
ప్రతీకాత్మకచిత్రం
రాంచీ : ఆలయంలో మద్యం సేవించరాదని వారించినందుకు 55 ఏళ్ల పూజారి రాం సుందర్ భుయాను కొందరు వ్యక్తులు అత్యంత పాశవికంగా హత్య చేసిన ఘటన జార్ఖండ్‌లో వెలుగుచూసింది. విష్ణుపుర పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలోని ఆలయంలో కొందరు వ్యక్తులు మద్యం, మాంసాహారం తీసుకోవడాన్ని పూజారి రాం సుందర్ అడ్డుకున్నారు.
పూజారిపై ఆగ్రహించిన నిందితులు ఆయనపై కత్తితో దాడిచేశారు. కత్తిపోట్లతో తీవ్రంగా గాయపడిన పూజారిని చెట్ల పొదల్లో పడవేశారు. ప్రాణాపాయ స్థితిలో పూజారిని గుర్తించిన స్దానికులు ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించారు. కాగా తనపై అదే గ్రామానికి చెందిన జితు భుయా దాడి చేశాడని రాం సుందర్ మరణ వాంగ్మూలంలో పేర్కొన్నాడు. బాధితుడి స్టేట్‌మెంట్ ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment