై చర్చ మొదలయ్యింది. ఇందులో భాగంగానే మహిళా పోలీసు అధికారులపై ఇండియాటుడే.కామ్ ఓ అధ్యయనం నిర్వహించింది. మహిళా పోలీసులు తమని తాము రక్షించుకునేందుకు పురుషాధిపత్యంతో ఉన్న మగ పోలీసుల నుంచి ఎన్నెన్నో కష్టాలను ఎదుర్కొంటున్నట్టు తేటతెల్లమయ్యింది. పోలీసు దుస్తుల్లో ఉన్నా, స్త్రీలమని గుర్తుచేస్తారు ఆగ్రాలోని స్థానిక పోలీస్ స్టేషన్లో పనిచేసే ఓ మహిళా కానిస్టేబుల్ ఇండియాటుడేతో మాట్లాడుతూ ‘‘తాను పోలీసు యూనిఫాం ధరించి ఉండవచ్చు, అయినప్పటికీ అడుగడుగునా తాను మహిళననే విషయం గుర్తుచేస్తూనే ఉంటారు’’ అని వ్యాఖ్యానించారు. సాధారణ మహిళలకూ తమకీ ఎటువంటి తేడా ఉండదని, సాధారణ మహిళలు ఎదుర్కొంటున్నట్టే విధినిర్వహణ విషయంలో తాము కూడా అనేక ఇబ్బందులను పంటి బిగువున అదిమిపట్టాల్సి వస్తుందన్నారు. సాధారణ మహిళ లు అడుగు బయటపెట్టినప్పుడు ఎలాంటి వివక్షనీ, ఇబ్బందులనూ ఎదుర్కొంటారో అవన్నీ తమకు కూడా సహజమేనని ఆమె వ్యాఖ్యానించారు. మహిళా పోలీసులకే అసౌకర్యం ఉన్నచోట ఇతర మహిళలకు దిక్కేదీ? పోలీస్ స్టేషన్లలో మహిళా పోలీసులకు ఉద్యోగాల్లో ఉంచడం వల్ల, మహిళలంతా పోలీస్ స్టేషన్లలో ఇబ్బందిపడకుండా ఉండగలుగుతారని భావిస్తారని, అయితే ‘‘మహిళా పోలీసులే పోలీస్ స్టేషన్లలో అసౌకర్యంగా , ఇబ్బందికరంగా ఫీల్ అవుతుంటే, మిగిలిన మహిళలను వాళ్ళెలా సౌకర్యవంతంగా ఉంచగలుగుతారు’’అని ఆమె ప్రశ్నించారు. పని విషయంలో సమానత్వమే సమాన గౌరవం దక్కదు పురుష ఉద్యోగులతో సమానంగా మహిళా పోలీసులు పనిచేయాలని అధికారులు కోరుకుంటారు. అలాగూ పురుష పోలీసులతో సమానంగా పనిచేయించుకుంటారు. కానీ పురుష పోలీసులతో సమానంగా మాత్రం చూడరని, వివక్ష తమని వెన్నాడుతూనే ఉంటుందని మరో పోలీస్ కానిస్టేబుల్ వ్యాఖ్యానించారు. వెకిలి జోకులు.. తప్పుడు కామెంట్లు పోలీసు అధికారులు, కానిస్టేబుళ్ళు అన్న తేడా లేకుండా, మహిళా పోలీసుపై వెకిలి జోకులూ, తప్పుడు కామెంట్లతో వేధిస్తుంటారు. ఆ మాటలు వినలేక అక్కడి నుంచి వెళ్ళిపోవడం తప్ప చేసేదేం ఉండదు. అంటారు మరో మహిళ పోలీసు. కొత్తగా రిక్రూట్ అయిన మహిళా పోలీసులు, అధికారుల చేతిలో మరింతగా ఇలాంటి వివక్షకూ, ఇబ్బందులకూ గురవుతారని మహిళా కానిస్టేబుల్ చెప్పారు. ఇన్‌చార్జ్‌ల వేధింపులు రాకబ్ గంజ్ వుమెన్ పోలీస్ స్టేషన్ కి రావడానికి ముందు మరో పోలీస్ స్టేషన్ పనిచేశానని, అక్కడి ఇన్‌చార్జ్‌తో వేధింపులు తాళలేకపోయానని అంటారు మరో మహిళా పోలీసుల. స్నేహంగా ఉందామని చెప్పి నా బతుకు నరకంగా మార్చేశాడంటారు ఆమె. తాను రాజీనామా చేసి వెళ్ళిపోవాలనుకున్నానని, ప్రభుత్వ ఉద్యోగం దొరకడం ఎంత కష్టమో తెలుసు కనుక తన కుటుంబ సభ్యులు వారించారనీ అంటారామె. పోలీసు ఉద్యోగంలో చేరి తప్పు చేశాను తాను పోలీసు ఉద్యోగంలో చేరినప్పుడు తన మిత్రులు కొంత మంది తాను, ఈ ఉద్యోగంలో కన్నా టీచర్ ఉద్యోగంలో చేరి వుంటే బాగుండేదని కామెంట్ చేశారు. అయినా బలవంతంగా ఇందులో చేరాను. అప్పుడు వారికేం సమాధానం చెప్పలేకపోయినా, యిప్పుడు మాత్రం తాను పోలీసు ఉద్యోగంలో చేరాలన్న నిర్ణయం అంత మంచి విషయమేం కాదని భావిస్తున్నట్టు మరో మహిళా హెడ్ కానిస్టేబుల్ వ్యాఖ్యానించారు. పోలీసు సిబ్బందిలో మహిళలకు సరైన వాతావరణం లేదు పోలీసు సిబ్బందిలో మహిళా పోలీసులు పనిచేసేందుకు సరైన వాతావరణం లేదని మహిళా సబ్ ఇన్స్పెక్టర్ అన్నారు. కొత్తగా రిక్రూట అయినవారికి మరిని మరింత ఇబ్బంది పెడతారు. పురుష పోలీసులు వారికి పదే పదే ఫోన్లు చేయడం, ఫోన్లలో అశ్లీల ఫొటోలు పంపుతూ వేధింపులకు గురిచేస్తారని ఆమె చెప్పారు. ఆగ్రా ఎస్ఎస్పి బబ్లు కుమార్ పురుష పోలీసులపై చేసిన ఆరోపణలన్నింటినీ కొట్టిపారేశారు. పోలీసు డిపార్టుమెంట్ మహిళలకు సురక్షితమైన పరిస్థితులను కల్పిస్తున్నారని, ఎవరికైనా ఇబ్బందులు వస్తే, తనని నేరుగా కలవొచ్చునని వ్యాఖ్యినంచారు. -
ఇలాగే ఉంటే మూడోసారి ప్రధానిగా మోదీ
సాక్షి, హైదరాబాద్: రెండోసారి కష్టమే.. అత్తెసరు సీట్లతో అధికారంలోకి వస్తారని అందరూ భావించగా ఊహించని రీతిలో అప్రతిహత విజయంతో నరేంద్ర మోదీ పాలన పగ్గాలు చేపట్టి దాదాపు 20 నెలలవుతోంది. ఈ సమయంలో దేశంలో అలజడులు, ఉద్యమాలు, ప్రతిపక్షాల పోరు, అకస్మాత్తుగా లాక్డౌన్ ప్రకటన, కరోనా కేసుల్లో ప్రపంచంలో రెండోస్థానంలో నిలవడం, వలస కూలీల సంక్షోభం, కనిష్ట స్థాయికి జీడీపీ, ప్రబలిన నిరుద్యోగం, చైనా దూకుడు.. తదితర అంశాలపై దేశవ్యాప్తంగావిమర్శలు వస్తున్నాయి. ఇవన్నీ మాత్రం ఎన్నికలపై ప్రభావం చూపవని తేలింది. ప్రధాని మోదీపై ప్రజల విశ్వాసం సడలలేదని సర్వేలో తేలింది. (ఇది చదవండి: ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా ఎన్డీఏకు 321 సీట్లు!) ‘ఇండియా టుడే –కార్వీ’ జరిపిన ‘మూడ్ ఆఫ్ ది నేషన్(ఎంఓటీఎన్)’ చేసిన సర్వే ప్రకారం బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ (నేషనల్ డెమోక్రటిక్ అలయెన్స్)కు ప్రజల ఆదరణ ఉందని తెలిపింది. 43% ఓట్లతో 321 స్థానాలను ఎన్డీఏ గెలుచుకుంటుందని తేల్చింది. అయితే ఇదే సర్వే గతేడాది ఆగస్ట్‌లో చేయగా ఎన్డీఏ 316 సీట్లు గెలుచుకుంటుందని తేలింది. ఈ విధంగా రోజురోజుకు మోదీ చరిష్మా పెరుగుతూనే ఉంది. ప్రత్యామ్నాయం లేక బలమైన ప్రతిపక్షాలు.. నాయకుడు లేకపోవడం మోదీకి ప్లస్ పాయింట్‌గా చెప్పవచ్చు. కాంగ్రెస్ ఎప్పుడో ప్రధాన ప్రతిపక్ష హోదా కోల్పోయింది. ఇక ఆ పార్టీ నేత రాహూల్ గాంధీ అపరిపక్వత నాయకుడిగా మిగిలిపోయాడు. మోదీని ఢీకొనేంత శక్తి రాహూల్‌కు లేదని అందరికీ తెలిసినా విషయమే. ఇక మోదీకి ప్రత్యామ్నాయం.. అతడిని ఢీ కొడతామంటూ మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, అఖిలేశ్ యాదవ్, మాయావతి, స్టాలిన్, కేసీఆర్‌లు ఆర్బాటపు ప్రకటనలు చేస్తారు. వారికి సొంత రాష్ట్రంలోనే పరిస్థితులు సక్రమంగా లేకపోవడంతో ఢిల్లీ రాజకీయాలపై దృష్టి సారించే అవకాశం లేదు. ఢిల్లీలో పోరాటం చేయడానికి ముందుకు రాగా ఐక్యతా రాగం లేదు. కార్యాచరణ ఏమున్నా కానీ ముందే తాము ప్రధానమంత్రి అభ్యర్థి అంటూ హడావుడి చేయడంతో అభాసుపాలవుతున్నారు. మోదీకి వ్యతిరేకంగా ఒక ఉమ్మడి ప్రణాళికతో వెళ్లే ప్రయత్నం చేయడం లేదు. ఇలాగే ఉంటే మూడోసారి కూడా బలమైన ప్రతిపక్షం లేకపోవడంతో పాటు దేశంలో మోదీ అంత చరిష్మా ఉన్న నాయకుడు ఎవరూ లేరు. ఇక పాలనపరమైన విషయంలో కొంత ప్రతికూలత ఉంది. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో అమలు చేస్తున్నారు. పేదలతో పాటు సంపన్నులకు కూడా పథకాలు, కార్యక్రమాలు చేపట్టడంతో అన్ని వర్గాల నుంచి మోదీకి మద్దతు ఉంది. ప్రపంచంలోనే అత్యంత ప్రభావశీలురైన వ్యక్తుల్లో మోదీ ముందంజలో ఉన్నారు. అయితే సార్వత్రిక ఎన్నికల వరకు ఇదే హవా కొనసాగితే ముచ్చటగా మూడోసారి కూడా ప్రధాని పదవిలో నరేంద్ర మోదీ కూర్చోనున్నారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సాగుతున్న రైతుల ఉద్యమం కాస్త ప్రభావం చూపే అవకాశం ఉంది. ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే. -
అభివృద్ధిలో పైపైకి
సాక్షి, అమరావతి: కరోనా మహమ్మారి ప్రజల ప్రాణాలను హరించడమే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక రంగాన్ని అతలాకుతలం చేసింది. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ ఆర్థికాభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ దూసుకెళ్తోంది. ఈ విషయం ఇండియా టుడే స్టేట్ ఆఫ్ స్టేట్స్–2020 అధ్యయనంలో వెల్లడైంది. ఒక్క ఆర్థిక రంగంలోనే కాదు. పర్యాటక రంగంలోనూ ఏపీ మెరుగైన ప్రదర్శన కనబరుస్తోందని ఆ అధ్యయనం పేర్కొంది. వివిధ రంగాల్లో దేశం, రాష్ట్రాలు జూన్ నుంచి అక్టోబర్ వరకూ సాధించిన ప్రగతిపై మార్కెటింగ్ అండ్ డెవలప్మెంట్ రీసెర్చ్ అసోసియేట్స్ (ఎండీఆర్ఏ)తో కలిసి ఇండియా టుడే సంస్థ అధ్యయనం చేసింది. కరోనా ప్రతికూల పరిస్థితులను అధిగమించి 12 రంగాల్లో (ఆర్థిక, పర్యాటకం, మౌలిక సదుపాయాలు, సమ్మిళిత అభివృద్ధి, పరిపాలన, శాంతిభద్రతలు.. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, పరిశుభ్రత, పర్యావరణం, విద్య, ఆరోగ్యం, వ్యవసాయం) రాష్ట్రాలు సాధిస్తున్న ప్రగతిని.. వివిధ మార్గాల్లో సేకరించిన డేటాతో పరిశీలించింది. ఆ విభాగాల్లో రాష్ట్రాలను ఉత్తమ ప్రదర్శన (బెస్ట్ పెర్ఫార్మింగ్), అత్యుత్తమ మెరుగైన (మోస్ట్ ఇంప్రూవ్డ్), ఓవరాల్ కేటగిరీలుగా విభజించింది. వాటికి అనుగుణంగా స్కోర్ ఇచ్చింది. ఆయా విభాగాల్లో ఉత్తమ రాష్ట్రాలను విజేతలుగా పేర్కొంది. ఈ అధ్యయనంలో భాగంగా 35 వేల చదరపు కి.మీ.ల భౌగోళిక విస్తీర్ణం లేదా 5 మిలియన్ల కంటే ఎక్కువ జనాభా కలిగిన 20 రాష్ట్రాలను పెద్ద రాష్ట్రాలుగానూ, అంతకంటే తక్కువ విస్తీర్ణం, జనాభా కలిగిన రాష్ట్రాలను చిన్న రాష్ట్రాలుగానూ వర్గీకరించింది. వీటికి అనుగుణంగా ర్యాంకులు ఇచ్చింది. రెండేళ్ల క్రితం పది.. ఇపుడు ఏడో స్థానం ఓవరాల్ బెస్ట్ పెర్ఫార్మింగ్ పెద్ద రాష్ట్రాల విభాగంలో 2018లో పదో స్థానంలో ఉంటే.. గతేడాది ఎనిమిదో స్థానానికి చేరింది. ఇప్పుడు ఏడో స్థానంలోకి దూసుకొచ్చింది. మోస్ట్ ఇంప్రూవ్డ్ పెద్ద రాష్ట్రాల విభాగంలో 2018లో మన రాష్ట్రం ఎనిమిదో ర్యాంకులో నిలిస్తే.. గతేడాది రెండో ర్యాంకును సాధించింది. ఈ ఏడాది అదే ర్యాంకును నిలబెట్టుకుంటూ స్థిరమైన అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోందని ఇండియా టుడే అధ్యయనం వెల్లడించింది. ఈ అధ్యయనంలో వెల్లడైన ముఖ్యాంశాలు ఇవీ.. ► మోస్ట్ ఇంప్రూవ్డ్ పెద్ద రాష్ట్రాల విభాగంలో ఆర్థిక రంగం, పర్యాటక రంగంలో ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో నిలిచింది. ► ఓవరాల్ మోస్ట్ ఇంప్రూవ్డ్ పెద్ద రాష్ట్రాల విభాగంలో 2,000 మార్కులకుగానూ 1,194.8 మార్కులను సాధించిన ఏపీ రెండో స్థానంలో నిలిచింది. ► ఓవరాల్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ పెద్ద రాష్ట్రాల విభాగంలో 2,000 మార్కులకుగానూ 1,147.7 మార్కులను సాధించిన ఏపీ ఏడో స్థానానికి చేరుకుంది. ► కరోనా కట్టడిలో వందకు 65.8 మార్కులను సాధించిన రాష్ట్రం మూడో స్థానంలో నిలిచింది. -
చంద్రబాబూ.. ఇప్పుడేమంటారు?
సాక్షి, అనంతపురం: ఇండియా టుడే సర్వే ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడికి కనువిప్పు కావాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ ఇక్భాల్ అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అత్యంత ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రుల్లో వైఎస్ జగన్ 3వ స్థానంలో నిలిచారని, ఆయన పనితీరు కు ఈ సర్వే కొలమానం అని పేర్కొన్నారు. రాజీనామాలు చేయాలని కోరిన చంద్రబాబు ఇప్పుడేమంటారని ఆయన ప్రశ్నించారు. సంక్షేమం-అభివృద్ధి తో సీఎం జగన్ దూసుకెళ్తున్నారన్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే చంద్రబాబు కూడా ఓడిపోతారని, టీడీపీ ఎమ్మెల్యేలకు దమ్ము, ధైర్యం ఉంటే అమరావతి కోసం రాజీనామాలు చేసి ఎన్నికల కు వెళ్లాలని ఆయన సవాల్ విసిరారు. చంద్రబాబు విధ్వంసాన్ని ప్రేరేపించేలా మాట్లాడుతున్నారని ఎమ్మెల్సీ ఇక్బాల్ దుయ్యబట్టారు. (‘జగన్ భవిష్యత్తులో మీరు ఫస్ట్ ర్యాంక్ సాధిస్తారు’) -
ఆ పదవికి రాహులైతేనే బెస్ట్
న్యూఢిల్లీ: దాదాపు 135 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఏళ్ల తరబడి దేశం అంతటిని పాలించిన పార్టీ నేడు కేవలం కొన్ని రాష్ట్రాలకే పరిమితమయ్యింది. కొన్ని చోట్ల అసలుకే గల్లంతయ్యింది. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో పార్టీ పగ్గాలను వదిలేసారు రాహుల్ గాంధీ. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఎందరు ఎన్ని రకాలుగా నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఆయన మాత్రం తన నిర్ణయం మార్చుకోలేదు. ప్రస్తుతం సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇండియాటుడే నిర్వహించిన మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే ఆసక్తికర విషయాలను వెల్లడించింది. కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు చేపట్టడానికి రాహుల్ గాంధీనే సరైన వ్యక్తిగా ప్రజలు విశ్వసిస్తున్నారని ఈ నివేదిక తెలిపింది. సర్వేలో పాల్గొన్న వారిలో 23 శాతం మంది కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ అయితేనే బెస్ట్ అని అభిప్రాయపడ్డారని వెల్లడించింది. (అత్యుత్తమ సీఎంలలో వైఎస్ జగన్‌కు మూడో స్థానం) పార్టీని పునరుద్ధరించడానికి ఏ నాయకుడు బాగా సరిపోతారని మీరు అనుకుంటున్నారని ప్రశ్నించగా.. 23 శాతం మంది రాహుల్ గాంధీకి ఓటు వేశారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ 18 శాతం ఓట్లతో రెండో స్థానంలో ఉన్నారు. ఇక ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ 14 శాతం ఓట్లతో నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచారు. ఇక రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ 2 శాతం ఓట్లతో ఆఖరి స్థానంలో ఉండగా.. తిరుగుబాటు నేత సచిన్ పైలట్ 3 శాతం ఓట్లతో చివరి నుంచి రెండో స్థానంలో ఉన్నారు. పార్టీని నూతన పునరుజ్జీవనం వైపు నడిపించడానికి రాహుల్ అయితేనే బెస్ట్ అని ఎక్కువ మంది ప్రజలు ఓటు వేశారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయాన్ని చవి చూడటంతో 2019 ఆగస్టులో రాహుల్ గాంధీ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అధ్యక్ష పదవి నుంచి వైదొలగిన సంగతి తెలిసిందే. -
మోదీ కేబినెట్లో అత్యుత్తమ మంత్రి ఎవరు?
న్యూఢిల్లీ: మహమ్మారి కరోనా కట్టడిలో మోదీ సర్కారు విజయవంతమైందా? వాస్తవాధీన రేఖ వెంబడి ఉద్రిక్తతలు సృష్టిస్తున్న చైనాకు దీటుగా జవాబు ఇచ్చిందా? ఆర్థిక వ్యవస్థ పట్ల ప్రజలు సంతోషంగానే ఉన్నారా? ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యలు ఏమిటి? ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే ప్రజలు ఎవరికి ఓటేస్తారు? మోదీ కేబినెట్లో అత్యుత్తమ మంత్రి ఎవరు? తదితర అంశాల్లో ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ పేరిట ఇండియా టుడే- కార్వీ ఇన్సైట్స్ నిర్వహించిన సర్వేలో వెల్లడైన ఫలితాలు, ప్రజాభిప్రాయానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.(మరోసారి ప్రధాని మోదీకి పట్టంకట్టిన ప్రజలు!) ప్రధానిగా నరేంద్ర మోదీ పనితీరు ఎలా ఉంది? బాగుంది- 48 శాతం అత్యద్భుతం- 30 శాతం పర్లేదు- 17 శాతం బాగోలేదు- 5 శాతం ఎన్డీయే ప్రభుత్వం పనితీరుపై మీ అభిప్రాయం? సంతృప్తికరం- 48శాతం చాలా సంతృప్తిగా ఉన్నాం- 24 శాతం బాగుందని లేదా బాలేదని చెప్పలేం- 19 శాతం సంతృప్తికరంగా లేదు- 8 శాతం అసలేమీ చెప్పలేం- 1 శాతం మోదీ సర్కారు సాధించిన అతిపెద్ద విజయం ఏమిటని భావిస్తున్నారు? 1. ఆర్టికల్ 370 రద్దు- 16 శాతం మంది 2. రామ మందిర నిర్మాణంపై సుప్రీంకోర్టు తీర్పు-13 శాతం 3. మౌలిక సదుపాయాల కల్పనలో అభివృద్ధి- 11 శాతం 4. అవినీతి రహిత పాలన- 9 శాతం 5. నల్లధన నిర్మూలన- 9 శాతం 6. కోవిడ్-19 వ్యాప్తిని కట్టడి చేస్తున్న తీరు-7 శాతం 7. పేద, బలహీన వర్గాల, రైతు సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలు- 6 శాతం 8. నోట్ల రద్దు- 6 శాతం 9. జీఎస్టీ విధానం- 5 శాతం వీటితో పాటు స్వచ్చ భారత్(3 శాతం), మహిళా సాధికారికత(2 శాతం), మేకిన్ ఇండియా(2 శాతం) తదితర అంశాలను కూడా కొంత మంది మోదీ ప్రభుత్వ విజయంగా పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వం అతిపెద్ద వైఫల్యం ఏమిటి? 1. మహమ్మారి కరోనాను కట్టడి చేయలేకపోవడం- 25 శాతం 2. నిరుద్యోగం- 23 శాతం 3. లాక్డౌన్ కాలంలో వలస జీవులను ఆదుకోలేకపోవడం- 14 శాతం 4. ధరల పెరుగుదల- 11 శాతం 5. ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయలేకపోవడం- 7 శాతం 6. ఆరోగ్య రంగాన్ని నీరుగార్చడం- 6 శాతం 7. రైతులను పట్టించుకోకపోవడం- 6 శాతం 8. తెలియదు, చెప్పలేం- 4 శాతం 9. చైనా, పాక్, నేపాల్‌లతో సత్సంబంధాల విషయంలో- 1 శాతం వీటితో పాటు జమ్మూ కశ్మీర్లో అశాంతి(1 శాతం), పౌరసత్వ సవరణ చట్టం నిరనసలు(1 శాతం) తదితర అంశాలను మోదీ సర్కారు వైఫల్యాలుగా పేర్కొన్నారు. మోదీ కేబినెట్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తున్న మంత్రి ఎవరు? 1. అమిత్ షా- 39 శాతం 2. రాజ్‌నాథ్ సింగ్- 17 3. ఇతరులు- 14 4. నితిన్ గడ్కరీ- 10 5. నిర్మలా సీతారామన్- 9 6. రవిశంకర్ ప్రసాద్-3 7. ధర్మేంద్ర ప్రధాన్- 2 8. స్మృతి ఇరానీ- 2 శాతం 9. ఎస్. జైశంకర్- 1 శాతం అయితే జనవరి 2020తో పోలిస్తే ఈ విషయంలో అమిత్ షాకు 4 శాతం మేర తక్కువ ఓట్లు పడటం గమనార్హం. అదే విధంగా రాజ్‌నాథ్ సింగ్(39- 17), నితిన్ గడ్కరీ (34-10), నిర్మలా సీతారామన్(26-9) పనితీరుపై ప్రజలు భారీ స్థాయిలో విశ్వాసం కోల్పోయినట్లు సర్వే ద్వారా వెల్లడైంది. భారత్ ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య? 1. కోవిడ్-19 మహమ్మారి- 70 శాతం 2. నిరుద్యోగం- 12 శాతం 3. చైనాతో విభేదాలు, ఆర్థికాభివృద్ధి నెమ్మదించడం- 4 శాతం వీటితో పాటు ద్రవ్యోల్బణం(3 శాతం), అవినీతి, దేశంలో పెరుగుతున్న అసహనం(1 శాతం) తదితర అంశాలను కూడా అతిపెద్ద సమస్యలుగా పేర్కొన్నారు. ఈరోజే లోక్‌సభ ఎన్నికలు నిర్వహిస్తే మీరు ఏ పార్టీకి ఓటేస్తారు? 1. బీజేపీ- 283(సీట్లు) 2.కాంగ్రెస్- 49 3. ఇతరులు- 211 -
తదుపరి ప్రధానిగా కూడా మోదీనే!
న్యూఢిల్లీ: దేశ ప్రధానిగా నరేంద్ర మోదీకి తిరుగులేదని, ప్రజల్లో ఆయనకున్న విశ్వాసం ఏమాత్రం తగ్గలేదని తాజా సర్వే వెల్లడించింది. అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడిగా గుర్తింపు పొందిన ఆయనే తదుపరి ప్రధాన మంత్రిగా ఉండాలని 66 శాతం ప్రజలు కోరుకుంటున్నట్లు తెలిపింది. ఇక ఈ విషయంలో కేవలం 8 శాతం మంది మాత్రమే కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ వైపు మొగ్గు చూపినట్లు పేర్కొంది. అదే విధంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి 5 శాతం ఓట్లు పడినట్లు తెలిపింది. (అత్యుత్తమ సీఎంలలో వైఎస్ జగన్‌కు మూడో స్థానం) ఇక కేంద్ర హోం మంత్రి అమిత్ షా(4%), యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్(3 శాతం), కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ(1 శాతం), పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(2 శాతం), కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ(2 శాతం), రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్(1 శాతం), మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే(1 శాతం), బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ తదితరులు కూడా ‘నెక్ట్స్ పీఎం’ ప్రాధాన్య జాబితాలో చోటు దక్కించుకున్నారు. ప్రముఖ మీడియా సంస్థ ఇండియా టుడే- కార్వీ ఇన్సైట్స్ ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ పేరిట చేపట్టిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. కాగా కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో జులై 15, 2020 నుంచి జూలై 27, 2020 మధ్య 12,021 మందితో టెలిఫోన్ ఇంటర్వ్యూ ద్వారా వివిధ అంశాల్లో అభిప్రాయాలు సేకరించారు. -
తదుపరి ప్రధానిగా మళ్లీ మోదీకే మొగ్గు..
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో పోలిస్తే తదుపరి ప్రధానిగానూ నరేంద్ర మోదీవైపే అత్యధికులు మొగ్గుచూపినట్టు ఇండియా టుడే గ్రూప్-కార్వీ ఇన్సైట్స్ మూడ్ ఆఫ్ ది నేషన్ (ఎంఓటీఎన్) సర్వేలో వెల్లడైంది. ప్రధాని నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీల్లో ప్రధానిగా ఎవరిని ఎంచుకుంటారనేదానిపై ప్రజామోదంలో ఇద్దరికి 40 శాతం వ్యత్యాసం ఉండటం గమనార్హం. తదుపరి ప్రధానిగా 53 శాతం మంది నరేంద్ర మోదీని సూచించగా దేశాన్ని ముందుకు నడపడంలో రాహుల్ గాంధీయే సరైన నాయకుడని కేవలం 13 శాతం మంది మాత్రమే వెల్లడించారు. ఇక కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తదుపరి ప్రధానిగా ఉండాలని 7 శాతం మంది అభిప్రాయపడ్డారు. హోంమంత్రి అమిత్ షా దేశ ప్రధానిగా పాలనాపగ్గాలు చేపట్టాలని కేవలం 4 శాతం మంది ఆకాంక్షించారు. నరేంద్ర మోదీకి అసలైన ప్రత్యామ్నాయం ప్రియాంక గాంధీయేనని 3 శాతం మంది ఆమె వైపు మొగ్గుచూపారు. మరోవైపు 60 శాతం మంది హిందువులు, 17 శాతం మంది ముస్లింలు నరేంద్ర మోదీ మూడోసారి దేశ ప్రధాని బాధ్యతలు చేపట్టాలని కోరగా, రాహుల్ గాంధీ నాయకత్వానికి 10 శాతం హిందువులు, 32 శాతం మంది ముస్లింలు జైకొట్టారు. ప్రధాని నరేంద్ర మోదీని పశ్చిమ భారతంలో 66 శాతం మంది అక్కున చేర్చుకోగా, రాహుల్ వైపు కేవలం ఆరు శాతం మందే మొగ్గుచూపారు. 19 రాష్ట్రాల్లోని 97 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని 194 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 12,141 మందిని ఇంటర్వ్యూ చేయడం ద్వారా మూడ్ ఆఫ్ ది నేషన్ పోల్‌ను ఇండియా టుడే గ్రూప్- కార్వీ ఇన్సైట్స్ నిర్వహించాయి. చదవండి : మోదీకి కుంబ్లే కృతజ్ఞతలు.. -
మోదీకి జైకొట్టిన భారత్
న్యూఢిల్లీ: ప్రధాని మోదీకి మరోసారి భారత్ జైకొట్టింది. మోదీ పాలన బాగుందని 71 శాతం మంది చెప్పినట్లు ఇండియాటుడే–కార్వీ సర్వే తెలిపింది. పాక్‌ను మోదీ ప్రభుత్వం దీటుగా ఎదుర్కొంటున్నట్లు 75 శాతం మంది ప్రజలు అంగీకరించారని వెల్లడించింది. ఇక మోదీ పనితీరుపై తాము సంతృప్తిగా ఉన్నామని 69 శాతం మంది చెప్పినట్లు పేర్కొంది. కశ్మీర్‌కు సంబంధించిన ఆర్టికల్ 370 రద్దుకు ముందు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక సహా 19 రాష్ట్రాల్లో ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ పేరుతో ఈ సర్వేను చేపట్టారు. జులై 22 నుంచి 30 వరకూ దేశవ్యాప్తంగా 12,126 మందిని ఇంటర్వ్యూ చేశారు. వీరిలో 67 శాతం మంది గ్రామీణులు కాగా, 33 మంది పట్టణ ప్రాంతావాసులు కావడం గమనార్హం. కులతత్వమే ప్రధాన ముప్పు.. భారత అంతర్గత భద్రతకు కుల హింస ప్రధాన ముప్పుగా మారిందని మెజారిటీ ప్రజలు అభిప్రాయపడ్డారు. కులహింస కారణంగా ముప్పుందని 25 శాతం మంది తెలపగా, సీమాంతర ఉగ్రవాదం ప్రమాదకరమని 25 శాతం మంది, మత హింసతో జాతిభద్రతకు ముప్పుందని 23 శాతం మంది తెలిపారు. కాగా, అసహనంతో జరిగే దాడులు అంతర్గత భద్రతకు ప్రమాదకరమని కేవలం 10 శాతం మంది మాత్రమే చెప్పారు. సర్వేలో ముఖ్యాంశాలు.. ► అయోధ్యలోని వివాదాస్పద స్థలంలో రామాలయం నిర్మించాలన్న డిమాండ్‌కు 61 శాతం మంది ఆమోదం తెలపగా, 32 శాతం మంది వ్యతిరేకించారు. ఈ సర్వేలో పాల్గొన్న ముస్లింల్లో 33 శాతం మంది రామమందిరం నిర్మించాలని కోరడం గమనార్హం. ► ట్రిపుల్ తలాక్ రద్దుతో ముస్లిం మహిళలకు సాధికారత చేకూరుతుందని 66 శాతం మంది చెప్పగా, సాధికారత చేకూరదని 24 మంది తెలిపారు. ఈ నిర్ణయాన్ని సర్వేలో పాల్గొన్న ముస్లింలలో 49 శాతం(పురుషులు 47 శాతం, మహిళలు 50 శాతం) మంది సమర్థించారు ► యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ దేశంలోనే అత్యుత్తమ ముఖ్యమంత్రి అని సర్వేలో పాల్గొన్న 20 శాతం మంది తెలపగా, బిహార్ సీఎం నితీశ్ కుమార్(10 శాతం మంది) రెండోస్థానంలో నిలిచారు. మహారాష్ట్ర, ఢిల్లీ, ఒడిశా ముఖ్యమంత్రులు ఫడ్నవీస్, కేజ్రీవాల్, నవీన్ పట్నాయక్(8 శాతం) సంయుక్తంగా మూడో స్థానంలో నిలిచారు. ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ జాబితాలో 7 శాతం మంది మద్దతుతో నాలుగో స్థానంలో నిలిచారు. అతి స్వల్ప కాలంలోనే వైఎస్ జగన్ ఈ ఘనత సాధించడం విశేషం. ఐదోస్థానంలో బెంగాల్ సీఎం మమతాబెనర్జీ ఉన్నారు. ► మోదీ ఇమేజ్ కారణంగానే 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిందని 35 శాతం మంది తెలిపారు. ఇక బాలాకోట్ దాడుల వల్ల గెలుపొందిందని 16 శాతం మంది, ప్రకటనలపై ఖర్చుతో విజయం సాధించారని 8 శాతం చెప్పారు. ► బీజేపీకి లోక్‌సభ ఎన్నికల్లో భారీ మెజారిటీ రావడం మంచిదేనని 64% మంది తెలపగా, దేశంలో నియంతృత్వం నెలకొనే ప్రమాదముందని 27% మంది అన్నారు. ► విపక్షాలకు ఓ ప్రధాని అభ్యర్థి అంటూ లేకపోవడం వల్లే యూపీఏ ఓడిపోయిందని 31 శాతం మంది చెప్పారు. విపక్షాల మధ్య అనైక్యత కారణమని 21 శాతం మంది చెప్పారు. ► ప్రస్తుతం ప్రతిపక్షాలకు నాయకత్వం వహించేందుకు టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీయే సరైన నేతని సర్వేలో తేలింది. ఈ సర్వేలో మమతకు 19 శాతం మంది ప్రజలు జైకొట్టగా, ఎస్పీ అధినేత అఖిలేశ్‌కు 12 శాతం, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు 12 శాతం మంది మద్దతు తెలిపారు. ► కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ భారత్‌ను 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారుస్తుందని 66 శాతం మంది చెప్పారు. అత్యుత్తమ ప్రధాని మోదీ ఇప్పటివరకూ భారత ప్రధానిగా పనిచేసినవారిలో మోదీనే అత్యుత్తమని తేలింది. ఈ సర్వేలో 37 శాతం మంది మోదీనే అత్యుత్తమం అని చెప్పగా, ఇందిర 14 శాతం, వాజ్‌పేయి 11 శాతం, నెహ్రూ 9 శాతం, మన్మోహన్ 5శాతంఓట్లతో తర్వాతి స్థానంలో నిలిచారు. రాబోయే ఐదేళ్లలో కశ్మీర్ సమస్యను మోదీ పరిష్కరిస్తారా? అనే ప్రశ్నకు 65 శాతం మంది అవునని జవాబిచ్చారు. ఇక పాక్ విషయంలో మోదీ సర్కారు సరిగ్గానే వ్యవహరిస్తోందని ఏకంగా 75 శాతం మంది అభిప్రాయపడ్డారు. మోదీ బలమైన నేత అని 18 శాతం, అన్నివర్గాలను కలుపుకుని వెళుతున్నారని 15 శాతం చెప్పారు. పాకిస్తాన్‌తో ఎట్టి పరిస్థితుల్లోనూ చర్చలు జరపరాదని 65 శాతం మంది చెప్పగా, చర్చలు జరపాలని 27 శాతం మంది సూచించారు. ప్రధాని మోదీ సాధించిన అతిపెద్ద విజయం అవినీతి నిర్మూలనే అని 20 శాతం మంది చెప్పారు. నల్లధనాన్ని అరికట్టడం(11 శాతం), పెద్ద నోట్లరద్దు(10) ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. -
మన ఎంపీలు మనకంటే 1400 రెట్లు సంపన్నులు..
సాక్షి, న్యూఢిల్లీ : ఏ ఎన్నికలైనా పేదరిక నిర్మూలనే తమ అజెండా అని ఊదరగొట్టే నేతలు, ఓట్ల వేటలో పేదలను కౌగిలింతల్లో ముంచెత్తడం, వారి ఇంట్లో భోజనం చేయడం వంటి చర్యలతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. అల్పాదాయ వర్గాలను ఆకట్టుకునేందుకు సంక్షేమ కార్యక్రమాలపై నినాదాలు వల్లెవేసే ఎంపీల్లో అసలు పేదలను ప్రతిబింబించే నేతలు ఉన్నారా అంటే దిక్కులు చూడాల్సిన పరిస్థితి. దేశ ప్రజల సగటు ఆదాయంతో లోక్‌సభ ఎంపీల సగటు రాబడితో పోలిస్తే విస్తుపోయే వాస్తవాలు వెలుగుచూశాయి. మన ఎంపీలు మన ప్రజల కంటే 1400 రెట్లు అధిక రాబడిని ఆర్జిస్తున్నారని ఇండియా టుడే డేటా ఇంటెలిజెన్స్ యూనిట్ విశ్లేషించింది. 2004 నుంచి 2019 వరకూ ఎన్నికైన ఎంపీల నికర ఆస్తులను లెక్కగట్టడం ద్వారా ఈ గణాంకాలను వెలువరించింది. ఎంపీల సగటు ఆదాయం 2004-09లో కేవలం రూ 1.9 కోట్లు కాగా తర్వాతి కాలంలో రూ 5.06 కోట్లకు ఎగబాకగా 2014-19లో రూ 13 కోట్లకు ఎగిసింది. ఇక ప్రస్తుత 17వ లోక్‌సభ(2019-24)లో ఎంపీల సగటు ఆదాయం ఏకంగా రూ 16 కోట్లకు ఎగబాకింది. ఎంపీల సగటు ఆదాయం సామాన్య ప్రజల సగటు ఆదాయంతో పోలిస్తే ఇంత భారీ వ్యత్యాసం ఉండటానికి కారణం 2019 లోక్‌సభ ఎన్నికల్లో పెద్దసంఖ్యలో పారిశ్రామికవేత్తలు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడమేనని విశ్లేషకులు పేర్కొన్నారు. రాజకీయ పార్టీలు నిధుల కోసం స్వయంగా భారీగా వెచ్చించే అభ్యర్ధుల వైపు మొగ్గుచూపడంతో వ్యాపారులు ఇబ్బడిముబ్బడిగా చట్టసభల్లో అడుగుపెడుతున్నారని ఇది పేదలు, చట్టసభ సభ్యుల రాబడిలో తీవ్ర అసమానతలు పెరిగే స్దాయికి దారితీస్తోందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరోవైపు తమ పనులు చక్కబెట్టుకునేందుకు ప్రభుత్వాల్లో పట్టుపెంచుకునేందుకు పారిశ్రామికవేత్తలు రాజకీయ రంగంలోకి వస్తున్నారని ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు. -
నిరంతరం ప్రజల్లోనే ప్రతిపక్ష నేత..
-
కాబోయే సీఎం జగనే!
సాక్షి, అమరావతి: వైఎస్ జగన్ రాష్ట్రానికి తదుపరి ముఖ్యమంత్రి కానున్నారని ‘ఇండియాటుడే’ టీవీ చానెల్ తేల్చి చెప్పింది. తాజాగా నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైనట్లు జాతీయ చానెల్ ఇండియా టుడేలో ప్రసారమయ్యే ‘పొలిటికల్ స్టాక్ ఎక్స్ఛేంజి’ (పీఎస్ఈ) కార్యక్రమం వెల్లడించింది. ఆయా రాష్ట్రాల్లో మారుతున్న పరిణామాలు, తాజా రాజకీయ పరిస్థితులు, ఓటర్ల మనోగతంపై ఇది ఎప్పటికపుడు విడతలవారీగా ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ చేస్తుంటుంది. చానెల్ యాంకర్ రాహుల్ కమల్ ఈనెల 18వ తేదీన నిర్వహించిన ఈ కార్యక్రమం(లైవ్‌షో)లో ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితులపై పలు ఆసక్తికరమైన అంశాలు వెల్లడయ్యాయి. తాజాగా ఫిబ్రవరిలో ‘యాక్సెస్ మై ఇండియా’ ద్వారా నిర్వహించిన సర్వేలో ‘మీ ముఖ్యమంత్రిగా ఎవరు ఉండాలని కోరుకుంటున్నారు?’ అన్న ప్రశ్నకు 45 శాతం మంది వైఎస్ జగన్‌వైపు స్పష్టంగా మొగ్గు చూపారు. 36 శాతం మంది నారా చంద్రబాబు సీఎంగా కొనసాగాలని కోరుకున్నారు. గత సెప్టెంబర్‌తో పోలిస్తే వైఎస్ జగన్‌కు మద్దతిస్తున్న వారు 2 శాతం పెరగగా, సీఎం చంద్రబాబు పట్ల ఆదరణ 2 శాతం క్షీణించడం గమనార్హం. ప్రస్తుతం సీఎం చంద్రబాబుతో పోలిస్తే ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ 9 శాతం ఆధిక్యతతో ఉన్నారు. జగన్‌కు రెండు శాతం ప్లస్.. బాబుకు రెండు శాతం మైనస్ ఇదే సంస్థ గత సెప్టెంబర్‌లో నిర్వహించిన సర్వేలో కూడా జగన్ స్పష్టమైన ఆధిక్యతలో ఉండటం గమనార్హం. గత సెప్టెంబర్‌లో జగన్ సీఎం కావాలని 43 శాతం మంది ప్రజలు కోరుకోగా, చంద్రబాబు మళ్లీ సీఎం కావాలని 38 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి జగన్‌కు మరో 2 శాతం మద్దతు పెరగడంతో బలపరిచే వారి శాతం 45 శాతానికి చేరుకుంది. మరోవైపు చంద్రబాబుకు 2 శాతం మద్దతు తగ్గడంతో 36 శాతానికి పడిపోయింది. 2014 ఎన్నికల్లో మాదిరిగానే 2019లో కూడా వైఎస్సార్ సీపీ, టీడీపీ మధ్యనే ప్రధానంగా పోటీ నెలకొన్నట్లు ఈ సర్వేలో విదితం అయింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలనుకునే వారి శాతం క్రమంగా పడిపోతోందనేది సర్వేలో వెల్లడైంది. గత సెప్టెంబర్‌లో నిర్వహించిన సర్వే ప్రకారం పవన్ ముఖ్యమంత్రి కావాలనుకునే వారు 5 శాతం మంది ఉండగా ఫిబ్రవరి వచ్చే నాటికి ఇది 4 శాతానికి పరిమితమైంది. నిరంతరం ప్రజల్లోనే ప్రతిపక్ష నేత.. ప్రస్తుత సర్వే డేటా ప్రకారం సీఎం చంద్రబాబుతో పోలిస్తే ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ 9 శాతం ఆధిక్యతతో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో చంద్రబాబు ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేకత నెలకొందని, వారి దృష్టిలో జగన్ పరిణితి చెందిన నాయకుడిగా నిలబడ్డారనేది ఈ సర్వే ద్వారా తెలుస్తోందని లైవ్‌షోలో పాల్గొన్న కొందరు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. 2014 ఎన్నికల్లో వైఎస్ జగన్‌ను ప్రజలు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కుమారుడిగా గుర్తించారని, ఇప్పుడు ఆయన్ను రాటుదేలిన నేతగా పరిగణిస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమైంది. సుదీర్ఘ పాదయాత్రతో పాటు నిరంతరం ప్రజల్లోనే గడపటం జగన్‌కు బాగా కలిసి వచ్చాయని దక్షిణ భారత రాష్ట్రాల రాజకీయాల విశ్లేషణ నిపుణుడు వీరరాఘవ్ పేర్కొన్నారు. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి గతంలో చేసిన పాదయాత్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి దోహదం చేసిందని, వైఎస్ కృషి వల్లనే కేంద్రంలో కూడా అధికారం ఎన్డీఏ చేతి నుంచి జారిపోయి యూపీఏకు పగ్గాలు లభించేలా చేసిందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుతం కూడా జగన్ చేసిన పాదయాత్ర ఏపీలో అదే మాదిరిగా సత్ఫలితాలను ఇవ్వబోతోందన్నారు. గత ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ స్వల్ప తేడాతో ఓటమి పాలైందని, అప్పట్లో సంస్థాగత వైఫల్యాలే ఆ పార్టీని అధికారానికి దూరం చేశాయని రాఘవ్ విశ్లేషించారు. ఇటీవల తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ – కాంగ్రెస్‌ల పొత్తు వికటించిందని, ఆ జంకుతోనే ఏపీలో అవి రెండూ పొత్తు పెట్టుకునే అవకాశం ఉండదన్నారు. ఏపీలో కాంగ్రెస్‌తో పొత్తు ఉండదని నారా లోకేష్ స్వయంగా తనకు చెప్పారని ఈ సందర్భంగా రాహుల్ కమల్ పేర్కొన్నారు. రాష్ట్రంలో టీడీపీ – కాంగ్రెస్ మధ్య పొత్తు లేకపోయినా రాహుల్‌గాంధీతో చంద్రబాబు సన్నిహితంగా మెసలటాన్ని ప్రజలు గమనిస్తున్నారని, రాష్ట్రాన్ని విభజించి తమకు అన్యాయం చేసిన కాంగ్రెస్‌పై ఏపీ ప్రజల్లో ఆగ్రహం చల్లారలేదన్నారు. ఆ పార్టీ ఏపీలో కోలుకోవడానికి మరిన్ని ఎన్నికలు అవసరమన్నారు. డేటా వివరాల ప్రకారం ఏపీలో మెజారిటీ ప్రజలు జగన్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని, చంద్రబాబు కన్నా ఆయన బాగా ఆధిక్యతలో ఉండటమే ఇందుకు నిదర్శనమని ఇండియా టుడే విశ్లేషకుడు కౌశిక్ జగ్గా పేర్కొన్నారు. రాష్ట్ర విభజన సమయంలో చంద్రబాబు స్పష్టమైన రాజకీయ వైఖరిని తీసుకోలేక అయోమయంలో ఉన్నారని, కానీ జగన్ మాత్రం సమైక్యాంధ్ర విధానానికే తొలి నుంచి కట్టుబడ్డారని రాహుల్ కమల్ చెప్పారు. -
ప్రియాంక గాంధీ వచ్చినా.. ప్చ్!
దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే అత్యధిక లోక్‌సభ స్థానాలున్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఆంగ్ల వార్తాచానెల్ ఇండియాటుడే ‘పొలిటికల్ స్టాక్ ఎక్సేంజ్’ పేరుతో తాజాగా ఒక సర్వేను నిర్వహించింది. ప్రియాంక గాంధీ రాకతో కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఒరిగేదేంలేదని ఎక్కువ మంది అభిప్రాయపడ్డారు. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వ పనితీరుపై యూపీ ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారు. (ప్రియాంక సమర్థతకు అగ్నిపరీక్ష) పార్టీ ప్రధాన కార్యదర్శిగా కొత్తగా బాధ్యతలు చేపట్టిన ప్రియాంక గాంధీ వల్ల రాష్ట్రంలో కాంగ్రెస్ పునరుజ్జీవం సాధ్యమవుతుందా? సాధ్యం కాదు–57% సాధ్యమవుతుంది–27% తెలియదు–16% ప్రియాంక ప్రభావం ఎవరిపై ఎలా ఉండనుంది? ఎస్పీ, బీఎస్పీ కూటమిపై ఉంటుంది–56% బీజేపీపై ఉంటుంది– 31% తెలియదు– 13% ఎస్పీ–బీఎస్పీ కూటమి బీజేపీని దెబ్బతీస్తుందా? బీజేపీని దెబ్బ తీస్తుంది– 35% బీజేపీపై ప్రభావం ఉండదు– 48% తెలియదు– 17% రాష్ట్ర ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది? సంతృప్తికరంగా ఉంది– 42% సంతృప్తికరంగా లేదు– 39% సాధారణంగా ఉంది– 15% తెలియదు– 04% కేంద్ర ప్రభుత్వ తీరు ఎలా ఉంది? సంతృప్తికరంగా ఉంది– 54% సంతృప్తికరంగా లేదు– 32% సాధారణంగా ఉంది– 11% తెలియదు– 03% అగ్రవర్ణ పేదలకు 10% కోటా ప్రభావం బీజేపీపై ఎలా ఉంటుంది? బీజేపీకి సానుకూలంగా ఉంటుంది– 49% బీజేపీకి ప్రతికూలంగా ఉంటుంది– 31% ఏ ప్రభావమూ ఉండదు– 02% తెలియదు– 18% అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి కేంద్రం కట్టుబడి ఉందనుకుంటున్నారా? అవును– 47% లేదు– 35% తెలియదు– 18% పెద్ద నోట్లరద్దు నిర్ణయంపై మీ అభిప్రాయం? మంచి నిర్ణయం– 53% తప్పు నిర్ణయం– 34% ఎలాంటి ప్రయోజనం లేదు– 11% తెలియదు– 02 -
మోదీకి ప్రత్యామ్నాయం ఎవరు?
న్యూఢిల్లీ: విపక్షాల నుంచి ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీవైపు ఎక్కువ మంది మొగ్గు చూపారు. నరేంద్ర మోదీ అధికారం కోల్పోతే ప్రధానిగా రాహుల్ గాంధీ బాధ్యతలు చేపట్టాలని 52 శాతం మంది కోరుకున్నారని ఇండియా టుడే– కార్వీ సంస్థలు సంయుక్తంగా మూడ్ ఆఫ్ ది నేషన్ (ఎంవోటీఎన్) పేరుతో నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. రాహుల్ తర్వాతి స్థానంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మమతా బెనర్జీ నిలిచారు. 44 శాతం మంది ఆమె ప్రధాని కావాలని కోరుకున్నారు. (ఆ ముగ్గురు కలిస్తే.. యూపీఏదే అధికారం!) బహుజన సమాజ్‌వాదీ పార్టీ అధినేత్రి మాయావతి, సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు అఖిలేశ్ యాదవ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వైపు చాలా తక్కువ మంది మాత్రమే మొగ్గుచూపారు. నరేంద్ర మోదీకి కేజ్రీవాల్ ప్రత్యామ్నాయం కాగలరని కేవలం 4 శాతం మంది అభిప్రాయపడ్డారు. అఖిలేశ్ యాదవ్‌కు ఐదు శాతం మంది మద్దతు తెలిపారు. మాయావతి ప్రధాని కావాలని 3 శాతం మంది మాత్రమే కోరుకున్నారు. అయితే మళ్లీ ప్రధానిగా మోదీయే ఉండాలని 46 శాతం మంది కోరుకోగా, 34 శాతం మంది రాహుల్ గాంధీవైపు మొగ్గుచూపారు. (మోదీపై తగ్గుతున్న నమ్మకం) -
మోదీ కేబినెట్లో బెస్ట్ ఎవరు?
న్యూఢిల్లీ: కేంద్రంలోని నరేంద్ర మోదీ మంత్రివర్గంలో ఉత్తమ పనితీరు కనబరిచిన మంత్రిగా రాజ్‌నాథ్ సింగ్ నిలిచారు. ఇండియా టుడే– కార్వీ సంస్థలు సంయుక్తంగా మూడ్ ఆఫ్ ది నేషన్ (ఎంవోటీఎన్) పేరుతో నిర్వహించిన సర్వేలో మోదీ కేబినెట్‌గా ఉత్తమ మంత్రి (బెస్ట్ మినిస్టర్)గా ఆయన ఎంపికయ్యారు. సర్వేలో భాగంగా దేశవ్యాప్తంగా 13 వేల మంది అభిప్రాయాలు తీసుకున్నారు. పనితీరు ఆధారంగా మంత్రులకు 1 నుంచి 5 వరకు ర్యాంకులు ఇవ్వాలని కోరారు. (మోదీపై తగ్గుతున్న నమ్మకం) హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మంచి పనితీరు కనబరిచారని 50 మంది పేర్కొన్నారు. విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌కు 2వ స్థానం దక్కింది. ఆమెకు 46 శాతం మంది మద్దతు తెలిపారు. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మూడో ర్యాంకులో నిలిచారు. 45 శాతం మంది ఆయనవైపు మొగ్గు చూపారు. నాలుగో స్థానంలో నిలిచిన నితిన్ గడ్కరీకి 39 శాతం మంది, ఐదో ర్యాంకు దక్కించున్న నిర్మలా సీతారామన్‌కు 26 శాతం మంది అనుకూలంగా స్పందించారు. (ఎన్డీయేకు మైనస్.. యూపీయేకు ప్లస్) -
2019 హంగ్!
-
ఆ ముగ్గురు కలిస్తే.. మోదీ అవుట్!
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కూటమితో అఖిలేశ్ యాదవ్, మాయావతి, మమతా బెనర్జీ చేతులు కలిపితే నరేంద్ర మోదీ పదవికి ముప్పు వాటిల్లే అవకాశముంది. ఎస్పీ, బీఎస్పీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలను కలుపుకుని సమిష్టిగా పోటీ చేస్తే కమలం పార్టీకి కష్టాలు తప్పవని ఇండియా టుడే- కార్వీ ఇన్సైట్స్ నిర్వహించిన ‘మూడ్ ఆఫ్ ది నేషన్ పోల్’లో వెల్లడైంది. ఇప్పటికిప్పుడు లోక్‌సభ ఎన్నికలు జరిగితే ఎస్పీ, బీఎస్పీ, తృణమూల్ కాంగ్రెస్‌లతో కూడిన యూపీఏ కూటమి 269 సీట్లు గెల్చుకుంటుందని అంచనా వేసింది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకు 219 స్థానాలు దక్కుతాయి. ఇతరులు 55 సీట్లతో సరిపెట్టుకోవాల్సి ఉంటుంది. ఓట్ల శాతం పరంగా చూస్తే యూపీఏ 44, ఎన్డీఏ 35, ఇతరులు 21 శాతం ఓట్లు దక్కించుకుంటారు. (ఏపీలో వైఎస్సార్ సీపీ ప్రభంజనం) నరేంద్ర మోదీ మళ్లీ అధికారంలోకి రాకుండా ఉండాలంటే యూపీఏతో ఎస్పీ, బీఎస్పీ, తృణమూల్ కాంగ్రెస్ తప్పనిసరిగా చేతులు కలపాల్సివుంటుంది. ఇవన్నీ కలిసినా ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మేజిక్ ఫిగర్ (272)కు మూడు స్థానాల దూరంలో నిలిచిపోతాయని సర్వే విశ్లేషించింది. అఖిలేశ్ యాదవ్, మాయావతి, మమతా బెనర్జీలను రాహుల్ గాంధీ ఒప్పిస్తారా, లేదా అనే దానిపై యూపీఏ విజయం ఆధారపడి ఉంటుందని స్పష్టం చేసింది. బీజేపీని ఓడించేందుకు వీరంతా ఏకతాటిపైకి వస్తారో, లేదో త్వరలోనే తేలనుంది. (తాజా సర్వే... మోదీకి భారీ షాక్) -
తాజా సర్వే... మోదీకి భారీ షాక్
న్యూఢిల్లీ: దేశంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం వస్తుందని సర్వేలో వెల్లడైంది. ఎన్డీఏ కూటమికి మెజారిటీ తగ్గుతుందని ఇండియా టుడే- కార్వీ ఇన్సైట్స్ నిర్వహించిన ‘మూడ్ ఆఫ్ ది నేషన్ పోల్’లో తేలింది. ఈరోజు లోక్‌సభ ఎన్నికలు జరిగితే ఎలాంటి ఫలితాలు వస్తాయనే దానిపై దేశవ్యాప్తంగా ఈ సర్వే నిర్వహించారు. 2014 ఎన్నికలతో పోలిస్తే ఎన్డీఏకు 99 సీట్లు తగ్గే అవకాశముందని సర్వే అంచనా వేసింది. 237 సీట్లు మాత్రమే గెలిచే అవకాశముందని తెలిపింది. గత ఎన్నికలతో పోలిస్తే యూపీఏ కూటమి భారీగా పుంజుకోనుంది. యూపీఏ 166 సీట్లు దక్కించుకునే అవకాశముంది. 2014తో పోలిస్తే యూపీఏకు అదనంగా 106 సీట్లు జతకానున్నయి. ఎన్డీఏ, యూపీఏలో భాగస్వాములు కాని పార్టీలు 140 స్థానాల్లో విజయం సాధిస్తాయని సర్వే తేల్చింది. మొత్తంగా చూస్తే ఎన్డీఏకు 35 శాతం, యూపీఏకు 33 శాతం ఓట్లు పడతాయని అంచనా. (ఏపీలో వైఎస్సార్ సీపీ ప్రభంజనం) త్వరలో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తాజా సర్వే ఫలితాలు కమలనాథులను కలవరపెడుతున్నాయి. రెండోసారి అధికారం దక్కించుకోవాలన్న మోదీ-షా ద్వయానికి ఈ అంచనాలు షాక్ ఇచ్చాయి. అయితే ఎన్డీఏ, యూపీఏతో జట్టు కట్టే పార్టీల ఆధారంగా ఫలితాలు మారే అవకాశముంది. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు కావాల్సిన మేజిక్ ఫిగర్ 272. ఎన్డీఏ, యూపీఏలో భాగస్వాములు కానీ పార్టీలు దేనికి మద్దతు ఇస్తే ఆ కూటమే ప్రభుత్వం ఏర్పాటు చేయగలుగుతుందని సర్వే ద్వారా స్పష్టమైంది. -
టీఆర్ఎస్దే పైచేయి .. ఇండియా టుడే తాజా సర్వే
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రస్తుత వాతావరణం, ప్రజానాడి హస్తానికే మొగ్గు ఉందని కాంగ్రెస్ పార్టీ మాజీ నేత లగడపాటి రాజగోపాల్ పేర్కొనగా.. మరోవైపు ఇండియాటుడే తాజా సర్వే మాత్రం టీఆర్ఎస్ పార్టే పై చేయి సాధిస్తుందని స్పష్టం చేసింది. మరో రెండు రోజుల్లో ఎన్నికల పోలింగ్ జరగనుండటంతో ఈ సర్వేలు సర్వత్రా ఆసక్తిరేపుతున్నాయి. లగడపాటి సర్వేకు భిన్నంగా ఇండియా టుడే తాజా సర్వేలో టీఆర్ఎస్కు స్పష్టమైన ఆధిక్యత లభించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇండియా టుడే పొలిటికల్ ఎక్స్ఛేంజ్.. 17 పార్లమెంట్ నియోజవర్గాల్లో టెలిఫొనిక్ ఇంటర్వ్యూ ద్వారా నిర్వహించిన ఈ సర్వేలో టీఆర్ఎస్కు గత నెలకన్నా 4 శాతం మద్దతు పెరిగినట్లు వెల్లడైందని ప్రకటించింది. గత నెలలో 44 శాతం మంది టీఆర్ఎస్కు మద్దతు నిలవగా.. ప్రస్తుతం 48 శాతం మద్దుతు పలుకుతున్నట్లు తమ సర్వేలో స్పష్టమైందని పేర్కొంది. ఇక ప్రభుత్వం మారాలనే వారి సంఖ్య కూడా 4 శాతం పెరిగందని, గత నెలలో 34 శాతం మంది ప్రభుత్వ మార్పును కోరగా.. ప్రస్తుతం ఆ మద్దతు 38 శాతం పెరిగిందన్నారు. ఉత్తర తెలంగాణలో టీఆర్ఎస్ బలంగా ఉండగా.. దక్షిణ తెలంగాణలో కూటమికి అనుకూలంగా ఉందని తెలిపింది. తెలంగాణ ప్రభుత్వ సంక్షేమ పథకాలు.. రైతు బంధు, రైతు భీమా, కల్యాణ లక్ష్మీలపై ప్రజల్లో ఆధారణ ఉందని, ఇది టీఆర్ఎస్కు కలిసొచ్చే అంశమని పేర్కొంది. నగరంలో ఎంఐఎం మద్దతు కూడా కలిసిసొస్తుందని, మురికి వాడల్లో కూడా టీఆర్ఎస్ ప్రభుత్వ పనితీరుపై ప్రజలు సానుకూలంగా ఉన్నారని తమ సర్వేలో వెల్లడైనట్లు పేర్కొంది. ప్రతి పార్లమెంట్ నియోజక వర్గంలో టెలిఫొనిక్ ఇంటర్వ్యూ ద్వారా 6,887 శాంపుల్స్ తీసుకున్నట్లు తెలిపింది. -
మళ్లీ కేసీఆరే!
న్యూఢిల్లీ : తెలంగాణలో డిసెంబర్ 7న జరిగే ఎన్నికల్లో కే చంద్రశేఖర్‌రావు నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) విజయం సాధించి, మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశాలు 75% ఉన్నాయని ఇండియా టుడే నిర్వహించిన తాజా సర్వేలో తేలింది. ఈ సర్వేలో మళ్లీ టీఆర్ఎస్ ప్రభుత్వమే రావాలని 44% మంది కోరుకోగా, ప్రభుత్వం మారాలని 34% కోరుకున్నారు. మాకు తెలియదంటూ స్పందించిన వారు 22% ఉన్నారు. తదుపరి ముఖ్యమంత్రిగా కేసీఆర్‌కు 46%, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి (కాంగ్రెస్)కి 25%, కిషన్‌రెడ్డి (బీజేపీ)కి 16%, ప్రొఫెసర్ కోదండరాంకు 7%, అసదుద్దీన్ ఒవైసీకి 4% మద్దతు పలికారు. రాష్ట్రంలోని 17 లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలోని 6,877 మందిని టెలిఫోన్ ద్వారా సంప్రదించి ఇండియా టుడే సంస్థ ‘పొలిటికల్ స్టాక్ ఎక్సే్ఛంజ్’ పేరుతో సర్వే ఫలితాలను విడుదల చేసింది. సర్వే ఫలితాల ఆధారంగా పలు అంశాలను నిపుణుల సహాయంతో విశ్లేషించింది. ఆ వివరాలు.. ముందస్తు ఎన్నికలకు వెళ్లడం కేసీఆర్ అమలు చేసిన అద్భుత వ్యూహం. ప్రభుత్వ అనుకూలత బలంగా ఉంది. సమాజంలోని అన్ని వర్గాల్లో టీఆర్ఎస్కు మద్దతు ఉంది. కేసీఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలు సత్ఫలితాలు ఇవ్వనున్నాయి. కాంగ్రెస్– టీడీపీ పొత్తు వారికి ఆశించిన ఫలితాలను ఇవ్వకపోవచ్చు. హైదరాబాద్‌లో కాంగ్రెస్ విజయావకాశాలను ఎంఐఎం దెబ్బతీస్తుంది.