Mood of the Nation Survey
-
మూడ్ కనిపెట్టలేకపోయిన 2004 సర్వే
‘మూడ్ ఆఫ్ ది నేషన్’ అంటూ ఒక జాతీయ ఆంగ్ల పత్రిక ప్రతి ఆర్నెల్లకోసారి సర్వే ఫలితాలను ఇస్తుంటుంది. సాధారణంగా – ఆగస్టులో ఒకసారి, ఫిబ్రవరిలో రెండోసారి. ఈ ఏడాది ‘ఫిబ్రవరి సర్వే’ కాస్త ముందుగానే వచ్చింది. (మొన్న చూసే ఉంటారు.) ఇది ఎన్నికల సంవత్సరం కనుక ఈ సర్వే అన్నది కొందరి కోసం ‘ముందస్తు’ ఏర్పాటు కావచ్చు. సర్వే ఫలితాలు ఎలా ఉన్నాయంటే – లోక్‌సభలో మోదీకి తిరుగు ఉండదని, ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీదే దుమ్ముదుమారం అనీ!! ఇకనేం, 2024 ఎన్నికల ఫలితాలు వచ్చి, చంద్రబాబు ముఖ్యమంత్రి అయినంత రేంజ్లో ఈ సర్వే ఫలితాలను బాబు గారి రెండు ప్రధాన పత్రికలు తమ ఫ్రంట్ పేజీల్లో ప్రముఖంగా ప్రచురించాయి. ఒక్కసారి 20 ఏళ్లు వెనక్కు వెళితే కనుక – 2004లో ఇదే పత్రిక ఇదే విధమైన సర్వే ఫలితాలను ఇచ్చింది. వాజ్‌పేయి విజయ ఢంకా మోగించబోతున్నారని, ఇక్కడ ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు సైకిల్ దూకుడు మీద ఉందని రాసింది. సర్వేను తాము ఎంత శాస్త్రీయంగా జరిపిందీ ఆ వివరాలు కూడా ఇచ్చింది. ‘‘ముఖ్యమంత్రుల ప్రజాదరణ స్థాయి తెలుసుకునేందుకు 19 రాష్ట్రాలలో మేము జరిపిన సర్వేలో ఆశ్చర్యకరమైన ఫలితాలు వెల్లడయ్యాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరుసగా రెండోసారి జాతీయ స్థాయిలో ఉత్తమ ముఖ్యమంత్రిగా అవతరించారు’’ అని ఆ సర్వే రాసింది. (రెండో స్థానం ములాయం సింగ్ యాదవ్, మూడో స్థానంలో ఇద్దరు.. నరేంద్రమోదీ, షీలా దీక్షిత్). అంతకు ముందు ఆగస్టులో (2003) జరిపిన సర్వేలో రాష్ట్ర ప్రజాదరణలో 10వ స్థానంలో ఉన్న చంద్రబాబు ఫిబ్రవరి కల్లా 3వ స్థానానికి చేరుకున్నారని సర్వే నివేదించింది! ఆయన పాలన ‘అసాధారణం’ అన్నవారు 10 శాతం, ‘బాగుంది’ అన్నవారు 49 శాతం, ‘ఒక మోస్తరు’ అన్నవారు 29 శాతం ఉంటే, ‘అధ్వాన్నం’ అన్నవారు 11 శాతం మంది ఉన్నారు. అసలేమీ చెప్పని వారు 1 శాతం మంది. ఇక్కడితో సర్వే ముగియలేదు. రహదారులు, పాఠశాల విద్య, మంచి నీళ్లు.. ఈ సెగ్మెంట్ల నాణ్యతలో కర్ణాటక, కేరళ, తమిళనాడుల కంటే ఆంధ్రప్రదేశే ముందుందని చంద్రబాబు పాలనకు మార్కులు వేసింది. అయితే ఆయన ఫెయిల్ అయ్యారు! ఆ సర్వే ఫెయిల్ అయింది. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ కాంగ్రెస్ వచ్చింది. ఇక్కడ వై.ఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఎదురులేని పాలకుడు అని శ్లాఘించి, అధికారంలోకి వచ్చీ రాగానే నవతరం భాష మాట్లాడుతున్న చంద్రబాబు ప్రజల ఆలోచనా దృక్పథాన్ని ఆధునికత వైపు మళ్లించే ప్రయత్నం చేశారని కీర్తించిన 2004 నాటి సర్వే ఒక విషయాన్నయితే ఉన్నది ఉన్నట్లు రాసింది. అది చంద్రబాబు విజన్ గురించి. తూర్పు ఆసియా దేశాల పద్ధతులను ఆదర్శంగా తీసుకుని ముఖ్యమంత్రి కలలు కంటున్న స్వర్ణాంధ్ర ప్రదేశ్, విజన్–2020 బెడిసికొట్టే ప్రమాదం ఉందని తనైతే రాయలేదు కానీ, విమర్శకులు అంటున్నారని మాత్రం వ్యాఖ్యానించింది. కేవలం సమాచార సాంకేతిక విజ్ఞానం మీద, బయో టెక్నాలజీ మీదా ఆధారపడి చంద్రబాబు ఈ కలన్నీ కంటున్నారని విమర్శకుల భావన. ‘‘ఈ కలలు సమాచార సాధనాలను, విదేశీ అధినేతలను, విదేశీ వాణిజ్య వేత్తలను ఆకట్టుకుని ఉండొచ్చు కానీ, కేవలం వాటి ద్వారానే రాష్ట్రాభివృద్ధి జరుగుతుందని భావించకూడదు. అవి ప్రధానంగా వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడం మీదా, పేదరికాన్ని తొలగించడం మీద పూర్తిగా ఆధారపడి ఉన్నాయి..’’అని ఆర్థిక, సామాజిక నిపుణులను ఉటంకిస్తూ సర్వే పేర్కొంది. వ్యవసాయం, పేదరికం అన్నది చంద్రబాబు విజన్లోనే లేవు. ఈ ఐదేళ్లలో జగన్ ప్రభుత్వం ప్రధానంగా వ్యవసాయానికి, పేదల సంక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చింది. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (డి.బి.టి). ద్వారా ఈ ఐదేళ్లలో 4 కోట్ల, 58 లక్షల 37 వేల 727 మంది లబ్దిదారులకు 1 లక్షా 81 వేల 460 వందల కోట్ల రూపాయలను బదిలీ చేసింది. నాన్ డి.బి.టి. కింద 1 కోటీ 10 లక్షల 18 వేల 982 మంది లబ్దిదారులకు 85 వేల 312 కోట్ల రూపాయలను అందించింది. ఆ సంగతి సర్వేలు చెప్పకపోవచ్చు. వాస్తవం ఏమిటన్నది ప్రతి లబ్దిదారునికీ తెలుసు. -
Mood of the Nation: ఎన్డీఏ కూటమికి నితీశ్ దెబ్బ!
న్యూఢిల్లీ: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి బిహార్ సీఎం నితీశ్ కుమార్ దెబ్బకొట్టేలా కన్పిస్తున్నారు. ఎన్డీఏ సంకీర్ణం నుంచి నితీశ్ కుమార్ బయటకు వెళ్లిపోవడం దెబ్బేనని ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ పోల్ వెల్లడించింది. ఇప్పటికిప్పుడు (ఆగస్టు 1) లోక్‌సభ ఎన్నికలు జరిగితే ఎన్డీఏ 307 సీట్లు సాధిస్తుందని పోల్ ఆధారంగా వెల్లడైంది. అయితే బీజేపీతో నితీశ్ తెగతెంపులు చేసుకోవడంతో ఎన్డీఏ సాధించే సీట్ల సంఖ్య తగ్గుతుందని పేర్కొంది. 2024 లోక్‌సభ ఎన్నికలకు ఇంకా 20 నెలల సమయం ఉంది. ఇప్పటికీ ప్రధాని నరేంద్ర మోదీ ఇమేజ్ చెక్కు చెదరలేదని పోల్‌లో వెల్లడైంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మళ్లీ ఆయనే ప్రధానమంత్రి అవుతారని తేల్చింది. ఎన్డీఏకు 307, యూపీఏకు 125 సీట్లు వచ్చే అవకాశముంది. ఇతరులు 111 స్థానాలు దక్కించుకుంటారని అంచనా. సీ-ఓటర్‌తో కలిసి ఆగస్టు 1 వరకు ఇండియా టుడే ఈ పోల్ నిర్వహించింది. అయితే ఇప్పుడు నితీశ్ కుమార్ ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చారు కాబట్టి ప్రత్యక్షంగా 21 సీట్లు తగ్గుతాయి. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో బిహార్‌లో ప్రత్యర్థులను ఎదుర్కొని బీజేపీ ఏమేరకు ప్రభావం చూపుతుందనేది వేచి చూడాలి. (క్లిక్: ప్లీజ్ వదిలేయండి.. ఆ విషయం మళ్లీ అడగకండి) -
ఎన్నికలొస్తే... కేంద్రంలో మళ్లీ బీజేపీయే
దేశంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కేంద్రంలో మరోసారి బీజేపీయే అధికారంలోకి వస్తుందని, ప్రధానిగా వరుసగా మూడోసారి కూడా ప్రజలు నరేంద్ర మోదీనే కోరుకుంటున్నారని సీ ఓటర్– ఇండియా టుడే సంయుక్త సర్వే తేల్చింది. నేషనల్ డెమొక్రాటిక్ అలయన్స్ (ఎన్డీయే) సీట్ల సంఖ్య 350 నుంచి 296కు పడిపోతుందని చెప్పింది. ఎంపీల సంఖ్య 303 నుంచి 271 సీట్లతో సొంతంగా అధికారంలోకి వచ్చే స్థితిలోనే ఉందని తేల్చింది. అయితే జాతీయ స్థాయిలో మోదీకి, బీజేపీకి ఆదరణ చెక్కుచెదరకున్నా... రాష్ట్రాలకు వచ్చేసరికి పరిస్థితి భిన్నంగా ఉంది. ఎన్నికలు జరిగే అన్ని రాష్ట్రాల్లోనూ ఏ ఒక్క సీఎంకు పూర్తిస్థాయి ప్రజాదరణ కనిపించడం లేదు. ఈ రాష్ట్రాల్లో ఏ ఒక్క సీఎం కూడా సంతృప్తకర పాలన అంశంలో సగం మార్కు అయిన 50 శాతాన్ని దాటలేకపోవడం గమనార్హం. అలాగే ఐదు రాష్ట్రాల సీఎంలపైనా 34 శాతం మంది ప్రజల్లో పూర్తి వ్యతిరేకత ఉండటం గమనార్హం. ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు ఏడు విడతలుగా ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లో పంజాబ్ మినహా మిగతా నాలుగింటిలో బీజేపీ సీఎంలే ఉన్నారు. పాలన సంతృప్తకర స్థాయిలో ఉందనే అంశంలో ఐదు రాష్ట్రాల్లో పోల్చినపుడు 49 శాతం అనుకూల ఓట్లతో అందరికంటే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌యే ఆధిక్యంలో ఉన్నారు. విశేషమేమిటంటే వ్యతిరేకతలోనూ ఆయనే టాప్. దేశంలో అన్నింటికంటే పెద్ద రాష్ట్రమైన యూపీ, 2.13 కోట్ల ఓటర్లున్న పంజాబ్‌లతో కలిపి మొత్తం ఐదు రాష్ట్రాల్లో 18.3 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఈ సర్వే దేశ జనాభాలో మొత్తం 12.8 శాతం మంది అభిప్రాయాలను ప్రతిఫలిస్తుందనుకోవచ్చు. ► ఎవరు చేశారు: (మైక్, రిసీవర్ ఫోటోస్) సీ ఓటర్– ఇండియా టుడే టీవీ సంయుక్త సర్వే ► ఎక్కడ చేశారు: ఎన్నికలు జరిగే ఐదు రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్లలో. ► సర్వే శాంపిల్ (ఎంతమందిని ఇంటర్వ్యూ చేశారో చెప్పే సంఖ్య): 60,141 ► తొలిదశలో: 20,566 (ఆగస్టు 16, 2021– జనవరి 10– 2022 మధ్య) ► మలిదశలో: 39,575 (గత మూడు వారాల్లో) ఎలా చేశారు: కరోనా నేపథ్యంలో ప్రత్యక్షంగా చేయకుండా టెలి ఫోన్ ద్వారా ఇంటర్వ్యూ చేశారు. ప్రేమించు లేదా ద్వేషించు ఐదు రాష్ట్రాల సీఎంలతో పోల్చిచూసినపుడు అనుకూలత– వ్యతిరేకతల్లో యూపీ సీఎం యోగియే టాప్‌లో ఉన్నారు. అంటే కరడుగట్టిన హిందూత్వ వాదిగా పేరుపడ్డ యోగిని ప్రేమించే వాళ్లు ఎంత అధికంగా ఉన్నారో... ద్వేషించే వాళ్లూ అధికాంగానే ఉన్నట్లు లెక్కని ఇండియా టుడే ఎడిటోరియల్ డైరెక్టర్ రాజ్ చెంగప్ప, ఇతరు నిపుణులు అభిప్రాయపడ్డారు. సామర్థ్యాన్ని శంకించే వారు సొంత పార్టీలోనే ఎక్కువ కాంగ్రెస్‌కు ఈ వైల్డ్‌కార్డ్ బాగానే పనిచేస్తోంది. అయితే పంజాబ్ సీఎంగా చరణ్‌జిత్ సింగ్ చన్నీ సామర్థ్యాన్ని శంకించే వారిలో బయటివారికంటే సొంత పార్టీలోనే ఎక్కువగా ఉన్నారు. -
మన్మోహన్ కన్నా మోదీ సర్కార్ బెటర్..
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కారణంగా దేశంలో ఏర్పడిన అసాధారణ ఆర్థిక సంక్షోభాన్ని ప్రధాని మోదీ ప్రభుత్వం సమర్ధవంతంగా ఎదుర్కొందని మెజారిటీ ప్రజలు అభిప్రాయపడుతున్నారని ‘ఇండియా టుడే – కార్వీ’ సంయుక్తంగా నిర్వహించిన ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ సర్వే తేల్చింది. కరోనాను ఎదుర్కొనేందుకు ప్రకటించిన లాక్డౌన్ కారణంగా గత 4 దశాబ్దాల్లో తొలిసారి భారత్ ఆర్థికమాంద్యం బారిన పడింది. పారిశ్రామిక రంగం, సేవల రంగం వృద్ధి నిలిచిపోయింది. నిరుద్యోగం ప్రబలింది. ఈ ప్రతికూల పరిస్థితుల్లోనూ ఆర్థిక రంగాన్ని ప్రభుత్వం సమర్దవంతంగా నిర్వహించిందని ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ వెల్లడించింది. ఆర్థిక రంగంలో మోదీ ప్రభు త్వ తీరు అద్భుతంగా ఉందని సర్వేలో పాల్గొన్న వారిలో 20%, బావుందని 46%, సాధారణంగా ఉందని 21% అభిప్రాయ పడ్డారు. కరోనా, లాక్డౌన్ల కారణంగా తమ ఆర్థిక పరిస్థితి దిగజారిందని 12% ప్రజలు పేర్కొన్నారు. 2020 జనవరిలో జరిగిన మూడ్ ఆఫ్ ది నేషన్‌లో కరోనా, లాక్డౌన్ల వల్ల ఆర్థిక పరిస్థితి దిగజారిందని 27% ప్రజలు వెల్లడించడం గమనార్హం. మన్మోహన్ కన్నా బెటర్.. ఆర్థిక రంగ నిర్వహణలో ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రభుత్వం కన్నా మోదీ సర్కారు మెరుగ్గా వ్యవహరించిందని 47% ప్రజలు తెలిపారు. 36% మాత్రం యూపీఏ ప్రభుత్వంతో సమానంగా ఎన్డీఏ ప్రభుత్వ పనితీరు ఉందన్నారు. ఆర్థిక రంగ నిర్వహణలో యూపీఏతో పోలిస్తే ఎన్డీఏ పనితీరు అత్యంత దారుణంగా ఉందని 13% ప్రజలు పేర్కొన్నారు. కేంద్రం ప్రకటించిన ఆర్థిక రంగ ఉద్దీపన పథకాలతో తమ ఆర్థిక పరిస్థితిలో మార్పేంలేదని 43%, పరిస్థితి దిగజారిందని 20%, సానుకూల మార్పు వచ్చిందని 35% ప్రజలు తెలిపారు. -
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా ఎన్డీఏకు 321 సీట్లు!
న్యూఢిల్లీ: దేశ సరిహద్దుల్లో చైనా, ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు, దేశవ్యాప్తంగా కరోనా, అస్తవ్యస్త ఆర్థిక వ్యవస్థ.. ఇలా అసాధారణ వరుస సవాళ్లను ఎదుర్కొన్న ఏ ప్రభుత్వ ప్రజాదరణ అయినా సహజంగానే తగ్గుముఖం పడుతుంది. కానీ, ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వ ప్రజాదరణ మాత్రం ఈ అసాధారణ సవాళ్లలోనూ చెక్కు చెదరలేదని, ఇప్పటికిప్పుడు సార్వత్రిక ఎన్నికలు జరిగినా ఎన్డీఏ ఘన విజయం సాధిస్తుందని ‘ఇండియా టుడే –కార్వీ’ జరిపిన ‘మూడ్ ఆఫ్ ది నేషన్(ఎంఓటీఎన్)’ సర్వే తేల్చింది. మెజారిటీ మార్క్‌ను దాటి 43% ఓట్లతో 321 స్థానాలను సునాయాసంగా గెలుచుకుంటుందని తేల్చింది. గత సంవత్సరం ఆగస్ట్ నెలలో జరిపిన సర్వేలో ఎన్డీఏ 316 సీట్లు గెలుచుకుంటుందని తేలగా, దానిపై మరో ఐదు స్థానాలు అధికంగానే గెలుస్తుందని ప్రస్తుత సర్వే పేర్కొనడం విశేషం. అయితే, 2019 ఎన్నికల్లో ఎన్డీఏ గెల్చుకున్న 357 సీట్ల కన్నా ఈ నెంబర్ తక్కువగానే ఉండటం గమనార్హం. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే విపక్ష యూపీఏ కూటమి 93 సీట్లు గెల్చుకుంటుందని ఈ ఎంఓటీఎన్ సర్వే పేర్కొంది. ప్రాంతాల వారీగా తీసుకుంటే, హిందీ, హిందుత్వ రాజకీయాలు బలంగా ఉన్న ఉత్తర భారతదేశంలో ఎన్డీఏ అత్యధికంగా 104 సీట్లను, పశ్చిమ భారతదేశంలో 85 సీట్లను, తెలివైన పొత్తులతో తూర్పు భారతంలో 100 స్థానాలను గెల్చుకుంటుందని ఈ సర్వే తేల్చింది. దక్షిణ భారత్‌లో మాత్రం ఆశించిన ఫలితాలను సాధించలేదని, అక్కడ 32 సీట్లకే పరిమితమవుతుందని పేర్కొంది. పార్టీల వారీగా చూస్తే బీజేపీ మరొకసారి సొంతంగా మెజారిటీ సాధిస్తుందని, మెజారిటీ మార్క్ అయిన 272ని దాటి 291 స్థానాల్లో విజయం సాధిస్తుందని పేర్కొంది. కాంగ్రెస్ 51 సీట్లు మాత్రమే సాధిస్తుందంది. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ 52 సీట్లు గెల్చుకున్న విషయం తెలిసిందే. మోదీపై విశ్వాసం కరోనాపై పోరుకు అనూహ్య లాక్డౌన్ ప్రకటన, కరోనా కేసుల్లో ప్రపంచంలో రెండోస్థానంలో నిలవడం, వలస కూలీల సంక్షోభం, కనిష్ట స్థాయికి జీడీపీ, ప్రబలిన నిరుద్యోగం, లద్దాఖ్ సరిహద్దుల్లో చైనా దూకుడు.. తదితర అంశాల్లో విమర్శలు వచ్చినప్పటికీ.. ప్రధాని మోదీపై ప్రజల విశ్వాసం సడలలేదని సర్వేలో తేలింది. ఎంఓటీఎన్ సర్వేలో పాల్గొన్నవారిలో 74% మంది మోదీ ప్రధానిగా అత్యుత్తమ పనితీరు చూపారని ప్రశంసించారు. వరుసగా ఏడో సంవత్సరం అధికారంలో ఉన్న నేతకు ఈ స్థాయిలో ప్రజాదరణ లభించడం అరుదైన విషయమే. అలాగే, ఎన్డీఏ ప్రభుత్వ పనితీరుపై 66% మంది సంతృప్తి వ్యక్తం చేశారు. అత్యుత్తమ ప్రధాని రేసులోనూ మోదీ చాలా ముందున్నారు. దేశ అత్యుత్తమ ప్రధానిగా 38% రేటింగ్‌తో మోదీ తొలి స్థానంలో నిలిచారు. తరువాతి స్థానాల్లో వరుసగా అటల్ బిహారీ వాజ్‌పేయి(18%), ఇందిరాగాంధీ(11%), జవహర్లాల్ నెహ్రూ(8%), మన్మోహన్ సింగ్(7%) ఉన్నారు. అయితే, దక్షిణ భారత్‌లో మోదీ హవా, బీజేపీ ప్రభావం అంతగా కనిపించలేదు. ప్రధానిగా మోదీ పాపులారిటీ దక్షిణ భారతదేశంలో 63 శాతం ఉంది. ముస్లింలలో 38% మోదీ పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. మోదీ ప్రభుత్వం సాధించిన రెండు గొప్ప విజయాలుగా సర్వే తేల్చినవి ఆరెస్సెస్ అజెండాకే సంబంధించినవి కావడం విశేషం. -
సీఎం జగన్‌కు టాప్ ర్యాంక్
దేశవ్యాప్తంగా 12,021 మందిని 2020 జూలై 15 నుంచి జూలై 27 మధ్య టెలిఫోన్ ద్వారా సర్వేచేశారు. వీరిలో 67 శాతం మంది గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారు కాగా.. 33 శాతం మంది పట్టణ ప్రాంతాల వారున్నారు. మొత్తం మీద 19 రాష్ట్రాల్లోని 97 లోక్‌సభ.. 194 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్వహించారు. ‘సొంత రాష్ట్రంలో ఆదరణ’లో నంబర్‌వన్ సొంత రాష్ట్రంలో 87 శాతం ప్రజల మద్దతుతో అత్యంత ప్రజాదరణ ఉన్న ముఖ్యమంత్రిగా నంబర్ వన్ స్థానంలో వైఎస్ జగన్ నిలిచారు. ఈ విభాగంలో రెండో స్థానంలో నిలిచిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు 63 శాతం, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి 59 శాతం ప్రజల మద్దతు లభించింది. బిహార్ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌కు 55 శాతం ప్రజల ఆదరణ లభించగా.. దేశంలోనే అత్యుత్తమ ముఖ్యమంత్రిగా స్థానం సంపాదించిన యోగి ఆదిత్యనాథ్‌కు మాత్రం ఉత్తరప్రదేశ్‌లో 49 శాతం ప్రజాదరణ మాత్రమే దక్కింది. సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి రాష్ట్రంలో తిరుగులేని ప్రజాదరణ లభించింది. దేశవ్యాప్తంగా అత్యుత్తమంగా పనిచేసే ముఖ్యమంత్రుల జాబితాలో జగన్ 11 శాతం ఓట్లతో మూడో స్థానం కైవసం చేసుకున్నప్పటికీ.. సొంత రాష్ట్రంలో మాత్రం ఆయా రాష్ట్రాల్లోని ముఖ్యమంత్రులందరి కంటే బాగా ముందంజలో ఉండి 87 శాతం ప్రజల మద్దతును పొందగలిగారు. తన ఏడాదిన్నర పాలనలోపే.. దేశంలో బాగా పనిచేస్తున్న ముఖ్యమంత్రుల జాబితాలో వైఎస్ జగన్ మూడో స్థానంలో నిలిచి యావత్ దేశం దృష్టిని ఆకర్షించారు. ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ పేరుతో ఇండియా టుడే నిర్వహించిన తాజా సర్వే వివరాలను ఆ పత్రిక వెల్లడించింది. ముఖ్యమంత్రి జగన్‌కు పెరిగిన ఆదరణ మూడ్ ఆఫ్ ది నేషన్’ సర్వే ఈ ఏడాది జనవరిలో చేసినప్పుడు.. వైఎస్ జగన్‌కు దేశవ్యాప్తంగా 7 శాతం మంది నుంచి ఆదరణ లభించగా, తాజా సర్వేలో అది 11 శాతానికి పెరిగింది. హామీలు వరుసగా అమలుచేయడం, మేనిఫెస్టోలో లేని పథకాలనూ ప్రవేశపెట్టడం, పాలనలో తీసుకొచ్చిన సంస్కరణల ఫలాలు ప్రజలకు బాగా అందుతుండటంవల్ల ఆదరణ పెరిగిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. దేశంలో అత్యుత్తమ సీఎం యోగి దేశవ్యాప్తంగా జరిగిన ఈ సర్వేలో అత్యుత్తమ ముఖ్యమంత్రిగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ నెంబర్ 1 స్థానంలో నిలిచారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ నెంబర్ 2లో, నంబర్ 3 స్థానాన్ని వైఎస్ జగన్ సొంతం చేసుకున్నారు. ఈ సర్వేలో యోగి ఆదిత్యనాథ్‌కు 24, అరవింద్ కేజ్రీవాల్‌కు 15, వైఎస్ జగన్‌కు 11 శాతం ఓట్లు వచ్చాయి. 4, 5 స్థానాల్లో పశ్చిమబెంగాల్, బీహార్ సీఎంలు మమతా బెనర్జీ, నితీష్‌కుమార్ ఉన్నారు. పొరుగు రాష్ట్రమైన తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు మూడు శాతం ఓట్లతో 9వ స్థానంలో నిలిచారు. అందరి దృష్టిని ఆకర్షించిన వైఎస్ జగన్ రాష్ట్రంలో అత్యధిక శాతం (87) ప్రజల మద్దతు పొందడానికిగల ప్రధాన కారణాలను ఇండియా టుడే వెల్లడించింది. అవేమిటంటే.. ► అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే తాను ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నింటినీ దాదాపు నెరవేర్చడం. ► సంతృప్తస్థాయిలో సంక్షేమ పథకాలు అమలుచేయడం. ► పాలనా సంస్కరణల్లో భాగంగా గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటుచేసి క్షేత్రస్థాయిలో ప్రభుత్వ సేవలను వలంటీర్ల ద్వారా సమర్థవంతంగా ప్రజలకు చేర్చడం. ► ఈ ‘సచివాలయ వ్యవస్థ’ను భవిష్యత్ పాలనకు చుక్కానిలా నిర్మించడం. ► తద్వారా దాదాపు 4 లక్షల ఉద్యోగాలివ్వడం. -
‘జగన్ భవిష్యత్తులో మీరు ఫస్ట్ ర్యాంక్ సాధిస్తారు’
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రుల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి మూడోస్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ పరిమళ్ నత్వాని సీఎం జగన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఇదే పని తీరుతో త్వరలోనే ఆయన ప్రథమస్థానంలో నిలుస్తారని ఆకాంక్షించారు. ఈ మేరకు శనివారం పరిమళ్ నత్వాని ట్వీట్ చేశారు. ‘ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఒక్క ఏడాదిలోనే సీఎం జగన్.. అత్యంత ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రుల్లో మూడోస్థానం సంపాదించడం నిజంగా ప్రశంసనీయం. ఏపీ ప్రజల సంక్షేమం కోసం అన్ని రంగాల్లో విస్తృమైన కృషి చేస్తన్న మీరు.. భవిష్యత్తులో ఫస్ట్ ర్యాంక్ సాధిస్తారని నాకు తెలుసు’ అంటూ ట్వీట్ చేశారు. (ఆ పదవికి రాహులైతేనే బెస్ట్) It is commendable that on completion of just 1yr as #AP CM, Shri @ysjagan has been ranked as 3rd best performing CM in #India by @IndiaToday Mood of the Nation survey. I am sure that in future he will rise to 1st rank based on extensive work he is doing on all fronts for AP. pic.twitter.com/uij9g2qgVV — Parimal Nathwani (@mpparimal) August 8, 2020 ఇండియా టుడే మూడ్ ఆఫ్‌ది నేషన్ నిర్వహించిన సర్వేలో అత్యంత ప్రజాదరణ కలిగిన సీఎంలలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌కు ప్రథమ స్థానం దక్కగా.. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ రెండో స్థానంలో నిలిచారు. తెలంగాణ సీఎం కేసీఆర్ తొమ్మిదో స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. -
ఆ పదవికి రాహులైతేనే బెస్ట్
న్యూఢిల్లీ: దాదాపు 135 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఏళ్ల తరబడి దేశం అంతటిని పాలించిన పార్టీ నేడు కేవలం కొన్ని రాష్ట్రాలకే పరిమితమయ్యింది. కొన్ని చోట్ల అసలుకే గల్లంతయ్యింది. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో పార్టీ పగ్గాలను వదిలేసారు రాహుల్ గాంధీ. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఎందరు ఎన్ని రకాలుగా నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఆయన మాత్రం తన నిర్ణయం మార్చుకోలేదు. ప్రస్తుతం సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇండియాటుడే నిర్వహించిన మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే ఆసక్తికర విషయాలను వెల్లడించింది. కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు చేపట్టడానికి రాహుల్ గాంధీనే సరైన వ్యక్తిగా ప్రజలు విశ్వసిస్తున్నారని ఈ నివేదిక తెలిపింది. సర్వేలో పాల్గొన్న వారిలో 23 శాతం మంది కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ అయితేనే బెస్ట్ అని అభిప్రాయపడ్డారని వెల్లడించింది. (అత్యుత్తమ సీఎంలలో వైఎస్ జగన్‌కు మూడో స్థానం) పార్టీని పునరుద్ధరించడానికి ఏ నాయకుడు బాగా సరిపోతారని మీరు అనుకుంటున్నారని ప్రశ్నించగా.. 23 శాతం మంది రాహుల్ గాంధీకి ఓటు వేశారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ 18 శాతం ఓట్లతో రెండో స్థానంలో ఉన్నారు. ఇక ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ 14 శాతం ఓట్లతో నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచారు. ఇక రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ 2 శాతం ఓట్లతో ఆఖరి స్థానంలో ఉండగా.. తిరుగుబాటు నేత సచిన్ పైలట్ 3 శాతం ఓట్లతో చివరి నుంచి రెండో స్థానంలో ఉన్నారు. పార్టీని నూతన పునరుజ్జీవనం వైపు నడిపించడానికి రాహుల్ అయితేనే బెస్ట్ అని ఎక్కువ మంది ప్రజలు ఓటు వేశారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయాన్ని చవి చూడటంతో 2019 ఆగస్టులో రాహుల్ గాంధీ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అధ్యక్ష పదవి నుంచి వైదొలగిన సంగతి తెలిసిందే. -
తిరుగులేదని నిరూపించుకున్న ‘ఖిలాడీ’!
బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ మరోసారి ఇండియా నెంబర్ 1 హీరోగా నిలిచాడు. బిగ్ బీ అమితాబ్ బచ్చన్‌ను వెనక్కి నెట్టి 24 శాతం ఓట్లతో అగ్రస్థానం సొంతం చేసుకున్నాడు. ఇండియా టుడే నిర్వహించిన ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ సర్వేలో తనకు తిరుగులేదని నిరూపించుకున్నాడు. కాగా సామాజిక సందేశం కలిగిన సినిమాల్లో నటించడంతో పాటు సమాజ సేవలోనూ అక్కీ తన వంతు పాత్ర పోషిస్తాడన్న సంగతి తెలిసిందే. గతంలో ఎంతో మందికి సాయం చేసి పెద్ద మనసు చాటుకున్న అక్షయ్.. ప్రాణాంతక కరోనా వైరస్‌పై పోరులో భాగంగా తొలుత రూ. 25 కోట్లు(పీఎం కేర్స్), ఆ తర్వాత మరో మూడు కోట్ల విరాళం అందజేశాడు. ప్రస్తుతం అతడు ‘బెల్ బాటమ్’, ‘రక్షా బంధన్’ తదితర సినిమాల్లో నటిస్తున్నాడు. ఇక ఈ జాబితాలో ఖాన్ల త్రయానికి టాప్-5లో చోటు దక్కింది.(ఇండియా నంబర్ 1 హీరోయిన్ ఎవరంటే!) టాప్- 10 జాబితాలో చోటు దక్కించుకున్న హీరోలు 1. అక్షయ్ కుమార్-24 శాతం 2. అమితాబ్ బచ్చన్- 23 3. షారుఖ్ ఖాన్- 11 4. సల్మాన్ ఖాన్- 10 5. ఆమిర్ ఖాన్-6 6. ఇతరులు- 6 శాతం 7. అజయ్ దేవ్‌గణ్-4 8. హృతిక్ రోషన్-4 9. రణ్వీర్ సింగ్-4 10. రణ్‌బీర్ కపూర్-2 కాగా ఈ ఫలితాలు చూసిన కొంతమంది నెటిజన్లు ఈ విభాగంలో ‘రీల్ విలన్’,‘రియల్ హీరో’ సోనూ సూద్ పేరు కూడా చేరిస్తే బాగుండేది కదా అంటూ కామెంట్లు చేస్తున్నారు. -
ఇండియా నంబర్ 1 హీరోయిన్ ఎవరంటే!
ముంబై: మహమ్మారి కరోనా సినీ రంగం మీద కూడా తీవ్ర ప్రభావం చూపింది. లాక్డౌన్ కారణంగా థియేటర్లు మూతపడ్డాయి. ఓటీటీలో కొన్ని సినిమాలు విడుదలవుతున్నా వెండితెరపై అభిమాన హీరోహీరోయిన్ల సందడి లేక ఫ్యాన్స్ నిరాశకు లోనవుతున్నారు. సిల్వర్ స్క్రీన్‌పై ‘గ్లామర్ మిస్’ అయ్యిందంటూ ఉసూరుమంటున్నారు. కరోనా కారణంగా గ్లామర్ ఫీల్డ్(సినిమా విడుదల విషయం)లో ఒకలాంటి స్తబ్ద వాతావరణం నెలకొంది. ఇలాంటి తరుణంలో ఇండియా టుడే నిర్వహించిన ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ సర్వే సినీ విభాగంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకునే మరోసారి అగ్రస్థానం కైవసం చేసుకున్నారు. గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా, కత్రినా కైఫ్, ఐశ్వర్యా రాయ్ బచ్చన్, అనుష్క శర్మలను వెనక్కి నెట్టి అత్యంత ప్రజాదరణ గల నటీమణిగా నిలిచారు. (అలియా సిగ్గు లేకుండా అవార్డు తీసుకుంది) ఈ సర్వేలో దీపికకు 16 శాతం ఓట్లు పడగా.. ప్రియాంక చోప్రాకు 14, కత్రినా కైఫ్‌కు 13, ఐశ్వర్యరాయ్ బచ్చన్‌కు 10, అనుష్క శర్మకు 9 శాతం ఓట్లు పోలయ్యాయి. ఇక స్టార్ కిడ్ అలియా భట్‌తో పాటు బాలీవుడ్ క్వీన్‌గా పేరొందిన కంగనా రనౌత్ 6 శాతం ఓట్లతో సంయుక్తంగా ఏడో స్థానంలో నిలవడం విశేషం. ఇక కపూర్ ఖాందాన్ వారసురాలు కరీనా కపూర్ ఖాన్‌కు కేవలం 3 శాతం ఓట్లే పడ్డాయి. కాగా రామ్‌లీలా, పద్మావత్ తదితర సినిమాలతో అగ్ర కథానాయికగా ఎదిగి అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్గా వెలుగొందుతున్న దీపికా పదుకునే.. ప్రభాస్ సినిమాతో టాలీవుడ్లో అడుగుపెట్టనున్న సంగతి తెలిసిందే. ‘మహానటి’ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలో ‘డార్లింగ్’తో ఆమె జతకట్టనున్నారు. -
మోదీ కేబినెట్లో అత్యుత్తమ మంత్రి ఎవరు?
న్యూఢిల్లీ: మహమ్మారి కరోనా కట్టడిలో మోదీ సర్కారు విజయవంతమైందా? వాస్తవాధీన రేఖ వెంబడి ఉద్రిక్తతలు సృష్టిస్తున్న చైనాకు దీటుగా జవాబు ఇచ్చిందా? ఆర్థిక వ్యవస్థ పట్ల ప్రజలు సంతోషంగానే ఉన్నారా? ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యలు ఏమిటి? ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే ప్రజలు ఎవరికి ఓటేస్తారు? మోదీ కేబినెట్లో అత్యుత్తమ మంత్రి ఎవరు? తదితర అంశాల్లో ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ పేరిట ఇండియా టుడే- కార్వీ ఇన్సైట్స్ నిర్వహించిన సర్వేలో వెల్లడైన ఫలితాలు, ప్రజాభిప్రాయానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.(మరోసారి ప్రధాని మోదీకి పట్టంకట్టిన ప్రజలు!) ప్రధానిగా నరేంద్ర మోదీ పనితీరు ఎలా ఉంది? బాగుంది- 48 శాతం అత్యద్భుతం- 30 శాతం పర్లేదు- 17 శాతం బాగోలేదు- 5 శాతం ఎన్డీయే ప్రభుత్వం పనితీరుపై మీ అభిప్రాయం? సంతృప్తికరం- 48శాతం చాలా సంతృప్తిగా ఉన్నాం- 24 శాతం బాగుందని లేదా బాలేదని చెప్పలేం- 19 శాతం సంతృప్తికరంగా లేదు- 8 శాతం అసలేమీ చెప్పలేం- 1 శాతం మోదీ సర్కారు సాధించిన అతిపెద్ద విజయం ఏమిటని భావిస్తున్నారు? 1. ఆర్టికల్ 370 రద్దు- 16 శాతం మంది 2. రామ మందిర నిర్మాణంపై సుప్రీంకోర్టు తీర్పు-13 శాతం 3. మౌలిక సదుపాయాల కల్పనలో అభివృద్ధి- 11 శాతం 4. అవినీతి రహిత పాలన- 9 శాతం 5. నల్లధన నిర్మూలన- 9 శాతం 6. కోవిడ్-19 వ్యాప్తిని కట్టడి చేస్తున్న తీరు-7 శాతం 7. పేద, బలహీన వర్గాల, రైతు సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలు- 6 శాతం 8. నోట్ల రద్దు- 6 శాతం 9. జీఎస్టీ విధానం- 5 శాతం వీటితో పాటు స్వచ్చ భారత్(3 శాతం), మహిళా సాధికారికత(2 శాతం), మేకిన్ ఇండియా(2 శాతం) తదితర అంశాలను కూడా కొంత మంది మోదీ ప్రభుత్వ విజయంగా పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వం అతిపెద్ద వైఫల్యం ఏమిటి? 1. మహమ్మారి కరోనాను కట్టడి చేయలేకపోవడం- 25 శాతం 2. నిరుద్యోగం- 23 శాతం 3. లాక్డౌన్ కాలంలో వలస జీవులను ఆదుకోలేకపోవడం- 14 శాతం 4. ధరల పెరుగుదల- 11 శాతం 5. ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయలేకపోవడం- 7 శాతం 6. ఆరోగ్య రంగాన్ని నీరుగార్చడం- 6 శాతం 7. రైతులను పట్టించుకోకపోవడం- 6 శాతం 8. తెలియదు, చెప్పలేం- 4 శాతం 9. చైనా, పాక్, నేపాల్‌లతో సత్సంబంధాల విషయంలో- 1 శాతం వీటితో పాటు జమ్మూ కశ్మీర్లో అశాంతి(1 శాతం), పౌరసత్వ సవరణ చట్టం నిరనసలు(1 శాతం) తదితర అంశాలను మోదీ సర్కారు వైఫల్యాలుగా పేర్కొన్నారు. మోదీ కేబినెట్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తున్న మంత్రి ఎవరు? 1. అమిత్ షా- 39 శాతం 2. రాజ్‌నాథ్ సింగ్- 17 3. ఇతరులు- 14 4. నితిన్ గడ్కరీ- 10 5. నిర్మలా సీతారామన్- 9 6. రవిశంకర్ ప్రసాద్-3 7. ధర్మేంద్ర ప్రధాన్- 2 8. స్మృతి ఇరానీ- 2 శాతం 9. ఎస్. జైశంకర్- 1 శాతం అయితే జనవరి 2020తో పోలిస్తే ఈ విషయంలో అమిత్ షాకు 4 శాతం మేర తక్కువ ఓట్లు పడటం గమనార్హం. అదే విధంగా రాజ్‌నాథ్ సింగ్(39- 17), నితిన్ గడ్కరీ (34-10), నిర్మలా సీతారామన్(26-9) పనితీరుపై ప్రజలు భారీ స్థాయిలో విశ్వాసం కోల్పోయినట్లు సర్వే ద్వారా వెల్లడైంది. భారత్ ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య? 1. కోవిడ్-19 మహమ్మారి- 70 శాతం 2. నిరుద్యోగం- 12 శాతం 3. చైనాతో విభేదాలు, ఆర్థికాభివృద్ధి నెమ్మదించడం- 4 శాతం వీటితో పాటు ద్రవ్యోల్బణం(3 శాతం), అవినీతి, దేశంలో పెరుగుతున్న అసహనం(1 శాతం) తదితర అంశాలను కూడా అతిపెద్ద సమస్యలుగా పేర్కొన్నారు. ఈరోజే లోక్‌సభ ఎన్నికలు నిర్వహిస్తే మీరు ఏ పార్టీకి ఓటేస్తారు? 1. బీజేపీ- 283(సీట్లు) 2.కాంగ్రెస్- 49 3. ఇతరులు- 211 -
అత్యుత్తమ సీఎంలలో వైఎస్ జగన్‌కు మూడో స్థానం
-
మూడో స్థానంలో నిలిచిన సీఎం వైఎస్ జగన్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడోస్థానంలో నిలిచారు. జులై 15 నుంచి 27 మధ్య ఇండియా టుడే మూడ్ ఆఫ్‌ది నేషన్ నిర్వహించిన సర్వేలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. కాగా.. అత్యంత ప్రజాదరణ కలిగిన సీఎంలలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌కు ప్రథమ స్థానం దక్కగా.. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ రెండో స్థానంలో నిలిచారు. తెలంగాణ సీఎం కేసీఆర్ తొమ్మిదో స్థానంలో నిలిచారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(4), ఇతరులు(5), బిహార్ సీఎం నితీశ్‌కుమార్(6), మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే(7), ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్(8), రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లట్(10) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. 19 రాష్ట్రాల్లోని 97 లోక్‌సభ నియోజకవర్గాల్లో ఈ సర్వే జరిగింది. జులై 15 నుంచి 27 మధ్య 12,021 మందితో టెలిఫోన్ ఇంటర్వ్యూ ద్వారా అభిప్రాయాలు సేరరించారు. (సామాజిక ఆసుపత్రుల్లోనూ ఆక్సిజన్ బెడ్లు) -
మోదీకి జైకొట్టిన భారత్
