అజ్ఞాతం వీడిన సోరెన్‌.. అరెస్టుకు రంగం సిద్ధం? | Missing Jharkhand CM Hemant Soren Reappear Updates | Sakshi
Sakshi News home page

అజ్ఞాతం వీడిన జార్ఖండ్‌ సీఎం సోరెన్‌.. అరెస్టుకు రంగం సిద్ధం?

Published Tue, Jan 30 2024 2:16 PM | Last Updated on Tue, Jan 30 2024 2:51 PM

Missing Jharkhand CM Hemant Soren Reappear Updates - Sakshi

రాంచీ: భూకుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్న జార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ అజ్ఞాతం వీడారు. మంగళవారం మధ్యాహ్నాం రాంచీలో ఆయన ప్రత్యక్షం అయ్యారు. తన అధికార నివాసంలో ఆయన మం‍త్రులు, జేఎంఎం ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. ఈ భేటీకి ఆయన సతీమణి కల్పన కూడా హాజరయ్యారు.  దీంతో తాజా ఊహాగానాలే నిజం కానున్నాయా? అనే అనే చర్చ మొదలైంది. 

మరోవైపు ఆయనకు వ్యతిరేకంగా ఆధారాలు ఉండడంతో అరెస్టుకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఢిల్లీలోని తన నివాసానికి వెళ్లిన సోరెన్‌.. ఆ తర్వాత కనిపించకుండా పోయారు. అయితే ఆయన కోసం అక్కడికి వెళ్లిన ఈడీకి ఎదురు చూపులే మిగిలాయి. ఈ సాయంత్రంలోపు ఆయన అరెస్టు ఉంటుందా? ఉండదా? అనేదానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

ఇదీ చదవండి: 18 గంటలుగా మిస్సింగ్‌.. జరిగింది ఇదే..!

ఇదిలా ఉండగా.. జార్ఖండ్ ముక్తి మోర్చా (JMM) నేతృత్వంలోని సంకీర్ణ కూటమి ఎమ్మెల్యేలంతా రాంచీకి రావడంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. త్వరలో రాష్ట్ర నాయకత్వంలో మార్పు జరగొచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సోరెన్‌ సతీమణికి సీఎం పగ్గాలు అప్పగించే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement