hand amputed
-
పడిలేచిన ‘ప్రగతి’!
అవయవాలన్నీ బాగున్నప్పటికీ కష్టపడకుండా ఎవరో ఒకరి మీద ఆధారపడి జీవిస్తుంటారు కొందరు. రెండు చేతులు కోల్పోయిన ఓ అమ్మాయి మాత్రం ఎవరి మీదా ఆధారపడకుండా, తన పనులు తానే చేసుకుంటూ, ఖర్చులకోసం సొంతంగా సంపాదిస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తోంది. ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌కు చెందిన ప్రగతి దురదృష్ట వశాత్తు రెండు చేతులను కోల్పోయింది. 2010లో ప్రగతి అనుకోకుండా విద్యుత్ సరఫరా అవుతున్న వైర్‌ను పట్టుకోవడంతో..∙రెండు చేతులు కాలిపోయాయి. చికిత్సలో భాగంగా చేతులను మోచేయి వరకు డాక్టర్లు తొలగించారు. దీంతో తన రోజువారి పనులు చేసుకోవడానికి కూడా ప్రగతి చాలా కష్టపడేది. అయినా ఎలాగైనా ఎవరిసాయం తీసుకోకుండా బతకాలనుకుంది. క్రమంగా తన ఆత్మవిశ్వాసం పెంపొందించుకుని మొబైల్ ఫోన్, కంప్యూటర్లను ఆపరేట్ చేయడం నేర్చుకుంది. అంతేగాకుండా ఒకపక్క విద్యార్థులకు పాఠాలు చెబుతూ మరోపక్క బ్యాంక్ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతోంది. ‘‘ఎన్ని కష్టాలు ఎదురైనా అమ్మాయిలు తమ కలల్ని నిజం చేసుకోవడంలో వెనక్కి తగ్గకుండా కష్టపడి సాధించాలి’’ అని ప్రగతి చెప్పింది. మొదట్లో తన పనులు తాను చేసుకోవడానికి కూడా చాలా కష్టంగా ఉండేది. క్రమంగా పనులు చేసుకోవడం మొదలు పెట్టాను. అలా పనులు చేసుకోవడం వల్ల ఏదైనా చేయగలను అనిపించింది. ఈ క్రమంలోనే ఫోన్ ఆపరేట్ చేయగలిగాను. తల్లిదండ్రులకు భారం కాకూడదన్న ఉద్దేశ్యంతో టీచర్‌గా పనిచేస్తూ సంపాదిస్తున్నానని, భవిష్యత్తులో బ్యాంక్ ఉద్యోగం పొందడమే తన కలని ప్రగతి చెప్పింది. -
బకెట్లో మనిషి చేయి లభ్యం
రాంచీ : మనిషి చేయి ఒకటి బకెట్లో లభించడం కలకలం రేపింది. ఈ ఘటన జార్ఖండ్‌లోని బారియాటు ప్రాంతంలో ఆదివారం చోటుచేసుకుంది. బకెట్లో తెగిన చేయి ఒకటి కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే ఈ విషయాన్ని రాంచీ పోలీసులకు సమాచారమందించారు. పోలీసులు వచ్చి బకెట్లో లభించిన చేతిని స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ తెగిన చేతి ఒక క్యాన్సర్ పేషంట్దని తమ దర్యాప్తులో తేలిందని పోలీసులు వెల్లడించారు. పరీక్షకు సంబంధించి ల్యాబ్‌కు పంపేందుకు ఒక చోట ఉంచగా అది మాయమైనట్లు సదరు ఆసుపత్రి సిబ్బంది పేర్కొంది. కాగా తెగిన చేయి ఆసుపత్రి నుంచి బకెట్లోకి ఎలా వచ్చిందన్న దానిపై విచారణ జరుపుతున్నట్లు రాంచీ సిటీ ఎస్పీ సౌరభ్ తెలిపారు. చదవండి : అస్సాంలో దారుణం.. ఆలస్యంగా వెలుగులోకి గోద్రా అల్లర్లు: మోదీ పేరు తొలగింపు -
వైద్యం చేతకాక చేయి తీసేశాడు
డాక్టర్లు శస్త్రచికిత్సల సందర్భంగా కడుపులో కత్తెర్లు మర్చిపోవడం, గుండెలో గుర్తులేక సూదులు వదిలేయడం గతించిన చరిత్ర, ఇప్పటి డాక్టర్లు వృత్తిని దైవంగా భావించి అప్రమత్తంగా తమ విధులు నిర్వహిస్తున్నారని భావిస్తున్న నేపథ్యంలో బీహార్‌లో ఓ డాక్టర్ వైద్యం చేతకాక ఏకంగా ఓ నాలుగేళ్ల చిన్నారి చేతినే తీసేశాడు. నావడా పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో రెండు రోజుల క్రితమే ఈ ఘోరం జరిగింది. దీన్ని తట్టుకోలేకపోయిన ఆ చిన్నారి తండ్రి ఉదయ్ ప్రసాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అక్కడ నమోదైన ఎఫ్ఐఆర్ ప్రకారం... నావడా జిల్లాలోని విశ్వన్పూర్ గ్రామానికి చెందిన ఉదయ్ ప్రసాద్ నాలుగేళ్ల కూతురు ఆంచల్ కుమారికి నెలరోజుల క్రితం ఓ ప్రమాదంలో ఎడమచేయి విరిగి వాచింది. ఆమెను ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చగా డాక్టర్ అరవింద్ కుమార్ వైద్యం చేస్తూ వచ్చారు. నెలరోజులైనా విరిగిన ఎముక అతుక్కోకపోగా వాపు కాస్తా ఇన్ఫెక్షన్కు దారితీసింది. డాక్టర్ మారు మాట్లాడకుండా ఆ చిన్నారి ఎడమ చేతిని శస్త్రచికిత్సతో తొలగించేశాడు. ఈ నిర్వాకంతో మండిపడిన ఆ చిన్నారి తండ్రి, ఇతర బంధువులు గురువారం జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా చేయడంతో డాక్టర్ వ్యవహారం మీడియా దృష్టికి వచ్చింది.