
రాంచీ: భారత జట్టులో అడప దడపా అవకాశాలు దక్కించుకుంటున్న వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ తన ఫీల్డింగ్‌తో మరొకసారి మెరిశాడు. దేవధార్ ట్రోఫీలో భాగంగా భారత్-సి తరఫున ఆడుతున్న దినేశ్ కార్తీక్.. భారత్-బితో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో ఒక అద్భుతమైన క్యాచ్‌తో అలరించాడు. భారత్-బి ఆటగాడు పార్థీవ్ పటేల్ బ్యాట్ ఎడ్జ్‌కు తగిలి ఆఫ్ సైడ్ నుంచి బయటకు వెళుతున్న బంతిని దినేశ్ కార్తీక్ గాల్లో డైవ్ కొట్టి ఒడిసి పట్టుకున్నాడు. ఇషాన్ పరోల్ వేసిన తొమ్మిదో ఓవర్ ఆఖరి బంతిని పార్థీవ్ ఆడబోగా అది కాస్తా ఎడ్జ్ తీసుకుంది. ఆ బంతి దాదాపు ఫస్ట్ స్లిప్‌కు కాస్త ముందు పడే అవకాశం ఉన్న తరుణంలో రెప్పపాటులో ఎగిరి ఒక్క చేత్తో అమాంతం అందుకున్నాడు.
దీనిపై సోషల్ మీడియలో దినేశ్ కార్తీప్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు. ‘ ఇప్పుడు చెప్పండి బాస్.. ఏమంటారు. కార్తీక్‌కు వయసు అయిపోయిదని చాలా మంది అంటున్నారు. ఇప్పటికీ పక్షిలా ఎగురుతూ క్యాచ్‌లు అందుకుంటున్నాడు. 2007లో ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌లో స్టీవ్ స్మిత్ క్యాచ్‌ను దినేశ్ ఎలా అందుకున్నాడో, ఇప్పుడు కూడా అదే తరహాలో పట్టుకున్నాడు. మరి దినేశ్ కార్తీక్‌కు వయసు అయిపోయిందని అందామా’ అంటూ ఒక అభిమాని పేర్కొన్నాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్-బి 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 283 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్(54), కేదార్ జాదవ్(86)లు హాఫ్ సెంచరీలతో మెరిశారు. చివర్లో విజయ్ శంకర్ 33 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 45 పరుగులు చేశాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్-సి ఆదిలోనే వికెట్‌ను కోల్పోయింది. శుభ్‌మన్ గిల్(1) నిరాశపరిచాడు.
JUST @DineshKarthik things🤞.. Whatt a grabbb🙌... Well done thala❤️❤️❤️ pic.twitter.com/Kf0nsg5T5o
— Sahil (@imsahil_27) November 4, 2019
Comments
Please login to add a commentAdd a comment