దేశంలో త్వరలో జరగబోయే లోక్‌సభ ఎన్నికలు పలు చోట్ల ఆసక్తికరంగా మారాయి. యూపీలోని గౌతమ్ బుద్ధ నగర్ లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి అన్ని పార్టీలు తమ అభ్యర్థుల పేర్లను వెల్లడించాయి. ఇంతలోనే ఈ స్థానం నుంచి ఒక ఆటో డ్రైవర్ ఎన్నికల రంగంలోకి దూకి, తాను బీజేపీ అభ్యర్థి డాక్టర్ మహేశ్ శర్మ, ఎస్పీ అభ్యర్థి మహేంద్ర నగర్‌లకు పోటీ ఇస్తానని చెబుతున్నాడు.
మధ్యప్రదేశ్‌కు చెందిన జ్ఞానదీప్ అనే ఆటో డ్రైవర్ గౌతమ్ బుద్ధ నగర్ లోక్‌సభ ఎన్నికల్లో తన పోటీకి సంబంధించి నామినేషన్ పత్రాలను జిల్లా మేజిస్ట్రేట్ కార్యాలయంలో దాఖలు చేశాడు. ఈయన ఆటో నడుపుతూ చాలాకాలంగా గ్రేటర్ నోయిడాలో తన కుటుంబంతో పాటు ఉంటున్నాడు. జ్ఞాన్‌దీప్ మీడియాతో మాట్లాడుతూ గౌతమ్‌బుద్ధనగర్‌లో ఇప్పటి వరకు ఏ నేత కూడా అభివృద్ధి పనులు చేపట్టలేదని, అందుకే తాను రంగంలోకి దిగుతున్నానని తెలిపాడు. తాను మార్పును కోరుకుంటున్నానని, అందుకోసం పాటుపడతానని పేర్కొన్నాడు. స్థానికంగా రోడ్లు అస్తవ్యస్తంగా తయారయ్యాయని, అయినా ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోయాడు. తాను రాబోయే ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి డాక్టర్ మహేశ్ శర్మ, ఎస్పీ అభ్యర్థి మహేంద్ర నగర్‌లకు పోటీగా నిలుస్తానని తెలిపాడు.
తాను ఎంపీగా ఎన్నికైతే స్థానికంగా మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని, ట్రాన్స్‌జెండర్లకు ఇళ్లు మంజూరు చేయడంతోపాటు వారికి ఉపాధి కల్పించేందుకు చేయూతనిస్తానని అన్నాడు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో 24 గంటలూ వైద్యులు అందుబాటులో ఉండేలా, వారు మూడు షిఫ్టుల్లో పనిచేసేలా చూస్తానని పేర్కొన్నాడు..
लोकसभा चुनाव 2024
— Tricity Today (@tricitytoday) April 1, 2024
गौतमबुद्ध नगर में खड़ा हुआ गजब उम्मीवार, भाजपा-सपा को टक्कर देने आया एमपी का ड्राइवर, देखिए दिलचस्प वीडियो @ECISVEEP #LokSabhaElection2024 #Noida
(@mayank_tawer ) pic.twitter.com/1HIsaBPEWo
Comments
Please login to add a commentAdd a comment