న్యూఢిల్లీ: విపక్షాల నుంచి ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీవైపు ఎక్కువ మంది మొగ్గు చూపారు. నరేంద్ర మోదీ అధికారం కోల్పోతే ప్రధానిగా రాహుల్ గాంధీ బాధ్యతలు చేపట్టాలని 52 శాతం మంది కోరుకున్నారని ఇండియా టుడే– కార్వీ సంస్థలు సంయుక్తంగా మూడ్ ఆఫ్ ది నేషన్ (ఎంవోటీఎన్) పేరుతో నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. రాహుల్ తర్వాతి స్థానంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మమతా బెనర్జీ నిలిచారు. 44 శాతం మంది ఆమె ప్రధాని కావాలని కోరుకున్నారు. (ఆ ముగ్గురు కలిస్తే.. యూపీఏదే అధికారం!)
బహుజన సమాజ్‌వాదీ పార్టీ అధినేత్రి మాయావతి, సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు అఖిలేశ్ యాదవ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వైపు చాలా తక్కువ మంది మాత్రమే మొగ్గుచూపారు. నరేంద్ర మోదీకి కేజ్రీవాల్ ప్రత్యామ్నాయం కాగలరని కేవలం 4 శాతం మంది అభిప్రాయపడ్డారు. అఖిలేశ్ యాదవ్‌కు ఐదు శాతం మంది మద్దతు తెలిపారు. మాయావతి ప్రధాని కావాలని 3 శాతం మంది మాత్రమే కోరుకున్నారు. అయితే మళ్లీ ప్రధానిగా మోదీయే ఉండాలని 46 శాతం మంది కోరుకోగా, 34 శాతం మంది రాహుల్ గాంధీవైపు మొగ్గుచూపారు. (మోదీపై తగ్గుతున్న నమ్మకం)
Comments
Please login to add a commentAdd a comment