
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రుల్లో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి మూడోస్థానంలో నిలిచారు. జులై 15 నుంచి 27 మధ్య ఇండియా టుడే మూడ్ ఆఫ్‌ది నేషన్ నిర్వహించిన సర్వేలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. కాగా.. అత్యంత ప్రజాదరణ కలిగిన సీఎంలలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌కు ప్రథమ స్థానం దక్కగా.. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ రెండో స్థానంలో నిలిచారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ తొమ్మిదో స్థానంలో నిలిచారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(4), ఇతరులు(5), బిహార్ సీఎం నితీశ్‌కుమార్(6), మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే(7), ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్(8), రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లట్(10) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. 19 రాష్ట్రాల్లోని 97 లోక్‌సభ నియోజకవర్గాల్లో ఈ సర్వే జరిగింది. జులై 15 నుంచి 27 మధ్య 12,021 మందితో టెలిఫోన్ ఇంటర్వ్యూ ద్వారా అభిప్రాయాలు సేరరించారు. (సామాజిక ఆసుపత్రుల్లోనూ ఆక్సిజన్ బెడ్లు)
Comments
Please login to add a commentAdd a comment