మోదీ ‍మూడోసారి ప్రధాని కాగానే.. | Modi Became Third Time Prime Minister This Man Cut Hair Beard After 4 Years, Know Reason Inside | Sakshi
Sakshi News home page

మోదీ ‍మూడోసారి ప్రధాని కాగానే..

Jun 12 2024 9:32 AM | Updated on Jun 12 2024 10:19 AM

Modi Became Third Time Prime Minister This Man Cut Hair Beard

ప్రధాని నరేంద్ర మోదీ మూడోసారి ‍ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇది జరిగిన వెంటనే జార్ఖండ్‌లోని గుమ్లాకు చెందిన వ్యక్తి తన అవతారాన్ని మార్చుకున్నాడు. అంతవరకూ అతనికి ఉన్న పొడవాటి, జుట్టు గడ్డంను కత్తిరించుకున్నాడు. వివరాల్లోకి వెళితే..

జార్ఖండ్‌లోని గుమ్లాలో గల  సిసాయి బ్లాక్‌లో నివసిస్తున్న ముఖేష్ శ్రీవాస్తవ డేవిడ్ ప్రధాని మోదీకి వీరాభిమాని. దీంతో ఆయన పలు సందర్భాల్లో మోదీ మీద తనకున్న అభిమానాన్ని వ్యక్తం చేస్తుండేవాడు. దీనిలో భాగంగానే నాలుగేళ్ల క్రితం ప్రధాని నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాని అయ్యాకనే తన జుట్టు, గడ్డం కత్తిరించుకుంటానని ప్రకటించాడు. మోదీ మూడోమారు ప్రధానిగా ఎంపికకాని పక్షంలో తన జీవితాంతం ఇలా గడ్డంతోనే ఉంటానని చెప్పాడు. దీనిపై ప్రతిపక్ష పార్టీల నేతలు, కార్యకర్తల ముందు ప్రమాణం కూడా చేశాడు.

నాటి సందర్భం గురించి డేవిడ్ మీడియాతో మాట్లాడుతూ నాలుగేళ్ల క్రితం ఒక రోజు తాను మార్కెట్‌లో ఉన్నప్పుడు, 2024లో నరేంద్ర మోదీ మరోమారు ప్రధాని కాలేరని ప్రతిపక్షానికి చెందిన కొందరు స్నేహితులు  అన్నారని, అప్పుడు తాను వారితో మోదీ మూడోసారి ప్రధాని కాకపోతే తాను జీవితాంతం షేవింగ్‌ చేసుకోనని ప్రమాణం చేశానని తెలిపారు. అయితే ఇప్పుడు తన కల నెరవేరిందని, మోదీ మూడోసారి ప్రధాని అయినందుకు ఎంతో సంతోషిస్తున్నానని, ఇప్పుడు తాను క్షవరం చేయించుకుంటానని డేవిడ్‌ తెలిపాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement