
ముంబై : ‘ఛపాక్’ సినిమా ప్రమోషన్‌లో బిజీబిజీ ఉన్న బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే సల్మాన్‌ఖాన్‌తో జోడీ కట్టేందుకు సిద్ధం అంటున్నారు. సరైన కథ లభిస్తే సల్లూ భాయ్‌తో సినిమా చేస్తానని తన మనసులోని మాటను బయటపెట్టారు. తామిద్దం కలిసి నటిస్తే చూడాలని అభిమానులు కోరుకుంటున్నారనీ, తనకు కూడా ఆయనతో నటించాలని ఇష్టంగా ఉందని దీపికా వెల్లడించారు. కండల వీరుడి ‘హమ్ దిల్ దే చుకే సనం’ సినిమా అంటే తనకెంతో ఇష్టమని దీపికా పేర్కొన్నారు. అయితే, సల్మాన్ ఇదివరకు చేయని పాత్రల్లో నటిస్తే చూడాలని ఉందని ఈ ఛపాక్ హీరోయిన్ అన్నారు. అన్నిటీకి కథే ముఖ్యమని చెప్పుకొచ్చారు.
(చదవండి : మీరు పర్మిషన్ ఇస్తే ప్లాన్ చేసుకుంటాం..)
మరి‘ఛపాక్’ ప్రమోషన్ కోసం సల్మాన్ హోస్ట్‌గా వ్యవరిస్తున్న బిగ్‌బాస్ షోకు వెళ్తారా అన్న ప్రశ్నకు.. ‘బిగ్‌బాస్ షోకు వెళ్లడం లేదు. అలాంటివేం అనుకోలేదు’అని దీపికా బదులిచ్చారు. మేఘనా గుల్జార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఛపాక్’ వచ్చే శుక్రవారం (జనవరి 10) విడుదలవనున్న సంగతి తెలిసిందే. దీంతోపాటు శకున్ బత్రా దర్శకత్వంలో గల్లీ భాయ్ ఫేం సిద్ధాంత్ చతుర్వేదీ, అనన్య పాండేతో కలిసి చేయబోయే సినిమా మార్చిలో ప్రారంభమవుతుందని దీపికా తెలిపారు.
(చదవండి : లక్ష్మీతో కలిసి దీపిక టిక్‌టాక్ వీడియో!)
Comments
Please login to add a commentAdd a comment