అన్నారం బ్యారేజీ వద్ద మ్యాప్‌లను పరిశీలిస్తున్న హేమంత్ సోరెన్
కాళేశ్వరం(మంథని) : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మిస్తున్న ‘కాళేశ్వరం’ ప్రాజెక్టుతో సీఎం కేసీఆర్ కల సాకారం అవుతుం దని జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అన్నారు. శుక్రవారం ఉదయం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అన్నారంలో నిర్మిస్తున్న అన్నారం బ్యారేజీ పనులను మంత్రి హరీష్‌రావుతో కలసి పరిశీలించారు. అనంతరం విలేకర్లతో మాట్లాడారు. నిరుపేద రైతుల పంటపొలాలకు ఈ ప్రాజెక్టు ద్వారా సాగునీరందుతుందన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే నిరుపేదలకు ఎంతగానో మేలు జరుగుతుందని తెలిపారు. బీడు భూములన్ని సస్యశామలంగా మారుతాయని ఆశాభావ ం వ్యక్తం చేశారు.ఆయన వెంట కాళేశ్వరం బ్యారేజీ చీప్ ఇంజనీర్ నల్ల వెంకటేశ్వర్లు, అఫ్‌కాన్ కంపెనీ డైరెక్టర్ మల్లికార్జున్‌రావు, ఈఈ మల్లికార్జున్‌ప్రసాద్, డీఈఈ యాదగిరి, అప్‌కాన్ హెచ్‌ఆర్ మేనేజర్ గోవర్ధన బార్గవలు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment