రాంచీ : కరోనాకు సామాన్యులు, ప్రముఖులు అన్న తేడా లేదు. ఇప్పటికే ఎంతోమంది ప్రముఖులు కరోనా బారినపడ్డారు. తాజాగా జార్ఖండ్ ఆరోగ్య శాఖ మంత్రి బన్నాగుప్తాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. గత కొన్ని రోజులుగా తనను కలిసిన వారందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాల్సిందిగా ఆయన అభ్యర్థించారు. అయితే గుప్తాకు అంతకుముందు కాబినెట్ సమావేశంలో పాల్గొనడంతో మిగతా మంత్రులకు సైతం కరోనా భయం పట్టుకుంది. వ్యవసాయ శాఖ మంత్రి బాదల్ పత్రలేఖ్ గుప్తా పక్కనే కూర్చున్నట్లు తెలిపారు.
అంతేకాకుండా గత కొన్ని రోజులుగా గుప్తాకు కరోనా లక్షణాలు ఉన్నా నిర్లక్ష్యంగా మంత్రివర్గ సమావేశానికి హాజరయ్యారని ఆరోపించారు. గుప్తా అవలంభించిన నిర్లక్ష్య ధోరణి వల్ల మిగతా మంత్రులు, ముఖ్యమంత్రులు సైతం స్వీయ నిర్భంధంలోకి వెళ్లాల్సి వచ్చిందని విమర్శించారు. ఆరోగ్యశాఖ మంత్రికి కరోనా అని తేలడంతో వెంటనే ఆయనతో పాటు హాజరైన ఇతర మంత్రులు, ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సెల్ఫ్ క్వారంటైన్‌కి వెళ్లారు. ఇక మరో నాయకుడు ఏజేఎస్‌యూ పార్టీ అధ్యక్షుడు సుదేష్ మహతోకు కూడా కరోనా సోకింంది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే వెల్లడించారు. ప్రజలందరూ సామాజిక దూరం పాటించడం, మాస్క్ ధరించడం వంటి ఖశ్చితమైన నిబంధనలు పాటించాల్సిందిగా ఆయన ఈ సందర్భంగా ప్రజలకు విఙ్ఞప్తి చేశారు. (ఎయిమ్స్‌లో చేరిన అమిత్ షా)
Comments
Please login to add a commentAdd a comment