న్యూఢిల్లీ: ప్రధాని మోదీకి మరోసారి భారత్ జైకొట్టింది. మోదీ పాలన బాగుందని 71 శాతం మంది చెప్పినట్లు ఇండియాటుడే–కార్వీ సర్వే తెలిపింది. పాక్‌ను మోదీ ప్రభుత్వం దీటుగా ఎదుర్కొంటున్నట్లు 75 శాతం మంది ప్రజలు అంగీకరించారని వెల్లడించింది. ఇక మోదీ పనితీరుపై తాము సంతృప్తిగా ఉన్నామని 69 శాతం మంది చెప్పినట్లు పేర్కొంది. కశ్మీర్‌కు సంబంధించిన ఆర్టికల్ 370 రద్దుకు ముందు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక సహా 19 రాష్ట్రాల్లో ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ పేరుతో ఈ సర్వేను చేపట్టారు. జులై 22 నుంచి 30 వరకూ దేశవ్యాప్తంగా 12,126 మందిని ఇంటర్వ్యూ చేశారు. వీరిలో 67 శాతం మంది గ్రామీణులు కాగా, 33 మంది పట్టణ ప్రాంతావాసులు కావడం గమనార్హం. కులతత్వమే ప్రధాన ముప్పు.. భారత అంతర్గత భద్రతకు కుల హింస ప్రధాన ముప్పుగా మారిందని మెజారిటీ ప్రజలు అభిప్రాయపడ్డారు. కులహింస కారణంగా ముప్పుందని 25 శాతం మంది తెలపగా, సీమాంతర ఉగ్రవాదం ప్రమాదకరమని 25 శాతం మంది, మత హింసతో జాతిభద్రతకు ముప్పుందని 23 శాతం మంది తెలిపారు. కాగా, అసహనంతో జరిగే దాడులు అంతర్గత భద్రతకు ప్రమాదకరమని కేవలం 10 శాతం మంది మాత్రమే చెప్పారు. సర్వేలో ముఖ్యాంశాలు.. ► అయోధ్యలోని వివాదాస్పద స్థలంలో రామాలయం నిర్మించాలన్న డిమాండ్‌కు 61 శాతం మంది ఆమోదం తెలపగా, 32 శాతం మంది వ్యతిరేకించారు. ఈ సర్వేలో పాల్గొన్న ముస్లింల్లో 33 శాతం మంది రామమందిరం నిర్మించాలని కోరడం గమనార్హం. ► ట్రిపుల్ తలాక్ రద్దుతో ముస్లిం మహిళలకు సాధికారత చేకూరుతుందని 66 శాతం మంది చెప్పగా, సాధికారత చేకూరదని 24 మంది తెలిపారు. ఈ నిర్ణయాన్ని సర్వేలో పాల్గొన్న ముస్లింలలో 49 శాతం(పురుషులు 47 శాతం, మహిళలు 50 శాతం) మంది సమర్థించారు ► యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ దేశంలోనే అత్యుత్తమ ముఖ్యమంత్రి అని సర్వేలో పాల్గొన్న 20 శాతం మంది తెలపగా, బిహార్ సీఎం నితీశ్ కుమార్(10 శాతం మంది) రెండోస్థానంలో నిలిచారు. మహారాష్ట్ర, ఢిల్లీ, ఒడిశా ముఖ్యమంత్రులు ఫడ్నవీస్, కేజ్రీవాల్, నవీన్ పట్నాయక్(8 శాతం) సంయుక్తంగా మూడో స్థానంలో నిలిచారు. ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ జాబితాలో 7 శాతం మంది మద్దతుతో నాలుగో స్థానంలో నిలిచారు. అతి స్వల్ప కాలంలోనే వైఎస్ జగన్ ఈ ఘనత సాధించడం విశేషం. ఐదోస్థానంలో బెంగాల్ సీఎం మమతాబెనర్జీ ఉన్నారు. ► మోదీ ఇమేజ్ కారణంగానే 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిందని 35 శాతం మంది తెలిపారు. ఇక బాలాకోట్ దాడుల వల్ల గెలుపొందిందని 16 శాతం మంది, ప్రకటనలపై ఖర్చుతో విజయం సాధించారని 8 శాతం చెప్పారు. ► బీజేపీకి లోక్‌సభ ఎన్నికల్లో భారీ మెజారిటీ రావడం మంచిదేనని 64% మంది తెలపగా, దేశంలో నియంతృత్వం నెలకొనే ప్రమాదముందని 27% మంది అన్నారు. ► విపక్షాలకు ఓ ప్రధాని అభ్యర్థి అంటూ లేకపోవడం వల్లే యూపీఏ ఓడిపోయిందని 31 శాతం మంది చెప్పారు. విపక్షాల మధ్య అనైక్యత కారణమని 21 శాతం మంది చెప్పారు. ► ప్రస్తుతం ప్రతిపక్షాలకు నాయకత్వం వహించేందుకు టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీయే సరైన నేతని సర్వేలో తేలింది. ఈ సర్వేలో మమతకు 19 శాతం మంది ప్రజలు జైకొట్టగా, ఎస్పీ అధినేత అఖిలేశ్‌కు 12 శాతం, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు 12 శాతం మంది మద్దతు తెలిపారు. ► కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ భారత్‌ను 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారుస్తుందని 66 శాతం మంది చెప్పారు. అత్యుత్తమ ప్రధాని మోదీ ఇప్పటివరకూ భారత ప్రధానిగా పనిచేసినవారిలో మోదీనే అత్యుత్తమని తేలింది. ఈ సర్వేలో 37 శాతం మంది మోదీనే అత్యుత్తమం అని చెప్పగా, ఇందిర 14 శాతం, వాజ్‌పేయి 11 శాతం, నెహ్రూ 9 శాతం, మన్మోహన్ 5శాతంఓట్లతో తర్వాతి స్థానంలో నిలిచారు. రాబోయే ఐదేళ్లలో కశ్మీర్ సమస్యను మోదీ పరిష్కరిస్తారా? అనే ప్రశ్నకు 65 శాతం మంది అవునని జవాబిచ్చారు. ఇక పాక్ విషయంలో మోదీ సర్కారు సరిగ్గానే వ్యవహరిస్తోందని ఏకంగా 75 శాతం మంది అభిప్రాయపడ్డారు. మోదీ బలమైన నేత అని 18 శాతం, అన్నివర్గాలను కలుపుకుని వెళుతున్నారని 15 శాతం చెప్పారు. పాకిస్తాన్‌తో ఎట్టి పరిస్థితుల్లోనూ చర్చలు జరపరాదని 65 శాతం మంది చెప్పగా, చర్చలు జరపాలని 27 శాతం మంది సూచించారు. ప్రధాని మోదీ సాధించిన అతిపెద్ద విజయం అవినీతి నిర్మూలనే అని 20 శాతం మంది చెప్పారు. నల్లధనాన్ని అరికట్టడం(11 శాతం), పెద్ద నోట్లరద్దు(10) ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. -
ఆ సర్వేలో సల్మాన్‌దే టాప్ప్లేస్!
వరుస బ్లాక్‌బస్టర్ హిట్లతో దూసుకుపోతూ, బుల్లితెరపై బిగ్‌బాస్‌గా తన దూకుడును ప్రదర్శించే సల్మాన్.. ఓ సర్వేలో టాప్‌ప్లేస్‌ను దక్కించుకుని నిజంగానే బిగ్‌బాస్ అనిపించుకున్నాడు. ఇండియా టుడే ఏటా నిర్వహించే మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్‌ఖాన్ టాప్‌ప్లేస్‌లో నిలిచాడు. గతేడాది రేస్3తో బాలీవుడ్‌ను పలకరించాడీ భాయీజాన్. ఇక నిత్యం అభిమానులతో టచ్‌లో ఉండే సల్లూ భాయ్ 9శాతం ఓట్లతో టాప్‌ప్లేస్‌లో ఉన్నాడని పేర్కొన్నారు. గత మూడేళ్లలో సల్మాన్ ఖాన్‌కు సింగిల్ డిజిట్(9) రావడం ఇదే తొలిసారి అని, అయినా సల్మానే టాప్ ప్లేస్‌లో దూసుకుపోతున్నాడని ఆ సంస్థ పేర్కొంది. ఇక సల్మాన్ తరువాతి స్థానంలో అక్షయ్ కుమార్(7%), అమితాబ్ బచ్చన్ (7%), షారుఖ్ ఖాన్(7%), రణ్‌వీర్‌సింగ్(5%) ఉన్నారు. అక్షయ్ కుమార్ ప్యాడ్‌మ్యాన్, గోల్డ్ సినిమాలతో సక్సెస్ సాధించారు. షారుఖ్ ఖాన్ గతకొంతకాలంగా బాక్సాఫీస్ వద్ద బోల్తాకొడుతున్నా సర్వేలో మాత్రం ముందున్నారు. ఇక రణ్వీర్-దీపికా వెడ్డింగ్, సింబా సినిమాలతో బాలీవుడ్లో రణ్వీర్ టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారాడు. ఇక గతేడాది పద్మావత్ సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన దీపికా పదుకునే.. సూయిధాగా, జీరో సినిమాల్లో నటించి విమర్శల ప్రశంసలుపొందిన అనుష్క శర్మ ఈ సర్వేలో బెస్ట్ హీరోయిన్స్‌గా 9శాతం ఓట్లతో టాప్ ప్లేస్‌ను దక్కించుకున్నారు. బాక్సాఫీస్ హిట్ లేకపోయినా కత్రినా, గతకొంతకాలంగా బాలీవుడ్లో సినిమాలు చేయకపోయినా ప్రియాంక చోప్రాలు 8శాతం ఓట్లతో ఈ సర్వేలో తరువాతి స్థానంలో ఉన్నారు. చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయం సాధించిన రాజీ సినిమాతో అలియాభట్ మంచి నటిగా గుర్తింపు పొందారు. ఈ సర్వేలో 5 శాతం ఓట్లు సంపాదించిన అలియా ప్రస్తుతం బ్రహ్మాస్త్ర సినిమాతో బిజీగా ఉన్నారు. -
మోదీకి ప్రత్యామ్నాయం ఎవరు?
న్యూఢిల్లీ: విపక్షాల నుంచి ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీవైపు ఎక్కువ మంది మొగ్గు చూపారు. నరేంద్ర మోదీ అధికారం కోల్పోతే ప్రధానిగా రాహుల్ గాంధీ బాధ్యతలు చేపట్టాలని 52 శాతం మంది కోరుకున్నారని ఇండియా టుడే– కార్వీ సంస్థలు సంయుక్తంగా మూడ్ ఆఫ్ ది నేషన్ (ఎంవోటీఎన్) పేరుతో నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. రాహుల్ తర్వాతి స్థానంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మమతా బెనర్జీ నిలిచారు. 44 శాతం మంది ఆమె ప్రధాని కావాలని కోరుకున్నారు. (ఆ ముగ్గురు కలిస్తే.. యూపీఏదే అధికారం!) బహుజన సమాజ్‌వాదీ పార్టీ అధినేత్రి మాయావతి, సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు అఖిలేశ్ యాదవ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వైపు చాలా తక్కువ మంది మాత్రమే మొగ్గుచూపారు. నరేంద్ర మోదీకి కేజ్రీవాల్ ప్రత్యామ్నాయం కాగలరని కేవలం 4 శాతం మంది అభిప్రాయపడ్డారు. అఖిలేశ్ యాదవ్‌కు ఐదు శాతం మంది మద్దతు తెలిపారు. మాయావతి ప్రధాని కావాలని 3 శాతం మంది మాత్రమే కోరుకున్నారు. అయితే మళ్లీ ప్రధానిగా మోదీయే ఉండాలని 46 శాతం మంది కోరుకోగా, 34 శాతం మంది రాహుల్ గాంధీవైపు మొగ్గుచూపారు. (మోదీపై తగ్గుతున్న నమ్మకం) -
మోదీ కేబినెట్లో బెస్ట్ ఎవరు?
న్యూఢిల్లీ: కేంద్రంలోని నరేంద్ర మోదీ మంత్రివర్గంలో ఉత్తమ పనితీరు కనబరిచిన మంత్రిగా రాజ్‌నాథ్ సింగ్ నిలిచారు. ఇండియా టుడే– కార్వీ సంస్థలు సంయుక్తంగా మూడ్ ఆఫ్ ది నేషన్ (ఎంవోటీఎన్) పేరుతో నిర్వహించిన సర్వేలో మోదీ కేబినెట్‌గా ఉత్తమ మంత్రి (బెస్ట్ మినిస్టర్)గా ఆయన ఎంపికయ్యారు. సర్వేలో భాగంగా దేశవ్యాప్తంగా 13 వేల మంది అభిప్రాయాలు తీసుకున్నారు. పనితీరు ఆధారంగా మంత్రులకు 1 నుంచి 5 వరకు ర్యాంకులు ఇవ్వాలని కోరారు. (మోదీపై తగ్గుతున్న నమ్మకం) హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మంచి పనితీరు కనబరిచారని 50 మంది పేర్కొన్నారు. విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌కు 2వ స్థానం దక్కింది. ఆమెకు 46 శాతం మంది మద్దతు తెలిపారు. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మూడో ర్యాంకులో నిలిచారు. 45 శాతం మంది ఆయనవైపు మొగ్గు చూపారు. నాలుగో స్థానంలో నిలిచిన నితిన్ గడ్కరీకి 39 శాతం మంది, ఐదో ర్యాంకు దక్కించున్న నిర్మలా సీతారామన్‌కు 26 శాతం మంది అనుకూలంగా స్పందించారు. (ఎన్డీయేకు మైనస్.. యూపీయేకు ప్లస్) -
మోదీపై తగ్గుతున్న నమ్మకం
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేకపోయారని ఎక్కువమంది అభిప్రాయపడ్డారు. కేంద్రంలో తాను అధికారంలోకి వస్తే ప్రజలకు మంచి రోజులు (అచ్చేదిన్) వస్తాయని గత ఎన్నికల్లో మోదీ హామీయిచ్చారు. అయితే ఈ వాగ్దానాన్ని నిలబెట్టుకోవడంలో ఆయన విఫలమయ్యారని 63 శాతం మంది అభిప్రాయపడ్డారు. మోదీ పాలనతో తమకు మంచి రోజులు వచ్చాయని కేవలం 33 శాతం మంది మాత్రమే పేర్కొన్నారు. ఆర్థిక నిర్వహణలో కాంగ్రెస్ పాలనతో పోల్చుకుంటే మోదీ ప్రభుత్వమే నయమని ఇండియా టుడే– కార్వీ సంస్థలు సంయుక్తంగా మూడ్ ఆఫ్ ది నేషన్ (ఎంవోటీఎన్) పేరుతో నిర్వహించిన సర్వేలో దాదాపు సగం శాతం మంది అభిప్రాయం వ్యక్తం చేశారు. మోదీ ప్రారంభించిన ప్రధానమంత్రి ఉజ్వల యోజన (ఉచిత గ్యాస్ కనెక్షన్), స్వచ్ఛ భారత్ అభియాన్(మరుగుదొడ్ల నిర్మాణం) పథకాలు ప్రజల్లో బలమైన ముద్ర వేశాయని సర్వేలో వెల్లడైంది. అయితే నోట్ల రద్దు నిర్ణయంపై మొదట్లో సానుకూలత వ్యక్తమైనా తర్వాత వ్యతిరేకత పెరిగింది. చిన్న పరిశ్రమలు దెబ్బతినడంతో ఉపాధి తగ్గిపోవడం, రైతులు భారీగా నష్టపోవడంతో గత రెండేళ్లలో మోదీ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగినట్టు సర్వేలో తేలింది. మోదీ హామీయిచ్చినట్టుగా తమకు మంచి రోజులు వస్తాయని 2017లో 45 శాతం మంది విశ్వాసం వ్యక్తం చేయగా, ఇప్పుడు 33 శాతానికి పడిపోవడం గమనార్హం. ఇప్పటికిప్పుడు లోక్‌సభ ఎన్నికలు జరిగితే ఎన్డీఏ కూటమి 99 సీట్లు కోల్పోనుందని సర్వే అంచానా వేసింది. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుందని తేల్చింది. (రానున్నది ‘హంగ్’!) -
ఆ ముగ్గురు కలిస్తే.. మోదీ అవుట్!
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కూటమితో అఖిలేశ్ యాదవ్, మాయావతి, మమతా బెనర్జీ చేతులు కలిపితే నరేంద్ర మోదీ పదవికి ముప్పు వాటిల్లే అవకాశముంది. ఎస్పీ, బీఎస్పీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలను కలుపుకుని సమిష్టిగా పోటీ చేస్తే కమలం పార్టీకి కష్టాలు తప్పవని ఇండియా టుడే- కార్వీ ఇన్సైట్స్ నిర్వహించిన ‘మూడ్ ఆఫ్ ది నేషన్ పోల్’లో వెల్లడైంది. ఇప్పటికిప్పుడు లోక్‌సభ ఎన్నికలు జరిగితే ఎస్పీ, బీఎస్పీ, తృణమూల్ కాంగ్రెస్‌లతో కూడిన యూపీఏ కూటమి 269 సీట్లు గెల్చుకుంటుందని అంచనా వేసింది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకు 219 స్థానాలు దక్కుతాయి. ఇతరులు 55 సీట్లతో సరిపెట్టుకోవాల్సి ఉంటుంది. ఓట్ల శాతం పరంగా చూస్తే యూపీఏ 44, ఎన్డీఏ 35, ఇతరులు 21 శాతం ఓట్లు దక్కించుకుంటారు. (ఏపీలో వైఎస్సార్ సీపీ ప్రభంజనం) నరేంద్ర మోదీ మళ్లీ అధికారంలోకి రాకుండా ఉండాలంటే యూపీఏతో ఎస్పీ, బీఎస్పీ, తృణమూల్ కాంగ్రెస్ తప్పనిసరిగా చేతులు కలపాల్సివుంటుంది. ఇవన్నీ కలిసినా ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మేజిక్ ఫిగర్ (272)కు మూడు స్థానాల దూరంలో నిలిచిపోతాయని సర్వే విశ్లేషించింది. అఖిలేశ్ యాదవ్, మాయావతి, మమతా బెనర్జీలను రాహుల్ గాంధీ ఒప్పిస్తారా, లేదా అనే దానిపై యూపీఏ విజయం ఆధారపడి ఉంటుందని స్పష్టం చేసింది. బీజేపీని ఓడించేందుకు వీరంతా ఏకతాటిపైకి వస్తారో, లేదో త్వరలోనే తేలనుంది. (తాజా సర్వే... మోదీకి భారీ షాక్) -
తాజా సర్వే... మోదీకి భారీ షాక్
