
రాంచి : ఎయిర్ రైఫిల్ షూటర్ తారా సహదేవ్ మాజీ భర్త రకిబుల్ హసన్ అలియాస్ రంజిత్ కోహ్లిపై సీబీఐ అధికారులు చార్జిషీటు దాఖలు చేశారు. రంజిత్‌గా పేరు మార్చుకుని తనను మోసపూరితంగా వివాహం చేసుకున్నాడంటూ తారా సహదేవ్ విడాకులు కోరిన విషయం తెలిసిందే. అదే విధంగా హిందువునైన తనను మతం మార్చుకోవాలంటూ ఒత్తిడి చేసి గృహహింసకు పాల్పడ్డాడంటూ ఆమె 2014లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో 2018లో వారిద్దరికి విడాకులు మంజూరయ్యాయి. అయితే రకిబుల్ లవ్ జీహాదీకి పాల్పడ్డాడంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో ఉద్దేశపూర్వకంగానే తారాను అతడు మోసం చేశాడన్న ఆరోపణలతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో రకిబుల్, అతడికి సహకరించిన వారిపై సీబీఐ అధికారులు శుక్రవారం చార్జిషీటు దాఖలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment