రాంచీ: దేశంలో వరుస నిర్భయ ఉదంతాలు మహిళ భద్రతను ప్రశ్నార్థకం చేస్తోంది. ఉత్తరప్రదేశ్‌లో బధువా ఘటనను తలపించేలా 50 ఏళ్ళ మహిళపై సామూహిక అత్యాచార ఘటన కలకలం రేపుతోంది. జార్ఖండ్ రాష్ట్రం చత్రాలోని హంటర్‌గంజ్ ప్రాంతంలో ఈ దారుణం వెలుగుచూసింది. గురువారం రాత్రి బహిర్భూమి కోసం ఇంటి నుంచి బయటకు వచ్చిన మహిళను ముగ్గురు వ్యక్తులు కిడ్నాప్ చేశారు. అనంతరం ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతటితో వారి ఆగడాలు ఆగలేదు. ఆమె ప్రైవేట్ భాగాలలో స్టీల్ టంబ్లర్‌ను చొప్పించి మరీ మాటల్లో చెప్పలేని విధంగా దారుణంగా హింసించారు. అంతేనా ఈ విషయాన్ని బయటకు చెబితే భయంకరమైన పరిణామాలుంటాయని, చంపేస్తామని బెదిరించి వెళ్లిపోయారు. (ఆ దుర్మార్గుడు దొరికాడు)
అయితే బయటకు వెళ్లిన బాధితురాలు ఎంతకీ తిరిగి రాకపోవడంతో, వెతకడానికి బయలుదేరిన కుటుంబ సభ్యులు రక్తపు మడుగులో పడి ఉన్న ఆమెను గుర్తించారు. వెంటనే ఆమెను హంటర్‌గంజ్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడినుంచి బీహార్‌లోని గయాలోని అనుగ్రా నారాయణ్ మగధ్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ప్రాణాపాయస్థితిలో చికిత్స తీసుకుంటోందని వైద్యులు తెలిపారు. (ఎన్‌సీడబ్ల్యు సభ్యురాలి అనుచిత వ్యాఖ్యలు : తాప్సీ ఫైర్)
కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు. సత్వరమే విచారణ చేపట్టి నిందితులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు చేపడతామని ఎస్పీ రిషబ్ ఝా తెలిపారు. కాగా ఈ కేసుకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసిన పోలీసులు పరారిలో ఉన్న మరో వ్యక్తి కోసం గాలిస్తున్నారు. (కామాంధుల క్రూరత్వానికి పరాకాష్ట.. మహిళ మృతి)
Comments
Please login to add a commentAdd a comment