సాక్షి, న్యూఢిల్లీ : జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. సీఎంగా ప్రమాణం చేసిన అనంతరం.. ప్రధానితో సమావేశం కావడం ఇదే తొలిసారి. ఇటీవల వెలువడిన జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి.. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన సోరేన్‌కు తొలుత ప్రధాని మోదీ ప్రత్యేక అభినందనలు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం నుంచి సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు. ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న విషయం తెలిసిందే. భేటీ సందర్భంగా సోరెన్ రాష్ట్రంలోని పలు సమస్యలను మోదీ దృష్టికి తీసుకెళ్లారు. పెండింగ్‌లో ఉన్న పలు ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేయాలని కోరినట్లు తెలిసింది. గిరిజన రాష్ట్రానికి ప్రత్యేక నిధులు కేటాయించాలని ప్రధానికి విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. భేటీ అనంతరం సోరెన్ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర సమస్యలపై ప్రధానితో మరోసారి సమావేశవుతానని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment