ఇషాన్ కిషన్ రీఎంట్రీ.. ఆ జట్టు కెప్టెన్‌గా ఎంపిక? | Ishan Kishan To Lead Jharkhand In Buchi Babu Tournament Starting From August 15th In Tamil Nadu | Sakshi
Sakshi News home page

#Ishan Kishan: ఇషాన్ కిషన్ రీఎంట్రీ.. ఆ జట్టు కెప్టెన్‌గా ఎంపిక?

Published Tue, Aug 13 2024 11:02 AM | Last Updated on Tue, Aug 13 2024 11:47 AM

Ishan Kishan To Lead Jharkhand In Buchi Babu Tournament

టీమిండియా యువ వికెట్ కీప‌ర్ ఇషాన్ కిష‌న్ ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ద‌మయ్యాడు. బుచ్చి బాబు టోర్నమెంట్‌లో జార్ఖండ్ జ‌ట్టుకు కిష‌న్‌ సార‌థ్యం వ‌హించ‌నున్నాడు. ఈ విష‌యాన్ని జార్ఖండ్ స్టేట్ క్రికెట్ అసోసియేషన్ ధ్రువీక‌రించిన‌ట్లు ఈఎస్పీఎన్ క్రిక్ ఇన్ ఫో త‌మ క‌థ‌నంలో పేర్కొంది. 

ఈ బుచ్చిబాబు టోర్నీ చెన్నై వేదిక‌గా ఆగస్టు 15 నుంచి ప్రారంభం కానుంది. ఈ టోర్నీ కోసం జార్ఖండ్ జ‌ట్టు ఇప్ప‌టికే చెన్నైకు చేరుకుంది. కాగా తొలుత కిష‌న్ ఈ టోర్నీకి దూరంగా ఉండాల‌ని భావించాండంట. ఈ క్రమంలోనే మొదట ప్రకటించిన జార్ఖండ్ జట్టులో కిషన్‌కు జెఎస్‌సీఎ సెలక్టర్లు చోటివ్వలేదు.

అయితే తర్వాత ఇషాన్ తన నిర్ణయాన్ని మార్చకుని, ఈ బుచ్చిబాబు టోర్నీకి అందుబాటులో ఉంటానని జెఎస్‌సీఎకు తెలియజేశాడు. ఈ నేపథ్యంలోనే తమ జట్టు పగ్గాలను అతడికి జార్ఖండ్‌ స్టేట్ క్రికెట్ అసోసియేషన్ అప్పగించింది. కిషన్‌ బుధవారం(ఆగస్టు 14) చెన్నైలో ఉన్న  తన జట్టుతో కలవనున్నట్లు తెలుస్తోంది. 

ఇక ఈ టోర్నీలో కిషన్‌ అద్భుతంగా రాణిస్తే భారత క్రికెట్‌లో తిరిగి పునరాగమనం చేసే అవకాశముంటుంది. కాగా  దేశ‌వాళీ క్రికెట్‌లో ఆడాల‌న్న త‌మ‌ ఆదేశాల‌ను దిక్క‌రించ‌డంతో కిష‌న్‌పై బీసీసీఐ వేటు వేసిన సంగ‌తి తెలిసిందే. జాతీయ జ‌ట్టులో చోటుతో పాటు బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌ను ఈ జార్ఖండ్ డైన‌మెట్ కోల్పోయాడు.

అసలేంటి ఈ బుచ్చి బాబు టోర్నీ..?
దక్షిణాది భారత క్రికెట్ పితామహుడు ఎం. బుచ్చి బాబు నాయుడు(మోతవరపు వెంకట మహిపతి నాయుడు) పేరు మీద ఈ టోర్నీని నిర్వహిస్తున్నారు.  దాదాపు ఆరేళ్ల తర్వాత ఈ టోర్నీ జరగనుంది. చివరగా 2017లో జరిగింది. ఈ ఏడాది టోర్నీలో మొత్తం 12 జట్లు పాల్గోనున్నాయి. వాటిని రెండు గ్రూపులుగా విభిజించారు.  తమిళనాడులోని తిరునెల్వేలి, కోయంబత్తూరు, సేలం, నాథమ్ వేదికగా మ్యాచ్‌లు జరగనున్నాయి
జట్లు ఇవే
గ్రూప్ ఎ: మధ్యప్రదేశ్(డిఫెండింగ్ ఛాంపియన్ ), జార్ఖండ్, హైదరాబాద్

గ్రూప్ బి: రైల్వేస్, గుజరాత్, TNCA ప్రెసిడెంట్స్ XI
గ్రూప్ సి: ముంబై, హర్యానా, TNCA XI
గ్రూప్ డి: జమ్మూ & కాశ్మీర్, బరోడా, ఛత్తీస్‌గఢ్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement