ఆ సర్వేలో సల్మాన్‌దే టాప్‌ప్లేస్‌! | Salman Khan In Top Place In MOTN Survey | Sakshi
Sakshi News home page

Jan 29 2019 4:00 PM | Updated on Jan 29 2019 5:04 PM

Salman Khan In Top Place In MOTN Survey - Sakshi

వరుస బ్లాక్‌బస్టర్‌ హిట్‌లతో దూసుకుపోతూ, బుల్లితెరపై బిగ్‌బాస్‌గా తన దూకుడును ప్రదర్శించే సల్మాన్‌.. ఓ సర్వేలో టాప్‌ప్లేస్‌ను దక్కించుకుని నిజంగానే బిగ్‌బాస్‌ అనిపించుకున్నాడు. ఇండియా టుడే ఏటా నిర్వహించే మూడ్‌ ఆఫ్‌ ది నేషన్‌ సర్వేలో బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ఖాన్‌ టాప్‌ప్లేస్‌లో నిలిచాడు. గతేడాది రేస్‌3తో బాలీవుడ్‌ను పలకరించాడీ భాయీజాన్‌. ఇక నిత్యం అభిమానులతో టచ్‌లో ఉండే సల్లూ భాయ్‌ 9శాతం ఓట్లతో టాప్‌ప్లేస్‌లో ఉన్నాడని పేర్కొన్నారు.

గత మూడేళ్లలో సల్మాన్‌ ఖాన్‌కు సింగిల్‌ డిజిట్‌(9) రావడం ఇదే తొలిసారి అని, అయినా సల్మానే టాప్‌ ప్లేస్‌లో దూసుకుపోతున్నాడని ఆ సంస్థ పేర్కొంది. ఇక సల్మాన్‌ తరువాతి స్థానంలో అక్షయ్‌ కుమార్‌(7%), అమితాబ్‌ బచ్చన్‌ (7%), షారుఖ్‌ ఖాన్‌(7%), రణ్‌వీర్‌సింగ్‌(5%) ఉన్నారు. అక్షయ్‌ కుమార్‌ ప్యాడ్‌మ్యాన్‌, గోల్డ్‌ సినిమాలతో సక్సెస్‌ సాధించారు. షారుఖ్‌ ఖాన్‌ గతకొంతకాలంగా బాక్సాఫీస్‌ వద్ద బోల్తాకొడుతున్నా సర్వేలో మాత్రం ముందున్నారు. ఇక రణ్‌వీర్‌-దీపికా వెడ్డింగ్‌, సింబా సినిమాలతో బాలీవుడ్‌లో రణ్‌వీర్‌ టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారాడు. 

ఇక గతేడాది పద్మావత్‌ సినిమాతో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కొట్టిన దీపికా పదుకునే.. సూయిధాగా, జీరో సినిమాల్లో నటించి విమర్శల ప్రశంసలుపొందిన అనుష్క శర్మ ఈ సర్వేలో బెస్ట్‌ హీరోయిన్స్‌గా 9శాతం ఓట్లతో టాప్‌ ప్లేస్‌ను దక్కించుకున్నారు. బాక్సాఫీస్‌ హిట్‌ లేకపోయినా కత్రినా, గతకొంతకాలంగా బాలీవుడ్‌లో సినిమాలు చేయకపోయినా ప్రియాంక చోప్రాలు 8శాతం ఓట్లతో ఈ సర్వేలో తరువాతి స్థానంలో ఉన్నారు. చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయం సాధించిన రాజీ సినిమాతో అలియాభట్‌ మంచి నటిగా గుర్తింపు పొందారు. ఈ సర్వేలో 5 శాతం ఓట్లు సంపాదించిన అలియా ప్రస్తుతం బ్రహ్మాస్త్ర సినిమాతో బిజీగా ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement