జార్ఖండ్‌లోని గొడ్డ లోక్‌సభ నియోజకవర్గంలో విచిత్ర ఎన్నికల వాతావరణం నెలకొంది. ఇక్కడి నుంచి ఎన్నికల బరిలోకి దిగిన ఎంపీ, బీజేపీ అభ్యర్థి నిషికాంత్ దూబే ప్రతిపక్షాలకు గట్టి సవాల్ విసిరారు.
నిషికాంత్ దూబే మీడియాతో మాట్లాడుతూ రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో తనకు పోటీనిచ్చే బలమైన నేత జేఎంఎంలో లేరని ఆరోపించారు. ఒకవేళ జేఎంఎం ఎవరినైనా తనకు ప్రత్యర్థిగా నిలబెడితే, తాను ప్రచారం చేయనని అన్నారు. అలాగే ప్రదీప్ యాదవ్‌ను కాంగ్రెస్ నిలబెట్టినా తాను ప్రచారానికి వెళ్లనని, నేరుగా ఫలితాల అందుకునేందుకే వెళతానని అన్నారు. నామినేషన్ దాఖలు చేశాక, ఫలితాల కోసం ఎదురు చూస్తానని వ్యాఖ్యానించారు.
అయితే ఈ ఎన్నికల ప్రచార సమయంలో తాను టైమ్‌పాస్ చేయడానికి ఎక్కడో ఒకచోట టీ తాగుతూనో, క్రికెట్ ఆడుతూనో కాలం గడుపుతానని అన్నారు. ఇక్కడి నుంచి జేఎంఎం తమ అభ్యర్థిని బరిలోకి దింపే యోచనలో ఉన్నట్లు తెలుస్తున్నదన్నారు. తన గెలుపుపై తనకు అపార నమ్మకం ఉందని, బహుశా ఇక్కడ ప్రచారం చేయాల్సిన అవసరమే ఉండదన్నారు. జార్ఖండ్ ముక్తి మోర్చాలో తనతో పోరాడే అభ్యర్థి లేడని, ఆ పార్టీ నేతలు స్టీఫెన్ మరాండీ, నలిన్ సోరెన్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు నిరాకరించారని ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment