వచ్చే ఎన్నికల్లో యూపీలో హంగ్!
లక్నో: దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లో అధికారం సాధించాలన్న బీజేపీ కల సాకారమవుతుందా? అధికార సమాజ్వాదీ పార్టీ మళ్లీ మెజారిటీ సాధిస్తుందా? అంటే యాక్సిస్-ఇండియా టుడే సర్వే ప్రకారం ఈ రెండూ జరగకపోవచ్చు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరిగే ఉత్తరప్రదేశ్లో హంగ్ ఏర్పడుతుందని సర్వేలో తేలింది. గత లోక్సభ ఎన్నికల్లో యూపీలో దాదాపు క‍్లీన్ స్వీప్ చేసిన బీజేపీ.. అసెంబ్లీ ఎన్నికల్లో జోరు తగ్గినా అతిపెద్ద పార్టీగా అవతరించనుంది.
మొత్తం 403 అసెంబ్లీ సీట్లున్న యూపీలో అధికారం సాధించాలంటే 202 మంది ఎమ్మెల్యేలు అవసరం. ఇండియా టుడే సర్వే ప్రకారం బీజేపీ 170 నుంచి 183 సీట్లు గెలిచే అవకాశముంది. ఇక అధికార సమాజ్వాదీ పార్టీకి పరాజయం తప్పకపోవచ్చు. ఎస్పీ 94-103 సీట్లు గెలిచి మూడో స్థానంలో నిలవనుంది. ఇక బీఎస్పీ 115 నుంచి 124 సీట్లు సాధించే అవకాశముంది. కాంగ్రెస్కు 8 నుంచి 12, ఇతరులకు 2 నుంచి 6 సీట్లు రావచ్చు.