మనీ ల్యాండరింగ్ కేసులో జైలు శిక్షను అనుభవిస్తున్న జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ గత వారం బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై జార్ఖండ్ ప్రత్యేక పీఎంఎల్ఏ (ప్రివెంటివ్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్) కోర్టు ఈ రోజు విచారణ చేపట్టింది.
లోక్‌సభ ఎన్నికల ప్రచారం చేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను ఈడీ ప్రత్యుత్తరం ఇచ్చేందుకు తమకు రెండు వారాలు సమయం కావాలని కోరింది. అయితే ఈడీ నిర్ణయాన్ని సోరెన్ తరుపు న్యాయవాదులు కపిల్ సిబల్, అరుణాభ్ చౌదరి తప్పుబట్టారు.
రెండు వారాల సమయం వల్ల తన క్లయింట్ ఎన్నికల ప్రచారానికి దూరం కావాల్సి వస్తుందని వాదించారు. ఇరుపక్ష వాదనలు విన్న కోర్టు సోరెన్ బెయిల్ పిటిషన్‌పై ప్రత్యుత్తరం ఇచ్చేందుకు ఈడీకి వారం రోజుల గడువు మాత్రమే ఇచ్చింది. ఈ కేసులో తదుపరి విచారణను మే 1న చేపట్టనుంది.
మనీల్యాండరింగ్ కేసుకు సంబంధించి సోరెన్‌ను ఈడీ జనవరి 31న అరెస్ట్ చేసింది. ప్రస్తుతం ఆయన రాంచీలోని బిర్సా ముండా సెంట్రల్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment