రాంచీ : రెడ్ కారిడార్‌లో మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. టాప్ నక్సల్ కమాండర్ దేవ్‌కుమార్ సింగ్ అలియాస్ అరవింద్‌జీ మృతితో నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో భద్రతా దళాలకు భారీ ఊరటగా భావిస్తున్నారు. ఏ కేటగిరీ నక్సల్ నేతగా ప్రభుత్వం గాలిస్తున్న అరవింద్ జార్ఖండ్‌లో గుండె పోటుతో మరణించారు. ఆయన తలపై ప్రభుత్వం రూ 1.5 కోట్ల రివార్డు ప్రకటించింది. మావోయిస్టు ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తున్న అరవింద్ అంతర్ జిల్లా తీవ్రవాద కార్యకలాపాల్లో ఆరితేరినట్టు చెబుతారు. జార్ఖండ్ పోలీసు రికార్డుల ప్రకారం అరవింద్ ఏళ్ల తరబడి జార్ఖండ్‌లో నకల్స్ కార్యకలాపాలకు వ్యూహకర్త, మాస్టర్‌మైండ్.
బుదపహార్ ప్రాంతంతో పాటు పలు అటవీ ప్రాంతాల్లో అరవింద్ కదలికలను పలు సందర్భాల్లో పసిగట్టినట్టు భద్రతా దళాలు పేర్కొన్నాయి. భద్రతా దళాల కన్నుగప్పి ఆయన ఎన్నో సార్లు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. 50 ఏళ్లు పైబడిన అరవింద్ ఛత్తీస్‌గడ్ సరిహద్దులోని జార్ఖండ్ బుధ పహద్ అడవుల్లో గుండెపోటుతో మరణించారు. నిషాంత్‌గా కూడా పేరొందిన అరవింద్ ఉన్నత విద్యను అభ్యసించి టెక్నాలజీ నిపుణుడిగా కూడా పేరుతెచ్చుకున్నారు.
రాష్ట్ర సీఆర్‌పీఎఫ్ బలగాలతో పాటు భద్రతా దళ సిబ్బందిని హతమార్చడం, దాడులకు పాల్పడటం వంటి పలు కేసుల్లో అరవింద్ ప్రమేయం ఉంది. బీహార్‌లోని జెహనాబాద్‌కు చెందిన అరవింద్‌జీ జార్ఖండ్‌లోని మావో ప్రభావిత పలము, గర్హ్వ, ఛత్ర జిల్లాల్లో మావోయిస్టు కార్యకలాపాల్లో చురుకుగా ఉండేవారు.
Comments
Please login to add a commentAdd a comment