Jharkhand Governor
-
జార్ఖండ్‌లో ఉత్కంఠకు తెర
రాంచీ: జార్ఖండ్‌లో ఉత్కంఠకు తెరపడింది. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ రాజీనామా చేసి 24 గంటలు గడిచిపోయిన తర్వాత కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు అడుగులు పడ్డాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని జేఎంఎం శాసనసభాపక్ష నేత చంపయ్ సోరెన్‌ను జార్ఖండ్ గవర్నర్ సి.పి.రాధాకృష్ణన్ గురువారం రాత్రి ఆహ్వానించారు. ప్రమాణ స్వీకారం అనంతరం అసెంబ్లీలో 10 రోజుల్లోగా బలనిరూపణ చేసుకోవాలని ఆదేశించారు. జార్ఖండ్ కొత్త ముఖ్యమంత్రిగా చంపయ్ సోరెన్ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై తొలుత సందిగ్ధత నెలకొంది. గవర్నర్ నుంచి పిలుపు రాకపోవడంతో జేఎంఎం–కాంగ్రెస్–ఆర్జేడీ కూటమి నేతలు ఆందోళనకు గురయ్యారు. ప్రభుత్వ ఏర్పాటుకు తాము సిద్ధంగా ఉన్నట్లు చంపయ్ సోరెన్ మరోసారి స్పష్టం చేశారు. ఆయన గురువారం సాయంత్రం రాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్‌ను కలిశారు. తమకు మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతు ఉందని, ప్రభుత్వ ఏర్పాటుకు ఆహా్వనించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన వెంట జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ, సీపీఐ(ఎంఎల్) ఎమ్మెల్యేలు ఉన్నారు. గవర్నర్‌తో భేటీ అనంతరం చంపయ్ సోరెన్ మీడియాతో మాట్లాడారు. కొత్త ప్రభుత్వాన్ని కొలువుదీర్చే విషయంలో త్వరలో నిర్ణయం తీసుకుంటామని గవర్నర్ చెప్పారని వెల్లడించారు. గవర్నర్‌ను చంపయ్ సోరెన్ కలవడానికి కంటే ముందు జేఎంఎం–కాంగ్రెస్–ఆర్జేడీ కూటమి ఓ వీడియోను విడుదల చేసింది. చంపయ్‌కి మద్దతిస్తున్న 43 మంది ఎమ్మెల్యేలు ఈ వీడియోలో కనిపించారు. మరోవైపు, బీజేపీ బారి నుంచి తమ ఎమ్మెల్యేలను కాపాడుకోవడంపై దృష్టి పెట్టారు. 43 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పాలిత తెలంగాణ రాజధాని హైదరబాద్‌కు గురువారం రెండు ప్రత్యేక విమానాల్లో తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. వారిని గచ్చిబౌలీలోని ఎల్లా హోటల్‌కు చేర్చాలని నిర్ణయించారు. అయితే, ప్రతికూల వాతావరణం కారణంగా చివరి నిమిషంలో రాంచీ నుంచి ప్రత్యేక విమానాల టేకాఫ్‌కు ఎయిర్‌పోర్టు అధికారుల నుంచి అనుమతి లభించలేదు. రెండు గంటలపాటు విమానాల్లోనే కూర్చుండిపోయిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు చేసేది లేక సర్క్యూట్ హౌజ్‌కు తిరిగివచ్చారు. వీరిలో హేమంత్ సోరెన్ సోదరుడు, ఎమ్మెల్యే బసంత్ సోరెన్ కూడా ఉన్నారు. నూతన ప్రభుత్వ ఏర్పాటులకు ఎట్టకేలకు గవర్నర్ నుంచి ఆహా్వనం రావడంతో ఊహాగానాలకు తెరపడింది. రాంచీ జైలుకు హేమంత్ సోరెన్ మనీ లాండరింగ్ కేసులో అరెస్టయిన జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) నేత, మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ను అధికారులు రాంచీలోని హొత్వార్ జైలుకు తరలించారు. ఈడీ అధికారులు ఆయనను బుధవారం 7 గంటల సుదీర్ఘ విచారణ తర్వాత అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. గురువారం రాంచీలోని ‘ప్రత్యేక మనీ లాండరింగ్ నిరోధక చట్టం కోర్టు’లో సోరెన్‌ను ప్రవేశపెట్టారు. తదుపరి విచారణ నిమిత్తం 10 రోజులపాటు ఆయనను తమ కస్టడీకి అప్పగించాలని కోరారు. ఈ మేరకు పిటిషన్ దాఖలు చేశారు. రాంచీలో 8.5 ఎకరాల భూములు అక్రమంగా సోరెన్ ఆ«దీనంలో ఉన్నాయని, అందుకే మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద దర్యాప్తు ప్రారంభించామని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై న్యాయస్థానం తమ తీర్పును శుక్రవారానికి రిజర్వ్ చేసింది. సోరెన్‌ను ఒకరోజుపాటు జ్యుడీíÙయల్ కస్టడీకి తరలిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దాంతో అధికారులు ఆయనను జైలుకు తరలించారు. గురువారం రాత్రంతా సోరెన్ జైలులో గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. సుప్రీంకోర్టులో సోరెన్ పిటిషన్ తన అరెస్టు అక్రమమంటూ సోరెన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం çశుక్రవారం విచారణ చేపట్టనుంది. -
జార్ఖండ్ సంక్షోభంలో కీలక పరిణామం.. గవర్నర్‌తో యూపీఏ నేతల భేటీ!
రాంచీ: జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ శాసనసభ్యత్వం రద్దుపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. కేంద్ర ఎన్నికల సంఘం పంపిన లేఖపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు ఆ రాష్ట్ర గవర్నర్ రమేశ్ బయాస్. సంక్షోభం కొనసాగుతున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ నేతృత్వంలోని అధికార యూపీఏ కూటమి గవర్నర్‌ను కలిసేందుకు సిద్ధమైంది. అధికార కూటమి నేతలు గురువారం సాయంత్రం 4 గంటలకు అపాయింట్మెంట్ తీసుకున్నట్లు జేఎంఎం పార్టీ వర్గాలు తెలిపాయి. మరోవైపు.. గవర్నర్‌కు సీఎం హేమంత్ సోరెన్ సైతం ఫోన్ చేసినట్లు పేర్కొన్నాయి. గవర్నర్‌తో జేఎంఎం-కాంగ్రెస్ కూటమి నేతల భేటీతో రాజకీయ సంక్షోభానికి తెరపడనుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యమంత్రిపై ఆరోపణలు వచ్చిన క్రమంలో రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం తలెత్తింది. ఈ నేపథ్యంలో బేరసారాల నుంచి తమ ఎమ్మెల్యేలను కాపాడుకొనేందుకు అధికార యూపీఏ 32 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌కు గత మంగళవారం తరలించింది. గవర్నర్‌ను కలవనున్న నేపథ్యంలో వారు రాంచీకి రానున్నట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: కొనుగోలు అనుమానాలు.. ఎమ్మెల్యేలను రాష్ట్రం దాటించిన కాంగ్రెస్ -
రాష్ట్రపతి రేసులో ద్రౌపది ముర్ము
-
రాష్ట్రపతి రేసులో ద్రౌపది ముర్ము
భువనేశ్వర్: భారత రాష్ట్రపతి పదవి కోసం ఒడిశా రాష్ట్రానికి చెందిన దళిత వర్గం మహిళా నాయకురాలు, జార్ఖండ్ గవర్నర్ ద్రౌపది ముర్ము ఉత్సాహం కనబరుస్తున్నారు. భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పదవీకాలం ఈ ఏడాది జూలై 25తో ముగియనుంది. తదుపరి రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక కోసం ప్రధాన పార్టీలు అభ్యర్థుల ఎంపిక సన్నాహాలు ఊపందుకుంటున్నాయి. ఎన్డీఏ కూటమి వర్గాల నుంచి రాష్ట్రపతి పదవిపట్ల ఔత్సాహికుల జాబితా బలం పుంజుకుంటోంది. ఈ పరిస్థితుల్ని అనుకూలంగా మలచుకునేందుకు జార్ఖండ్ గవర్నర్‌గా కొనసాగుతున్న ద్రౌపది ముర్ము కృషి చేస్తున్నారు. ఆమె దళిత మహిళ కావడంతో అవకాశాలు మెండుగా ఉంటాయని భావిస్తున్నారు. 2015, మే 18 నుంచి ద్రౌపది ముర్ము జార్ఖండ్ గవర్నర్‌గా కొనసాగుతున్నారు. జార్ఖండ్‌లో తొలి మహిళా గవర్నర్‌గా ఆమె చరిత్ర సృష్టించారు. రాష్ట్రంలోని మయూర్భంజ్ జిల్లా బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలుగా బాధ్యతలను గతంలో విజయవంతంగా నిర్వహించారు. రాష్ట్రశాసన సభకు వరుసగా 2 సార్లు ఆమె ఎన్నికయ్యారు. రాష్ట్రంలో బిజూ జనతాదళ్, భారతీయ జనతా పార్టీ కూటమి సర్కారులో ఆమె మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. -
రాష్ట్రపతి రేసులో జార్ఖాండ్ గవర్నర్
-
జార్ఖండ్ గవర్నర్ కు మోదీ విషెస్
న్యూఢిల్లీ: జార్ఖండ్ గవర్నర్ ద్రౌపది ముర్ముకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇవాళ (శనివారం జూన్ 20) జార్ఖండ్ రాష్ట్రానికి తొలి మహిళా గవర్నర్‌గా నియమితులైన ద్రౌపది ముర్ము బర్త్ డే. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ద్రౌపది ముర్ము మే 18న జార్ఖండ్ రాష్ట్ర గవర్నర్‌గా నియమితులయ్యారు. ఒడిశా నుంచి ఆమె రెండుసార్లు ఎమ్మెల్యేగా బీజేపీ తరఫున గెలిచారు. బీజేపీ మద్దతుగా బిజు పట్నాయక్, నవీన్ పట్నాయక్ కేబినెట్లో ఆమె మంత్రిగా పని చేశారు.