మోదీ కేబినెట్‌లో అత్యుత్తమ మంత్రి ఎవరు? | What People Said About Modi Government In Mood Of The Nation Survey | Sakshi
Sakshi News home page

మోదీ ప్రభుత్వ పనితీరుపై ప్రజలు ఏమన్నారంటే!?

Published Sat, Aug 8 2020 11:10 AM | Last Updated on Sat, Aug 8 2020 12:30 PM

What People Said About Modi Government In Mood Of The Nation Survey - Sakshi

న్యూఢిల్లీ: మహమ్మారి కరోనా కట్టడిలో మోదీ సర్కారు విజయవంతమైందా? వాస్తవాధీన రేఖ వెంబడి ఉద్రిక్తతలు సృష్టిస్తున్న చైనాకు దీటుగా జవాబు ఇచ్చిందా? ఆర్థిక వ్యవస్థ పట్ల ప్రజలు సంతోషంగానే ఉన్నారా? ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యలు ఏమిటి? ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే ప్రజలు ఎవరికి ఓటేస్తారు? మోదీ కేబినెట్‌లో అత్యుత్తమ మంత్రి ఎవరు? తదితర అంశాల్లో ‘మూడ్‌ ఆఫ్‌ ది నేషన్‌’ పేరిట ఇండియా టుడే- కార్వీ ఇన్‌సైట్స్‌ నిర్వహించిన సర్వేలో వెల్లడైన ఫలితాలు, ప్రజాభిప్రాయానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.(మరోసారి ప్రధాని మోదీకి పట్టంకట్టిన ప్రజలు!)

ప్రధానిగా నరేంద్ర మోదీ పనితీరు ఎలా ఉంది?
బాగుంది- 48 శాతం
అత్యద్భుతం- 30 శాతం
పర్లేదు- 17 శాతం
బాగోలేదు- 5 శాతం

ఎన్డీయే ప్రభుత్వం పనితీరుపై మీ అభిప్రాయం?
సంతృప్తికరం- 48శాతం
చాలా సంతృప్తిగా ఉన్నాం- 24 శాతం
బాగుందని లేదా బాలేదని చెప్పలేం- 19 శాతం
సంతృప్తికరంగా లేదు- 8 శాతం
అసలేమీ చెప్పలేం- 1 శాతం

మోదీ సర్కారు సాధించిన అతిపెద్ద విజయం ఏమిటని భావిస్తున్నారు?
1. ఆర్టికల్‌ 370 రద్దు- 16 శాతం మంది
2. రామ మందిర నిర్మాణంపై సుప్రీంకోర్టు తీర్పు-13 శాతం
3. మౌలిక సదుపాయాల కల్పనలో అభివృద్ధి- 11 శాతం
4. అవినీతి రహిత పాలన- 9 శాతం
5. నల్లధన నిర్మూలన- 9 శాతం
6. కోవిడ్‌-19 వ్యాప్తిని కట్టడి చేస్తున్న తీరు-7 శాతం
7. పేద, బలహీన వర్గాల, రైతు సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలు- 6 శాతం
8. నోట్ల రద్దు- 6 శాతం
9. జీఎస్టీ విధానం- 5 శాతం
వీటితో పాటు స్వచ్చ భారత్‌(3 శాతం), మహిళా సాధికారికత(2 శాతం), మేకిన్‌ ఇండియా(2 శాతం) తదితర అంశాలను కూడా కొంత మంది మోదీ ప్రభుత్వ విజయంగా పేర్కొన్నారు. 

మోదీ ప్రభుత్వం అతిపెద్ద వైఫల్యం ఏమిటి?
1. మహమ్మారి కరోనాను కట్టడి చేయలేకపోవడం- 25 శాతం
2. నిరుద్యోగం- 23 శాతం
3. లాక్‌డౌన్‌ కాలంలో వలస జీవులను ఆదుకోలేకపోవడం- 14 శాతం
4. ధరల పెరుగుదల- 11 శాతం
5. ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయలేకపోవడం- 7 శాతం
6. ఆరోగ్య రంగాన్ని నీరుగార్చడం- 6 శాతం
7. రైతులను పట్టించుకోకపోవడం- 6 శాతం
8. తెలియదు, చెప్పలేం- 4 శాతం
9. చైనా, పాక్‌, నేపాల్‌లతో సత్సంబంధాల విషయంలో- 1 శాతం
వీటితో పాటు జమ్మూ కశ్మీర్‌లో అశాంతి(1 శాతం), పౌరసత్వ సవరణ చట్టం నిరనసలు(1 శాతం) తదితర అంశాలను మోదీ సర్కారు వైఫల్యాలుగా పేర్కొన్నారు.

మోదీ కేబినెట్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తున్న మంత్రి ఎవరు?
1. అమిత్‌ షా- 39 శాతం
2. రాజ్‌నాథ్‌ సింగ్‌- 17
3. ఇతరులు- 14 
4. నితిన్‌ గడ్కరీ- 10
5. నిర్మలా సీతారామన్‌- 9
6. రవిశంకర్‌ ప్రసాద్‌-3 
7. ధర్మేంద్ర ప్రధాన్‌- 2
8. స్మృతి ఇరానీ- 2 శాతం
9. ఎస్‌. జైశంకర్‌- 1 శాతం

అయితే జనవరి 2020తో పోలిస్తే ఈ విషయంలో అమిత్‌ షాకు 4 శాతం మేర తక్కువ ఓట్లు పడటం గమనార్హం. అదే విధంగా రాజ్‌నాథ్‌ సింగ్‌(39- 17), నితిన్‌ గడ్కరీ (34-10), నిర్మలా సీతారామన్‌(26-9) పనితీరుపై ప్రజలు భారీ స్థాయిలో విశ్వాసం కోల్పోయినట్లు సర్వే ద్వారా వెల్లడైంది.

భారత్‌ ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య?
1. కోవిడ్‌-19 మహమ్మారి- 70 శాతం
2. నిరుద్యోగం- 12 శాతం
3. చైనాతో విభేదాలు, ఆర్థికాభివృద్ధి నెమ్మదించడం- 4 శాతం
వీటితో పాటు ద్రవ్యోల్బణం(3 శాతం), అవినీతి, దేశంలో పెరుగుతున్న అసహనం(1 శాతం) తదితర అంశాలను కూడా అతిపెద్ద సమస్యలుగా పేర్కొన్నారు.

ఈరోజే లోక్‌సభ ఎన్నికలు నిర్వహిస్తే మీరు ఏ పార్టీకి ఓటేస్తారు?
1. బీజేపీ- 283(సీట్లు) 
2.కాంగ్రెస్‌- 49
3. ఇతరులు- 211

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement