న్యూఢిల్లీ: కరోనా కట్టడికి ఇక విధిలేక లాక్‌డౌన్ విధిస్తున్నట్లు జార్ఖండ్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఏప్రిల్ 22 నుంచి ఏప్రిల్ 29 తేదీ వరకు రాష్ట్రంలో సంపూర్ణ లాక్‌డౌన్ నిబంధలను అమల్లో ఉంటాయని ప్రకటించింది. అయితే ‘స్వస్థ్యా సూరక్షా సప్తా(వారం రోజుల పాటు లాక్‌డౌన్)' సందర్భంగా, అవసరమైన సేవలు మాత్రమే కొనసాగుతాయని, మిగతా అన్ని దుకాణాలు మూసివేయబడతాయని ఉత్తర్వులు జారీ చేసింది. ఇది వరకే మహరాష్ట్ర ప్రభుత్వం కరోనా మరణ మృదంగాన్ని తట్టుకోలేక లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఇప్పడు రెండో రాష్ట్రంగా జార్ఖండ్ ఈ నిర్ణయం తీసుకుంది. కరోనా కట్టడికి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా ఈ మహమ్మారి అదుపులోకి రాకపోవడంతో చివరి అస్త్రంగా ఈ ప్రభుత్వాలు లాక్‌డౌన్‌కే మొగ్గు చూపాయి.
ఆంక్షలు.. మినహాయింపులు..
ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో లాక్‌డౌన్‌కు సహకరించాలని జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ప్రజలను కోరారు. లాక్డౌన్ ప్రకటించిన అనంతరం ఆయన మాట్లాడుతూ... రాష్ట్రంలో మహమ్మారి వైరస్ వ్యాప్తిని తప్పక అడ్డకోవాల్పిన పరిస్థితి ఏర్పడింది కనుక ప్రభుత్వం, ప్రజలు ఒక్కటై మహమ్మారిని అంతం చేయాలని సూచించారు. జార్ఖండ్ ఒక పేద రాష్ట్రం. ఈ రాష్ట్రానికి ప్రధాన ఆస్తులు మా ప్రజలు. వారిని కాపాడటమే మా ప్రథమ బాధ్యతని తెలిపారు. కనుక ప్రతి ఒక్కరూ స్వస్థ్యా సూరఖ్సా సప్తాకు కట్టుబడి ఉండాలిని సూచించారు.
కాగా రాష్ట్రంలో దేవాలయాలు, మతపరమైన ప్రదేశాలు తెరిచి ఉంటాయి, కాని భక్తులకు అనుమతిలేదు. కొన్ని కేంద్ర, రాష్ట్ర రంగాలు, ప్రైవేట్ కార్యాలయాలు మాత్రమే అనుమతులు ఇచ్చారు. అయితే రాష్ట్రంలో పరిశ్రమలు, నిర్మాణం, వ్యవసాయ, మైనింగ్ రంగంలో కార్యకలాపాలు కొనసాగుతాయి. ఎక్కడైనా ఐదు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు గుంపులుగా ఉండడం నిషేదించారు. గత 24 గంటల్లో రాష్ట్రంలో 4,969 కేసులు, 45 మరణాలు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే ఇప్పటివరకు 1,72,315 కేసులు ఉండగా, మరణాల సంఖ్య 1,547 కు చేరుకుంది.
( చదవండి: సంపూర్ణ లాక్‌డౌన్.. రేపటి నుంచి 1 వరకు )
Comments
Please login to add a commentAdd a comment