న్యూఢిల్లీ: దేశంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం వస్తుందని సర్వేలో వెల్లడైంది. ఎన్డీఏ కూటమికి మెజారిటీ తగ్గుతుందని ఇండియా టుడే- కార్వీ ఇన్సైట్స్ నిర్వహించిన ‘మూడ్ ఆఫ్ ది నేషన్ పోల్’లో తేలింది. ఈరోజు లోక్‌సభ ఎన్నికలు జరిగితే ఎలాంటి ఫలితాలు వస్తాయనే దానిపై దేశవ్యాప్తంగా ఈ సర్వే నిర్వహించారు. 2014 ఎన్నికలతో పోలిస్తే ఎన్డీఏకు 99 సీట్లు తగ్గే అవకాశముందని సర్వే అంచనా వేసింది. 237 సీట్లు మాత్రమే గెలిచే అవకాశముందని తెలిపింది. గత ఎన్నికలతో పోలిస్తే యూపీఏ కూటమి భారీగా పుంజుకోనుంది. యూపీఏ 166 సీట్లు దక్కించుకునే అవకాశముంది. 2014తో పోలిస్తే యూపీఏకు అదనంగా 106 సీట్లు జతకానున్నయి. ఎన్డీఏ, యూపీఏలో భాగస్వాములు కాని పార్టీలు 140 స్థానాల్లో విజయం సాధిస్తాయని సర్వే తేల్చింది. మొత్తంగా చూస్తే ఎన్డీఏకు 35 శాతం, యూపీఏకు 33 శాతం ఓట్లు పడతాయని అంచనా. (ఏపీలో వైఎస్సార్ సీపీ ప్రభంజనం) త్వరలో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తాజా సర్వే ఫలితాలు కమలనాథులను కలవరపెడుతున్నాయి. రెండోసారి అధికారం దక్కించుకోవాలన్న మోదీ-షా ద్వయానికి ఈ అంచనాలు షాక్ ఇచ్చాయి. అయితే ఎన్డీఏ, యూపీఏతో జట్టు కట్టే పార్టీల ఆధారంగా ఫలితాలు మారే అవకాశముంది. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు కావాల్సిన మేజిక్ ఫిగర్ 272. ఎన్డీఏ, యూపీఏలో భాగస్వాములు కానీ పార్టీలు దేనికి మద్దతు ఇస్తే ఆ కూటమే ప్రభుత్వం ఏర్పాటు చేయగలుగుతుందని సర్వే ద్వారా స్పష్టమైంది. -
మోదీనే అత్యుత్తమ ప్రధాని
ఇండియా టుడే–కార్వీ ఇన్సైట్స్ ‘మూడ్ ఆఫ్ ద నేషన్’ సర్వేలో వెల్లడి ► ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎన్డీయేకు 349 సీట్లు ► ప్రధానిగా మోదీకే 63 శాతం మంది మద్దతు ► అవినీతి రహిత పాలనపైనే సంతృప్తి.. ఉద్యోగ కల్పనపై అసంతృప్తి న్యూఢిల్లీ: స్వతంత్ర భారత చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన ప్రధానిగా నరేంద్ర మోదీకి భారతీయులు పట్టంగట్టారు. ఇండియా టుడే– కార్వీ ఇన్సైట్స్ సంయుక్తంగా నిర్వహించిన మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వే ఈ విషయాన్ని వెల్లడించింది. పెద్దనోట్ల రద్దుతో ప్రజలు ఇబ్బందులు పడ్డా.. నల్లధనంపై మోదీ ప్రయోగించిన అస్త్రంగా ప్రజలు భావించారని పేర్కొంది. ఇప్పటికిప్పుడు దేశంలో ఎన్నికలు వస్తే ఎన్డీయేకు 349 సీట్లు వస్తాయని వెల్లడించింది. అత్యుత్తమ ప్రధానిగా.. సర్వేలో పాల్గొన్న వారిలో ప్రథమ ప్రధాని నెహ్రూ, ఇందిరా గాంధీ, వాజ్‌పేయిల కన్నా మోదీపైనే ఎక్కువ మంది సానుకూలత వ్యక్తం చేశారు. ఐదు సార్లు దేశవ్యాప్తంగా ఈ సర్వే నిర్వహించారు. తాజా (జూలై 2017) ఫలితాల్లో 33శాతంతో మోదీ ముందంజలో ఉన్నారు. ఇందిరా గాంధీ 17శాతంతో రెండో స్థానంలో, వాజ్‌పేయి 9శాతం, నెహ్రూ 8శాతంతో మూడు నాలుగు స్థానాల్లో నిలిచారు. తొలిసారి ఆగస్టు 2015లో జరిగిన సర్వేలో ఇందిర 21 శాతంతో తొలిస్థానంలో ఉండగా.. మోదీ 20 శాతంతో రెండో స్థానం సంపాదించారు. దేశంలో పన్నుల సంస్కరణలు తీసుకొచ్చి జీఎస్టీని అమల్లోకి తేవటం ద్వారా లంచం, పన్ను ఎగవేతలకు మోదీ చెక్ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. హవా కొనసాగితే 2019లోనూ.. ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికలు జరిగితే 349 సీట్లు ఎన్డీయే ఖాతాలో చేరతాయన్న సర్వే.. ఇదే జోరు కొనసాగితే 2019లోనూ ఇదే కూటమి అధికారాన్ని నిలుపుకుంటుందని పేర్కొంది. బిహార్ సీఎం నితీశ్ కుమార్ మహాకూటమి నుంచి బయటకు రాకముందే ఈ సర్వే జరిగింది. అయితే.. తర్వాత పరిణామాలతో ఎన్డీయేకు 400 సీట్ల రావొచ్చని సర్వే అభిప్రాయపడింది. తాజా సర్వే వివరాల ప్రకారం యూపీఏకు 75, ఇతర విపక్షాలకు 119 సీట్లు వస్తున్నాయి. మోదీ పాపులారిటీతో బీజేపీ 298 స్థానాల్లో విజయం సాధిస్తుందని సర్వే వెల్లడించింది. పశ్చిమ, ఉత్తర భారత్‌లలోనే బీజేపీ 249 సీట్లు పొందనుండగా.. తూర్పు, దక్షిణ భారత్‌లో 107 (286 స్థానాలకు గానూ) స్థానాలు దక్కనున్నాయి. దక్షిణ భారతదేశంలో ఎన్డీయే, యూపీయేతర పార్టీలకే ఎక్కువ సీట్లు వస్తాయని సర్వేలో తేలింది. అవినీతి రహిత పాలనతోనే! సర్వేలో వివిధ అంశాలపై ప్రజలు తమ స్పందన తెలిపినా.. అవినీతి రహిత పాలనే నరేంద్ర మోదీ ప్రభుత్వం సాధించిన అతిపెద్ద విజయంగా అత్యధికులు అభిప్రాయపడ్డారు. స్వచ్ఛ్ భారత్, పాకిస్తాన్‌పై సర్జికల్ దాడులు, మౌలికవసతుల కల్పన, పేదలు, రైతుల అనుకూల పథకాలు కూడా మోదీపై ప్రజాభిమానానికి కారణాలుగా సర్వే వెల్లడించింది. అందుకే దేశవ్యాప్తంగా 63 శాతం మంది ప్రధానిగా మోదీకే పట్టంగట్టగా.. కేవలం 12 శాతం మంది మాత్రం అసంతృప్తి వ్యక్తం చేశారు. 23 శాతం మంది కేంద్రపాలన పర్వాలేదన్నారు. మోదీ ప్రభుత్వం ఎలా పనిచేస్తుందంటూ సర్వే అడిగిన ప్రశ్నల్లో 24 శాతం మంది.. ప్రధాని ధైర్యంగా నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం నచ్చిందని పేర్కొన్నారు. అయితే 23 శాతం మంది మోదీవి మాటలే తప్ప చేతలు కనిపించటం లేదని అభిప్రాయపడ్డారు. పేదలు, రైతుల పక్షపాతి అని 15 శాతం, మైనారిటీ వ్యతిరేకి అని 12 శాతం మంది అభిప్రాయపడ్డారు. బీజేపీ, ఆరెస్సెస్‌లలో మోదీకి ఎవరు సరైన పోటీ అని అడిగిన ప్రశ్నకు 13 శాతం మంది యోగి ఆదిత్యనాథ్‌కు ఓటేయగా.. కేంద్ర మంత్రులు సుష్మ, జైట్లీ, రాజ్‌నాథ్‌లు చెరో 10 శాతం ఓట్లు సంపాదించారు. నిరుద్యోగం ఓ హెచ్చరిక ఈ సర్వే ఎన్డీయేకు, బీజేపీకి సానుకూల పవనాలను చూపించటంతోపాటుగా ప్రజల్లో పలు అంశాలపై ఉన్న అసంతృప్తినీ గుర్తుచేసింది. ఉద్యోగకల్పనపై ప్రజల్లో ఆందోళన ప్రభుత్వానికి హెచ్చరికగా పేర్కొంది. ఆగస్టు 2015లో సర్వే మొదలైనప్పటినుంచీ తాజా సర్వే (జూలై 2017) వరకు ఉద్యోగ కల్పనకు ప్రభుత్వం పెద్దగా చేసిందేమీ లేదనే అభిప్రాయం వ్యక్తమైంది. ప్రధాని కూడా యువకులు ఉద్యోగం కోసం వెతకటం కన్నా స్వయం ఉపాధితోపాటుగా ఉద్యోగాలు సృష్టించే ఆలోచన చేయాలని చెబుతూ వస్తున్నారు. ఇందుకోసం పలు పథకాలనూ ఆయన ప్రారంభించారు. వీటి ఫలితం వచ్చే ఎన్నికల వరకు కనబడితే యువతలో అసంతృప్తి దూరం అవుతుందని సర్వే పేర్కొంది. అటు 2014 ప్రచారంలో మోదీ చెప్పిన అచ్ఛేదిన్‌పై 39 శాతం మంది సానుకూలత, 34 శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేశారు.