రాత్రిపూట బ్రిడ్జ్‌పై వింత ఆకారం తిరుగుతున్నట్లు వీడియో ఒకటి ఇంటర్నెట్లో, మీడియా చానెల్స్‌లో కథనాలు ప్రసారం అవుతోంది. ఆ టైంలో కొందరు బైకర్స్ వీడియో తీసి వైరల్ చేయడంతో అది అంతటా పాకింది. అది ఏలియన్ అని కొందరు, కాదు బ్రిడ్జ్ దగ్గర్లో శ్మశానం ఉండడంతో దెయ్యం అని మరికొందరు ప్రచారం మొదలుపెట్టారు. అయితే ఈ వీడియో పోలీసుల దాకా చేరడంతో దర్యాప్తు మొదలుపెట్టారు.
రాంచీ: బ్రిడ్జ్ మీద వింత ఆకారం పేరుతో వీడియో ఒకటి విపరీతంగా షేర్ అవుతున్న విషయం తెలిసిందే. హజారిబాఘ్ సమీపంలోని ఓ బ్రిడ్జ్ మీద ఇది జరిగిందని ప్రచారం నడుస్తోంది. మే 28న రాత్రి ఎనిమిది గంటల సమయంలో బైకులపై వెళ్తున్న కొందరు ఆ వింత ఆకారాన్ని గుర్తించారని, వీడియో తీసి వైరల్ చేశారని అక్కడి లోకల్ మీడియా ఛానెల్స్ కథనాల్ని ప్రచురించాయి. దీంతో పంజాబ్ కేసరి ఫేస్బుక్ ఛానెల్ ఆ వీడియోను అప్లోడ్ చేసి.. వింత ఆకారం సంచరించడంపై స్థానికులు ఆందోళన చెందుతున్నారంటూ పోస్టులు పెట్టడంతో మెయిన్ స్ట్రీమ్ మీడియాకు విషయం చేరింది.
అయితే వైరల్ వీడియో తమ దృష్టిలోకి వచ్చిందని హజారిబాగ్‌లోని పెలావాల్ స్టేషన్ ఇన్‌ఛార్జి వికర్ణ కుమార్ తెలిపారు. ‘‘సోషల్ మీడియా ద్వారా వీడియో మా దృష్టికి వచ్చింది. ఛాద్వా డ్యామ్ బ్రిడ్జ్ దగ్గర ఈ ఘటన జరిగింది. ఆరోజు వాతావారణం బాగోలేదు. పైగా బ్రిడ్జ్ దగ్గర్లో మతిస్థిమితం లేని ఓ వ్యక్తి తిరుగుతుంటాడు. బహుశా ఆ వ్యక్తే నగ్నంగా తిరిగి ఉంటాడని అనుమానిస్తున్నాం’’ అని ఆయన చెప్పారు. ఇక ఫ్రాంక్ వీడియోలు తీసే ఆకతాయిల మీదా అనుమానం వ్యక్తం చేస్తూ ఆ కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నామమని వెల్లడించారు. కాగా, గతంలో ఇలాంటి ఘటన ఎప్పుడూ ఎదురు కాలేదని స్థానికులు అంటున్నారు. అయితే ఆ బ్రిడ్జ్‌కి వంద మీటర్ల దూరంలో ఓ వ్యక్తి బట్టలు లేకుండా తిరిగే విషయాన్ని మాత్రం నిర్ధారించారు. బహుశా అతని వీడియోను మార్ఫింగ్ చేసి ఎవరైనా ఉత్త ప్రచారానికి తెరలేపి ఉండొచ్చని కొందరు యువకులు అనుమానిస్తున్నారు. ఈరోజుల్లో టెక్నాలజీ ఉపయోగించి ఎలాంటి వీడియోను అయినా క్రియేట్ చేయొచ్చు. ఇది కూడా అలాంటిదేమోనని.. ఈ వీడియోపై త్వరలోనే పూర్తి నిజాలు తేలుస్తాం వికర్ణ తెలిపారు.
జోకులు
రాత్రి పూట బ్రిడ్జ్‌పై వెళ్తున్న కొందరు ఆ ఆకారం దగ్గరకు వెళ్లగానే ‘‘దెయ్యం దెయ్యం’’ అంటూ అరుస్తూ వీడియో షూట్ చేశారు. ఇక జార్ఖండ్ వైరల్ వీడియోపై సోషల్ మీడియా సరదా కామెంట్లతో నిండిపోయింది. ఇది ఫ్రాంక్స్టర్ల పని కావొచ్చని, క్యాస్టూమ్.. లైటింగ్ ఎఫెక్ట్ మాయాజాలం అయ్యి కూడా ఉండొచ్చని కొందరు కామెంట్లు పెడుతున్నారు. మరికొందరేమో ఏలియన్లు వ్యాక్సినేషన్ కోసం వచ్చి ఉంటాయని, అయినా ఏలియన్లు అమెరికాలో తప్ప ఈ భూమ్మీద ఇంకెక్కడ కనిపించవని జోకులు వేస్తే.. ఇంకొందరేమో ఈ వీడియో సంగతేంటో చూడండంటూ నాసాకి, ఎలన్ మస్క్‌కి ట్యాగులు చేస్తున్నారు.
చదవండి: మోదీసార్.. మాకెందుకీ కష్టాలు
Comments
Please login to add a commentAdd a comment