dreem
-
ఎఫ్బీతో అఫ్గాన్ మహిళ కల సాకారం
కాబూల్ : మహిళలకు కనీస హక్కులు కూడా లేని దేశం. మత ఛాందసభావాలు ప్రబలంగా ఉన్న సమాజం. ఆపై అంతర్యు ద్ధం..! ఇలాంటి తీవ్ర ప్రతికూల పరిస్ధితుల్లో ఉన్నత పాఠశాల స్థాయి వరకే చదువుకున్న ఓ మహిళ.. పైచదువులు చదవాలనుకుంది..! నిరక్షరాస్యుడైన భర్త, ఐదేళ్లలోపు ముగ్గురు చిన్నారులు ఉన్నప్పటికీ స్థైర్యం కోల్పోలేదు. పట్టుదలతో చదివి, యూనివర్సిటీ ప్రవేశ పరీక్షల్లో మంచి మార్కులు సంపాదించింది. ఆపై అదృష్టం కలిసి వచ్చింది... ఫేస్బుక్(ఎఫ్బీ) ద్వారా ఆమె కల నెరవేరింది.. యూనివర్సిటీలో చేరింది..! అఫ్గానిస్తాన్‌లోని నీలి ప్రావిన్స్‌కు చెందిన జహాన్తప్ అహ్మదీ(25) ఉన్నత పాఠశాల స్థాయి వరకు చదువుకుంది. వివాహం కావటంతో మెట్టినింటికి చేరుకుంది. భర్త నిరక్షరాస్యుడు. ఆ గ్రామంలో ఉన్న ఏకైక ప్రాథమిక పాఠశాలలో చదువు చెప్పేందుకు ఆమెకున్న విద్యార్హత సరిపోతుంది. అయితే, ఇంకా చదవాలన్నది ఆమె ఆశయం. అందుకోసం వర్సిటీ ప్రవేశపరీక్షకు ప్రిపేరయింది. ప్రొవిన్షియల్ రాజధాని దైకుందిలో జరిగే పరీక్షకు వెళ్లాంటే చాలాదూరం ప్రయాణించాల్సి ఉంటుంది. ఎలాంటి సౌకర్యాలు లేని ఆ గ్రామం నుంచి జహాన్తప్ తన రెండు నెలల పసికందును ఎత్తుకుని కాళ్లు బొబ్బలెక్కేలా నడిచింది. అనంతరం 10 గంటలపాటు గతుకుల రోడ్డులో, కిక్కిరిసిన బస్సులో ప్రయాణించి దైకుంది చేరుకుంది. పక్కనే బిడ్డను పడుకోబెట్టుకుని, నేలపైనే కూర్చుని పరీక్ష రాసింది. ఈ పరీక్షలో 200కు గాను 152 మార్కులు సంపాదించింది. ఆమె అలా పరీక్ష రాయటాన్ని ఒక టీచర్ చూసి మెచ్చుకున్నారు. ఆ ఫొటో తీసి, ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. కాబూల్‌లో పనిచేసే జహ్రా యగానా అనే ఓ స్వచ్ఛంద నిర్వాహకురాలు చూసి జహాన్తప్ను పిలిపించుకున్నారు. యూనివర్సిటీలో చేరేందుకు సాయపడ్డారు. అక్కడి మహిళా అధికారులను ఒప్పించి.. ట్యూష న్ ఫీజు, ఇతర ఖర్చులు, ఆమె కుటుంబం బస చేయటానికి వసతులను కల్పించారు. ‘నా పిల్లల కోసమే చదువుకోవాలనుకున్నా. నేను చదువుకుంటా.. మా గ్రామస్తులకు, తోటి వారికి సాయం చేస్తా..’అంటోంది జహాన్తప్. అలా..ఆమె కలను ఫేస్బుక్ నిజం చేసింది..! అఫ్గానిస్తాన్‌లోని బడి అంటే తెలియని 35 లక్షల మంది చిన్నారుల్లో మూడొంతుల మంది బాలికలేనని ఐరాస గణాంకాలు చెబుతున్నాయి. -
సీఎం కేసీఆర్ కల నెరవేర బోతోంది
కాళేశ్వరం(మంథని) : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మిస్తున్న ‘కాళేశ్వరం’ ప్రాజెక్టుతో సీఎం కేసీఆర్ కల సాకారం అవుతుం దని జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అన్నారు. శుక్రవారం ఉదయం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అన్నారంలో నిర్మిస్తున్న అన్నారం బ్యారేజీ పనులను మంత్రి హరీష్‌రావుతో కలసి పరిశీలించారు. అనంతరం విలేకర్లతో మాట్లాడారు. నిరుపేద రైతుల పంటపొలాలకు ఈ ప్రాజెక్టు ద్వారా సాగునీరందుతుందన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే నిరుపేదలకు ఎంతగానో మేలు జరుగుతుందని తెలిపారు. బీడు భూములన్ని సస్యశామలంగా మారుతాయని ఆశాభావ ం వ్యక్తం చేశారు.ఆయన వెంట కాళేశ్వరం బ్యారేజీ చీప్ ఇంజనీర్ నల్ల వెంకటేశ్వర్లు, అఫ్కాన్ కంపెనీ డైరెక్టర్ మల్లికార్జున్‌రావు, ఈఈ మల్లికార్జున్‌ప్రసాద్, డీఈఈ యాదగిరి, అప్కాన్ హెచ్ఆర్ మేనేజర్ గోవర్ధన బార్గవలు ఉన్నారు. -
‘డబుల్’ కల నెరవేరేనా..?
సంస్థాన్ నారాయణపురం : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం పేదలు ఎదురుచూస్తున్నారు. మండలంలో 14 గ్రామాలు ఉంటే, మొదటి విడత సర్వేల్లో రెండు ఎకరాల భూమిలో 64, సంస్థాన్ నారాయణపురం గ్రామానికి సంబంధించి కంకణాలగూడెం గ్రామా రెవెన్యూ పరిధిలో మూడు ఎకరాల భూమిలో 138 ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. సర్వేల్లో గతేడాదే.. నిర్మాణ పనులు ప్రారంభం కాగా.. సంస్థాన్ నారాయణపురంలో నేటికీ పనులు ప్రారంభం కాలేదు. మిగతా 12 గ్రామాల్లో ఒక్క ఇల్లు కూడా మంజూరు కాలేదు. సర్వేల్లో పురోగతి.. నియోజకవర్గంలో సర్వేల్లో డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి మొట్టమొదట నిర్వహించారు. రూ.3.78కోట్లతో చేపట్టిన ఇళ్ల నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దసరా నాటికి గృహప్రవేశాలు చేసేలా పనులు సాగుతున్నాయి. కానీ సంస్థాన్ నారాయణపురంలో పనులు ప్రారంభం కాలేదు. దీంతో ఇక్కడ ఇళ్లు ఎప్పుడు పూర్తవుతాయోనని ప్రజలు ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం చొరవ తీసుకుని మిగతా గ్రామాల్లో కూడా డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని ప్రజలు అధికారులు, ప్రజాప్రతినిధులను కోరుతున్నారు. -
జనతా రాజ్యం వర్ధనరావు స్వప్నం
తెనాలి : జనతా రాజ్యమే ఏకైక విముక్తి మార్గమని విశ్వసించిన రాడికల్ యువజన సంఘం (ఆర్‌వైఎల్) రాష్ట్ర తొలి అధ్యక్షుడు, విరసం సభ్యుడు పీజే వర్ధనరావు, తన ఆశయం దిశగా నిబద్ధతతో వ్యవహరించారని పలువురు విప్లవాభిమానులు, సాహితీమిత్రులు, రాజకీయ ప్రముఖులు నివాళులర్పించారు. ఆకస్మికంగా కన్నుమూసిన వర్ధనరావు అంత్యక్రియలను సోమవారం నిర్వహించారు. అయితానగర్‌లోని స్వగహం వద్ద నిర్వహించిన సంతాపసభకు వర్ధనరావు సన్నిహితుడు ప్రదీప్ అధ్యక్షత వహించారు. మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ మాట్లాడుతూ జనతా రాజ్యం వర్ధనరావు స్వప్నమని కొనియాడారు. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి మాట్లాడుతూ రాజకీయ మార్గం ఏదైనా వర్ధనరావు మనిషిగా ఉన్నతుడని చెప్పారు. విరసం జిల్లా అధ్యక్షుడు సీఎస్సార్ ప్రసాద్ మాట్లాడుతూ విప్లవ భావజాలానికి కట్టుబడినప్పటికీ కొన్ని అనివార్య కారణాలతో భౌతికంగా దూరంగా ఉండిపోయినా, మద్దతును కొనసాగించారని చెప్పారు. సివిల్ లిబర్జీస్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ రాజారావు మాట్లాడుతూ రాజ్యహింసను అనుభవించి కూడా వర్ధనరావు విప్లవోద్యమానికి అద్భుతమైన కంట్రిబ్యూషన్ ఇచ్చినట్టు చెప్పారు. ఆర్‌వైఎల్ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు రామారావు మాట్లాడుతూ వర్ధనరావు ఆర్‌వైఎల్ అధ్యక్షుడిగా రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి, విప్లవోద్యమం జీవించే ఉందనీ, ముందుకు తీసుకెళతామని ప్రతిజ్ఞచేసినవారిలో ఒకరని గుర్తుచేసుకొన్నారు. జనసాహితి నాయకుడు దివికుమార్ మాట్లాడుతూ వర్ధనరావు వంటి ఉన్నత ఆశయాలు కలిగిన వ్యక్తి వతి సమాజానికి తీరని నష్టమన్నారు. కులనిర్మూలన పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు కె.కష్ణ మాట్లాడుతూ పెరుగుతున్న కులోన్మాదాన్ని కట్టడి చేయాల్సిన చారిత్రక బాధ్యత ఉందని నమ్మిన వర్ధనరావు తుదివర కు కట్టుబడ్డారని చెప్పారు. దళిత సార్వత్రిక విశ్వవిద్యాలయం వైస్‌చాన్సలర్ డాక్టర్ జి.కపాచారి, జేఎస్ఆర్ కష్ణయ్య, ఉన్నం లక్ష్మయ్య, తురుమెళ్ల శ్యాంషా, ఎంజే విద్యాసాగర్, కనపర్తి బెన్హర్ మాట్లాడారు. జీఎస్ నాగేశ్వరరావు, ఉమారాజశేఖర్, రాఘవరెడ్డి తదితరులు పర్యవేక్షించారు.