రాంచీ: ఉత్తర దేశాన్ని ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు వణికిస్తున్నాయి. జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో పలు చోట్ల పిడుగులు పడి 33 మంది మృతి చెందారు. జార్ఖండ్ రాష్ట్రంలో 17 మంది మృతిచెందారు. మరో 28 మందికి పైగా గాయపడ్డారని ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. యూపీలోని ఉన్నావ్ జిల్లాలో గత రాత్రి పిడుగులు పడి ఐదుగురు మృతిచెందగా.. మరో నలుగురు గాయపడ్డారు. కాన్పూర్‌లో ఇద్దరు, రాయ్‌బరేలీలో మరో ఇద్దరు కూడా పిడుగుపాటుకు మృతిచెందారు. నేడు ఉరుములు, పిడుగులతో కూడిన భారీ వర్షం పడే సూచనలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఇదిలా ఉండగా సోమవారం నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయని ప్రైవేట్ వాతావరణ ఏజెన్సీ స్కైమెట్ తెలిపింది. కేరళ తీరాన్ని రుతుపవనాలు తాకాయని స్కైమెట్ పేర్కొనగా మే 29న రుతుపవనాలు ప్రవేశిస్తాయని భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) పేర్కొంది. అయితే నేడు నైరుతి రుతుపవనాలు కేరళను తాకుతాయని ఐఎండీ వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment