
రాంచీ : మనిషి చేయి ఒకటి బకెట్‌లో లభించడం కలకలం రేపింది. ఈ ఘటన జార్ఖండ్‌లోని బారియాటు ప్రాంతంలో ఆదివారం చోటుచేసుకుంది. బకెట్‌లో తెగిన చేయి ఒకటి కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే ఈ విషయాన్ని రాంచీ పోలీసులకు సమాచారమందించారు. పోలీసులు వచ్చి బకెట్‌లో లభించిన చేతిని స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ తెగిన చేతి ఒక క్యాన్సర్ పేషంట్‌దని తమ దర్యాప్తులో తేలిందని పోలీసులు వెల్లడించారు. పరీక్షకు సంబంధించి ల్యాబ్‌కు పంపేందుకు ఒక చోట ఉంచగా అది మాయమైనట్లు సదరు ఆసుపత్రి సిబ్బంది పేర్కొంది. కాగా తెగిన చేయి ఆసుపత్రి నుంచి బకెట్‌లోకి ఎలా వచ్చిందన్న దానిపై విచారణ జరుపుతున్నట్లు రాంచీ సిటీ ఎస్పీ సౌరభ్ తెలిపారు.
చదవండి : అస్సాంలో దారుణం.. ఆలస్యంగా వెలుగులోకి
గోద్రా అల్లర్లు: మోదీ పేరు తొలగింపు
Comments
Please login to add a commentAdd a comment