జంషెడ్‌పూర్: దేశంలోని పలు ప్రాంతాల్లో దుర్గామాత పూజలు ఘనంగా జరుగుతున్నాయి. ఇదే నేపధ్యంలో జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్‌లో ట్రాన్స్‌జంటర్లు దుర్గామాతకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. గత ఎనిమిదేళ్లుగా వీరు నవరాత్రులలో దుర్గామాతను ఘనంగా పూజిస్తున్నారు.
ఈ ట్రాన్స్‌జండర్లు దుర్గామాత విగ్రహం తయారీకి పశ్చిమ బెంగాల్ నుండి గంగానది మట్టిని తీసుకువచ్చి తమ చేతులతో విగ్రహాన్ని తయారు చేస్తారు. తాము చేసే ఆరాధన మిగిలినవారి ఆరాధనకు భిన్నంగా ఉంటుందని ఈ కమ్యూనిటీకి చెందిన అమర్జీత్ సింగ్ గిల్ తెలిపారు. తమ కమ్యూనిటీకి చెందినవారు ఈ తొమ్మిది రోజులు దుర్గా అమ్మవారి విగ్రహం ముందు కూర్చుని, తాము తమ జీవితంలో ఎదుర్కొన్న కష్టనష్టాలను చెప్పుకుంటారు. అలాగే ప్రపంచశాంతి కోసం ప్రార్థిస్తారు.
ప్రతి సంవత్సరం దేశంలోని పలు ప్రాంతాల నుంచి ట్రాన్స్‌జండర్లు ఇక్కడికి తరలివచ్చి, దుర్గమ్మవారి పూజల్లో పాల్గొంటారు. ఇక్కడ జరిగే పూజల్లో మతపరమైన నియమాలను అనుసరించడంతో పాటు ట్రాన్స్‌జండర్లు తమ భావోద్వేగాలను అమ్మవారితో పంచుకుంటారు.
ఇది కూడా చదవండి: అమెరికా వర్జీనియా నగరంలో వైభవంగా దసరా, బతుకమ్మ వేడుకలు!
Comments
Please login to add a commentAdd a comment