![BJP Wins All Mayoral posts In Jharkhand - Sakshi](/styles/webp/s3/article_images/2018/04/20/Jharkhand.jpg.webp?itok=xsyfcRlx)
సాక్షి, రాంచీ : జార్ఖండ్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించింది. శుక్రవారం జరిగిన ఓట్ల లెక్కింపులో ఐదు మేయర్ స్ధానాలనూ గెలుచుకుంది. హజారిబాగ్, గిరిధ్, ఆదిత్యాపూర్, రాంచీ, మేదినీనగర్ కార్పొరేషన్‌లలో మేయర్ పదవులను బీజేపీ దక్కించుకుంది.
ఈనెల 16న ఐదు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ జరిగింది. ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్, జేఎంఎంలు హోరాహోరీగా తలపడ్డాయి. గెలుపుపై మూడు పార్టీలూ ధీమా వ్యక్తం చేశాయి. పలు కార్పొరేషన్లలో డిప్యూటీ మేయర్ పదవులనూ బీజేపీ గెలుచుకుంది. ఐదు కార్పొరేషన్లలోనూ పార్టీ ఘనవిజయం పట్ల బీజేపీ శ్రేణులు సంబరాల్లో మునిగితేలాయి. మేయర్ ఎన్నికల్లో త్రిముఖ పోరు బీజేపీకి లాభించిందని పరిశీలకులు విశ్లేషించారు.
Comments
Please login to add a commentAdd a comment